యాచారం లో బిజెపి జై బీమ్ దీక్ష


ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 3 (జనంసాక్షి): భారత రాజ్యాంగంపట్ల సీఎం కెసిఆర్ అనుచిత వ్యాఖ్యలకు  నిరసనగా   బిజెపి మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్ ఆధ్వర్యంలో డా. అంబేద్కర్, బాబు జగ్జివన్ రావు విగ్రహాలకు, పూలదండాలు సమర్పించి బీజేపీ భీమ్ దీక్ష  నిర్వహించారు.  హాజరైన కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ  దొడ్డిదారిన సీఎం అయ్యి ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకపోగా.. రాజ్యాంగాన్ని మార్చాలని అనడానికి సీఎం కేసీఆర్ కు సిగ్గుండాలన్నారు. తాండ్ర రవీందర్ మాట్లాడుతూ.. భర్తలు చనిపోయి 4 ఏళ్లు గడుస్తున్నా పింఛన్ ఇవ్వలేదని, గత 7 ఏళ్లుగా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదని, కరోనా కారణంగా అన్ని రకాల వ్యవస్థలు నాశనమై పోతే వాటి దిద్దుబాటుకు చర్యలు చేపట్టని సిఎం కేసీఆర్..  రాజ్యాంగాన్ని మారుస్తావా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.  కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ముంత జంగయ్య, బీజేవైఎం రాష్ట్ర నాయకులు పుప్పాల శాంతి కుమార్, బీజేవైఎం అసెంబ్లీ కన్వినర్ బలవర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు పత్తి రాజు, విష్ణురెడ్డి, ప్రధాన కార్యదర్శి నడికుడి కృష్ణ, కోశాధికారి రామ కృష్ణ, బీజేవైఎం మండల అధ్యక్షులు నాగరాజు తదితరులు ఉన్నారు.