జాతీయ లోక్ అదాలత్ అంటే శాశ్వత పరిష్కారం


 ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి.

జనం సాక్షి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం

మార్చ్ 12వ తేదీన మెగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ అంటే శాశ్వత పరిష్కారం స్వత్వర న్యాయం జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో గృహ హింస, బ్యాంక్ రికవరీ , మోటార్ వాహన నష్టపరిహార కేసులు , క్రిమినల్ కాంపౌండ్ డబుల్ ,భూసేకరణ నిర్వసిత కేసులు, రెవెన్యూ , సివిల్, విద్యుత్ చౌర్యం , ఎక్సైజ్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులు రాజ మార్గం ద్వారా పరిష్కరిస్తామని కక్షిదారులకు సత్వర న్యాయం అందిస్తామని పాపి రెడ్డి పేర్కొన్నారు . గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ లోక్ అదాలత్ పై విశృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ప్రధాన న్యాయూర్తి పాపిరెడ్డి. ప్రభుత్వ అధికారులు పోలీసులు , కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సూచించారు... ఈ కార్యక్రమంలో నాలుగవ అదనపు న్యాయవాది రాజు , సీనియర్ సివిల్ జడ్జి పుష్పాలత , సెక్రటరీ డిఎల్ఎస్ఏ ఆశాలత , జూనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ జలీల్ , స్పెషల్ ఎక్సైజ్ కోర్టు హనుమంతు రావు , మొబైల్ కోర్టు నిర్మలా తదితరులు పాల్గొన్నారు..