కూసుమంచి ఫిబ్రవరి 23 (జనం సాక్షి): మండలంలోని గొర్రెల పాడు తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని చాంప్ల తాండా లో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆంబోతు అకారణంగా మృత్యువాత పడటంతో గ్రామస్తులు ఆందోళనచెందారు. అనంతరం అట్టి మూగజీవి కి మండల పరిషత్ అధ్యక్షులు బానోతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉరేగింపు గా తీసుకువెళ్లి అంతిమ సంస్కారం జరిపించారు ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.