రెండు కార్లను దగ్ధం చేసిన దుండగులు

మెదక్‌,  ( జనం సాక్షి):   జిల్లాలోని తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధి పోతరాజ్‌ పల్లిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లను పెట్రోల్‌ పోసి దహనం చేశారు. అడ్వకేట్‌ మూత్తిగళ్ల అశోక్‌, అతని తమ్ముడు ముత్తిగళ్ళ విజయేందర్‌ కార్లను అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో దుండగులు దగ్ధం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను విచారిస్తున్నారు.