ఎం.పి.డి.ఓ.గా నూతన బాధ్యతలు స్వీకరించిన భారతి


కొత్తగూడ, ఫిబ్రవరి 10 జనంసాక్షి:మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గత కొంత కాలంగా ఎం.పి.డి.ఓ గా విధులను నిర్వర్తించి బదిలీపై వెళుతున్న కరణ్ సింగ్ ను ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ మండల అధికారులు,పంచాయితీ కార్యదర్శులతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని అన్నారు.నూతనంగా కొత్తగూడ ఎం.పి.డి.ఓ.గా బాధ్యతలను స్వీకరించిన భారతి ని సిబ్బంది సగౌరవంగా ఆహ్వానిస్తూ సన్మానించారు.అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ చందా నరేష్,డిప్యూటి తహసిల్దార్ నర్సయ్య,ఎం.పి.ఓ.సత్యనారాయణ,గ్రామ పంచాయతీ కార్యదర్శులు,మహాత్మాగాంధీ ఉపాది హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.