టిఎన్జీవో డైరీ ఆవిష్కరణ

నల్లగొండ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా టీఎన్జీవోస్‌ స్టాండిరగ్‌ సమావేశానికి మంత్రి జగదీష్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీఓస్‌ 2022 డైరీ, క్యాలెండర్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడ్ల రాజేందర్‌తో కలిసి మంత్రి జగదీష్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు శ్రవణ్‌ కుమార్‌, కంచనపల్లి కిరణ్‌ కుమార్‌, పెద్ద సంఖ్యలో సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.