రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు వెళ్తున్న కారును వేగంగా దూసుకొచ్చిన మరో కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇంకో కారు కూడా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
తల్లి స్రవంతి, కూతురు ధృవిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తండ్రి రవికుమార్, మరో కుమార్తె మోక్షజ్ఞకు తీవ్ర గాయాలయ్యాయి. మరో కారులో ఉన్న వ్యక్తి కూడా మృతి చెందాడు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను హైదరాబాద్‌లోని శివరాంపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.