డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం


మా పేర్లు ఎందుకు రాలేదు. రాజా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని 25,వ వార్డు లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన వార్డు సభ గందరగోళంగా మారింది. పలువురు మహిళలు ఉద్దేశపూర్వకంగానే తమ పేర్లు తొలగించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వార్డు సభ్యులు అధికారులతో  వాగ్వివాదానికి  దిగారు. సభ గందరగోళంగా మారింది. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మహిళలకు నచ్చచెప్పి జాబితాలో లేని వారు మనీ ఇవ్వాలంటూ కోరడంతో శాంతించారు.