కేసీఆర్‌ వ్యాఖ్యల వెనుక భాజపా, మోదీ హస్తముంది..

హైదరాబాద్‌: దేశంలో ప్రజాస్వామ్య కోసం అంబేడ్కర్‌ ఎంతో కృషి చేశారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. రాజ్యాంగంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ 48 గంటల దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలను తేలికగా తీసుకోకూడదన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యల వెనుక భాజపా, మోదీ హస్తముందని ఆరోపించారు. చైనా శాశ్వత అధ్యక్షుడిగా ఉండేందుకు జిన్‌పింగ్‌ రాజ్యాంగాన్నే మార్చేశారని పేర్కొన్నారు. కేసీఆర్‌, మోదీ కూడా జిన్‌పింగ్ తరహా ఆలోచనే చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచానికి తెలిసింది.. కానీ కేసీఆర్‌కు తెలియలేదని రేవంత్‌ వ్యాఖ్యానించారు.