కొమురవెల్లి మల్లన్నకు పెరిగిన ఆదాయం

సిద్దిపేట,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ ఆదివారం సందర్భంగా రూ. 36,87,546 ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి తెలిపారు. శని, ఆదివారాలలో పట్నాలు, విశిష్ట దర్శనం, శీఘ్రదర్శనం, గదుల కిరాయిలు, పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం, వీవీఐపీల దర్శనాల ద్వారా ప్రతి ఆదివారం స్వామి వారికి ఆదాయం సమకూరుతున్నట్లు తెలిపారు. నెల 26న(శనివారం) రూ.4,17,080, ఆదివారం రూ.32,70,466 వచ్చినట్లు తెలిపారు. రెండు రోజులకు మొత్తం ఆదాయం రూ. 36,87,546 స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు వివరాలను వెల్లడిరచారు. శ్రీ మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు మరో నాలుగు వారాలతో పాటు పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలు ఉన్నందున స్వామి వారికి ఆదాయం రెట్టింపు కానుందని, ఉత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నట్లు తెలిపారు.