విద్యా పారిశ్రామిక రంగాల అనుసంధానం

 


విద్యతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే ఆలోచన
ఆర్థిక మంత్రి ప్రకటనతో మారనున్న చదువులు
స్కిల్‌ డెవల్‌పమెంట్‌ పెంపొందించే కోర్సులు
న్యూఢల్లీి,ఫిబ్రవరి4(జనంసాక్షి): బడ్జెట్‌లో స్థానిక నిబంధనల నుంచి విదేశీ విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చారు. అవసరాల ప్రాతిపదికన ప్రత్యేక సదుపాయాలకు నిబంధన కల్పన చేస్తారు. పెట్టుబడుల కోసం రూ. 10.68 లక్షల కోట్ల కేటాయింపు.. ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. విద్యా, పారిశ్రామిక అనుసంధానంతో..విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ సంస్థల మధ్య బలమైన అనుసంధానం చేస్తారు. విద్యా, పారిశ్రామిక అనుసంధానం ద్వారా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టగలమన్నారు. డీఆర్‌డీఓ, ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థలకు అవకాశం కలగగనుందని అన్నారు. రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించి స్వయంసమృద్ధి సాధించేలా కృషి సాగుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో మేకిన్‌ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రణాళికగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ప్రకటించారు. ఎంఎస్‌ ప్రత్యేకంగా డిజిటల్‌ యూనివర్సిటీ. స్టార్టప్‌లకు 2 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ సాకారం అవుతాయా అన్నది చూడాలి. గతేడాది కూడా ఇలాగే విద్యారంగానికి పెద్ద ఎత్తు ప్రోత్సాహకాలు ప్రకటించినా అవి అమల్లోకి రాలేదు. బట్టీ చదువులకు స్వస్తి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి, డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కేలాయింపులు పెరిగాయని బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. విద్యార్థుల్లో బట్టీ చదువుల కారణంగా సామాజిక దృక్పథం, వృత్తి విద్యల్లో వెనకబడి ఉన్నారని కస్తూరి రంగన్‌ కమిటీ గుర్తించింది. విద్యార్థులకు వృత్తి విద్య తప్పనిసరి అవసరమని
2019మేలో ఆ కమిటీ డ్రాప్ట్‌ పాలసీని కేంద్ర మానవ వనరుల శాఖకు అందజేసింది. దేశవ్యాప్తంగా నిపుణులు, మేథావుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను సేకరించి కేంద్రం న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ 2020 ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో వృత్తి విద్యకు సంబంధించిన కీలక సిఫారసును చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాలల్లో వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెట్టి వచ్చే ఐదేళ్లలో 50శాతం విద్యార్థులకు వృత్తి విద్య అభ్యసించాలన్నదే లక్ష్యంగా చేపట్టనుంది. రోజు రోజుకు పెరిగి పోతున్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి విద్యార్థుల్లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ పెంపొందించేందుకు పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఉన్నత విద్య సంస్థలు సాప్ట్‌, స్కిల్‌, ఇతర సర్టిఫికెట్ల కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఎన్‌ఈపీ సిపారుసుకు చేసింది. ఏయే రంగంలో విద్యార్థులకు అవగాహన, ఇష్టం ఉందో తెలుసుకొని ఆ వృత్తి కోర్సులో శిక్షణ ఇవ్వనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు ఏయే రంగాల్లో ఉన్నాయో చూసి అలాంటి కోర్సులను ప్రవేశపెట్టాలని స్పష్టంచేసింది. టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, వోకేషనల్‌ ఎడ్యుకేషన్‌, సమగ్ర విద్యా విధానంలో భాగంగా చేయాల్సిందేనని తెలిపింది. ఇందుకోసం విద్య మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక భాగస్వామ్యంతో నేషనల్‌ కమిటీ ఫర్‌ది ఇంటిగ్రేషన్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఎన్‌సీఐవీఈ సహకారంతో నూతన కోర్సులను ప్రారంభించనున్నారు. విద్యార్థుల్లో మేథస్సు, వృత్తి విద్య శిక్షణ ఇచ్చేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక ప్రణాళికను ప్రవేశపెట్టనుంది. విద్యార్థుల్లో సామాజిక దృక్పథం, వృత్తి విద్య కోర్సులపై అవగాహన కోసం ఇక నుంచి పాఠశాల స్థాయినుంచే ప్రారంభించనున్నారు. 2025 నాటికి విద్యార్థుల్లో 50శాతం వృత్తివిద్య అభ్యసించాలన్నదే లక్ష్యం. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌, డిగ్రీ లాంటి ఉన్నత స్థాయిలోనే వృత్తి విద్య కోర్సులు ఉండగా ఒకేసారి వృత్తి విద్యకు మళ్లించడం విద్యార్థులకు కష్టంగా మారింది. ఇతర దేశాలతో చూసుకుంటే భారతదేశంలో విద్యార్థుల్లో 5శాతం మాత్రమే వృత్తి విద్య కోర్సుల్లో ఉన్నారని నివేదికలు తెలుపుతున్నాయి. ఒకప్పుడు విద్యార్థులను పాఠశాల వైపు మళ్లించేందుకు 8వ తరగతి నుంచి వృత్తి విద్యపై ఆసక్తి కనబర్చే వారు. అంతగా ఫలితాలు సాధించకపోవడంతో ఉన్నత విద్య తర్వాత ఈ కోర్సులను ప్రవేశపెట్టారు. 2017 జూన్‌ లో డాక్టర్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వంలో విద్యార్థుల మనోభావాల పై కమిటీని నియమించారు. 2019 మే వరకు కమిటీ విద్యార్థులపై సర్వే నిర్వహించింది. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్‌ 11,12వ తరగతుల విద్యార్థులకు ఒకేషనల్‌ స్జబెక్టులతో కూడిన వృత్తి విద్య కోర్సులు మాత్రమే అమలులో ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో వృత్తి విద్య కోర్సులను దశల వారీగా వివిధ స్థాయిల్లో అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.