సేద్యంలో మార్పులకు వ్యవసాయశాఖ ప్రణాళిక

 రైతులకు లాభం వచ్చే పంటలకు ప్రోత్సాహం

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం
హైదరాబాద్‌,ఫిబ్రవరి8( (జనం సాక్షి)): పంట కాలనీలను ఏర్పాటు చేసి సేద్యంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని సీఎంకెసిఆర్‌ పకటించినట్లుగానే రంగంలోకి దిగారు. పంట కాలనీలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో కదిలిన ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ సూచనలతో కార్యాచరణ చేస్తున్నారు. చేశారు. రాష్ట్ర వ్యవసాయరంగ స్వరూపాన్ని మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మూస పద్ధతిలో నడుస్తున్న ప్రస్తుత సేద్యపు విధానాల నుంచి రైతులను ఆధునికం వైపు నడిపించే బృహత్తర పథకానికి వేగంగా అడుగులు వేస్తున్నారు.
ఆరుగాలం శ్రమించి పండిస్తే మార్కెట్‌లో అడ్డగోలు దోపిడీకి గురవుతూ తీవ్ర నిరాశలో కూరుకుపోయి చివరకు కాడిని వదిలేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. అందుకే ప్రభుత్వం రైతులు నష్టపోకుండా ఉండేదుకు క్రాప్‌ కాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కేంద్రం బియ్యంకొనుగోళ్లకు వెనక్కి తగ్గడంతో ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేశారు. అక్కడ సత్ఫలితాలు రావడంతో రాష్ట్రమంతా అమలుకు నిర్ణయించారు. ఒక ప్రాంతంలో రైతులు ఎక్కువగా పండిరచే పంటలను సర్వే చేసిన తర్వాత వాటికి అనుబంధంగా ప్రాసెసింగ్‌ యూనిట్లను
నెలకొల్పే పక్రియ ఉంటుంది. రైతులు పండిరచిన పంటను అడ్డగోలుగా కాకుండా ప్రాసెసింగ్‌ చేసి అత్యంత నాణ్యతతో డిమాండ్‌ చోటుకు తరలించి అమ్ముతారు. దీంతో రైతులు అధిక లాభాలు పొందే వీలుంటుంది. ఇందుకోసం ఎంపిక చేసిన గ్రామాల్లో శిక్షణ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. పంట కాలనీల ఏర్పాటుకు సంబంధించి జిల్లాలోని రైతుల వివరాల కోసం సమగ్ర సర్వే నిర్వహించ నున్నారు. పంట కాలనీల కోసం చేపట్టనున్న సర్వే సందర్భంగా వ్యవసాయశాఖ అధికారులు అన్ని వివరాలూ తీసుకుంటారు. రైతులకు భూమి విస్తీర్ణం, నీటి పారుదల వసతి కూడా సేకరిస్తారు. రైతు భూమి స్వభావంతో పాటు, రైతులు వానాకాలంలో, యాసంగిలో పండిరచే పంటల వివరాలను కూడా రాసుకుంటారు. మార్కెటింగ్‌ సౌకర్యాలు, రైతులు తీసుకున్న రుణాలు, పంటకు చేసిన ఇన్సూరెన్స్‌ వివరాలను సైతం పొందు పరుస్తారు. రైతులకు ఉన్న పశువుల సంఖ్యను, ఆ రైతుకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన ఉందా అనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు. ఇక ఈ ప్రాంతంలో ఏ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పితే బా గుంటుందనే అభిప్రాయాన్ని కూడా తీసుకుంటారు. రైతులు కుటుంబంలో ఉండే స్వయం సహాయక సభ్యుల సభ్యుల వివిరాలు, గ్రూప్‌ వివరాలను సేకరిస్తారు. డ్వాక్రా సంఘాల మహిళల భాగస్వామ్యంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయనుండగా, వారి ఆజమాయిషీ లోనే అవి కొనసాగడానికి ప్రయత్నిస్తారు. కాగా, కూరగాయల సాగు ప్రధానంగా ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
````````````