సోమప్ప దేవాలయంలో లడ్డు, పులిహోర,కొబ్బరికాయ వేలం పాట.


నేరేడుచర్ల( జనం సాక్షి)న్యూస్. వచ్చే నెలలో జరగనున్న మహాశివరాత్రి జాతర సందర్భంగా మండలంలోని  శ్రీ బృగు మాలిక సోమేశ్వర ఆలయంలో సోమవారం నాడు,కొబ్బరికాయలు,లడ్డు,పులిహోర,అమ్ము కొనుటకు బహిరంగ వేలం పాట నిర్వహించారు.ఈ వేలం పాటలో కొబ్బరికాయలు అమ్ముటకు మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస్ 81వేలు,లడ్డు పులిహోర అమ్ము కొనుటకు గడ్డం శ్రీనివాస్ రెడ్డి 70వేల500 రూపాయలకు వేలం పాట పాడినట్లు ఆలయ చైర్మన్ రాచకొండ శ్రీనివాస రావు,ఆలయ ధర్మ కర్త పెండెం సైదులు, బింశెట్టి లక్ష్మి నారాయణ, పురాణ విరప్పన, మలోతు పార్వతి  తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాపోలు నరసయ్య, ఆలయా అధికారి మృత్యుంజయ శాస్త్రి,మండల తెరాస  ఉపాధ్యక్షుడు వస్కుల సుదర్శన్,గురవయ్య,గోపాల కృష్ణ, వెంకటేశ్వర్లు,నాగేశ్వరరావు,లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కందిబండ శ్రీనివాసరావు,ఆలయ పూజారి ఇరువంటి శ్రీనివాస శాస్త్రి తదితరులు ఉన్నారు.