సినిమాపరిశ్రమకు పెద్ద ఊరట

 


సిఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ
పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చ
ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న మంత్రి పేర్నినాని
సిఎం జగన్‌ సానుకూలంగా స్పందించారన్న చిరంజీవి
అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): మొత్తానికి ఏపీ ప్రభుత్వం వర్సెస్‌ సినీ ఇండస్టీ మధ్య కొద్ది రోజులుగా తలెత్తిన సంక్షోభానికి తెరపడినట్టే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసిన అనంతరం పేర్ని నాని విూడియాతో మాట్లాడుతూ.. చిన్న సినిమాకు ఒక స్థానం ఉండేలా చూడాలని సినీ ప్రముఖులు కోరినట్లు తెలిపారు. సినీపరిశ్రమకు అండగా ఉంటానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హావిూచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా
సహకారం అందిస్తామని సీఎం జగన్‌ చెప్పారని తెలిపారు. ముఖ్యంగగా వైజాగ్‌ లాంటి ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు జరిగేలా చూడాలని సిఎం జగన్‌ సూచించారు. హైదరాబాద్‌ లాటే ఎపిలోనూ పరిశ్రమ అభివృద్దికి తోడ్పాటును అందిస్తామని సిఎం తెలిపారని అన్నారు.స్‌టూడడియోలు వంటివి కట్టుకోవడానికి సహకరిస్తామని అన్నట్లు వెల్లడిరచారు. మెగాస్టార్‌ చిరంజీవి అందర్నీ సమన్వయం చేశారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై కమిటీ కూడా వేశామని గుర్తుచేశారు. సినీ పరిశ్రమ ప్రముఖులు అందురూ కూడా ప్రతి సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించారని పేర్కొన్నారు. హీరో చిరంజీవి.. సినీ పరిశ్రమ సమస్యలన్నీ సీఎం జగన్‌ దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. సుమారు గంటకు పైగా జరిగిన సమావేశంలో.. చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్‌ నారాయణ మూర్తి, నిరంజన్‌ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి విూడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సంక్షోభానికి నేటితో శుభంకార్డు పడిరదని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల చివరి వారం నాటికి జీవో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 5వ షోకు సైతం జగన్‌ ఆమోదం తెలిపారన్నారు. చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని చిరంజీవి పేర్కొన్నారు. ఇండస్టీ సమస్యలపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం హావిూ ఇచ్చారన్నారు. సినీ పరిశ్రమ తరపున ఏపీ సీఎంకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సినిమా టికెట్ల వ్యవహారంలో అందరి తరపున ప్రభుత్వంతో చర్చలు జరిగేలా దారి చూపించినందుకు మెగాస్టార్‌ చిరంజీవికి సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. సినిమా టికెట్ల అంశంలో గత కొద్ది నెలలుగా గందరగోళంలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పుడు పెద్ద ఉపశమనం లభించిందని అన్నారు. రానున్న పదిరోజుల్లో ఓ శుభవార్త మన ముందుకు రాబోతోందన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై స్పందించి చర్చలకు ఆహ్వానించిన మంత్రి పేర్నినానికి, సీఎం జగన్‌కు మహేష్‌ బాబు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు రాష్టాల్లో చిన్న సినిమాల మనుగడ చాలా కష్టంగా ఉందని నటుడు ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. భారీ సినిమాలు విడుదల అయినప్పుడు అన్ని థియేటర్లు ఆ సినిమాలనే ఆడిస్తాయన్నారు. చిన్న సినిమాలను ఆడిరచే పరిస్థితి లేదని, అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సగటు సినిమాల మనుగడ కాపాడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తిపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించా రన్నారు. అలాగే తెలుగు రాష్టాల్రు నంది అవార్డులు ఇచ్చేలా చూడాలని నారాయణమూర్తి కోరారు.