ప్రజలకు దక్కని చట్టబద్ద హావిూ !

పార్లమెంట్‌, అసెంబ్లీ చట్టసభ ఏదైనా చర్చల తీరు మారడం లేదు...రాజకీయ వ్యాఖ్యలు.. రాజకీయ ఎత్తిపొడుపులు.. తప్ప ప్రజా సమస్యలపై చర్చించడం..లక్ష్యశుద్ది ప్రకటించడం జరగగడం లేదు. ఐదు రాష్టాల్ర ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని మోడీ ఇచ్చిన సమాధానం చూస్తే.. ఆత్మస్తుతి.. పరనింద అన్నచందంగా ఉంది. ఆయన కేవలం తన పథకాల గురించి గొప్పడగా చెప్పుకోవడం, కాంగ్రెస్‌ను నిందించడం అలవాటుచేసుకున్నారు. సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగం లోనూ అదే కనిపించింది. దేశంలో కరోనా వ్యాప్తికి, వలస కార్మికుల సంక్షోభానికి ప్రతిపక్షాలే కారణమని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఎక్కడివారు అక్కడే ఉండాలని డబ్ల్యూహెచ్‌వో సలహా ఇస్తే.. కాంగ్రెస్‌ నేతలు ముంబయి రైల్వేస్టేషన్‌లో కార్మికులకు టికెట్లు ఇచ్చి ఇళ్లకు వెళ్లమన్నారని, కరోనా వైర్‌సను వ్యాప్తి చేయాలని చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్‌ హద్దులు విూరి వ్యవహరించిందని, కార్మికులను కష్టాల్లో ముంచిందని మండిపడ్డారు. ఢల్లీిలో రాష్ట్ర ప్రభుత్వం మురికివాడలకు జీపుల్లో వెళ్లి మరీ.. ఇళ్లకు వెళ్లాలని మైకుల్లో ప్రకటనలు చేసిందని, బస్సులను కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు, దీంతో అప్పటివరకు కరోనా లేని ఉత్తరప్రదేశ్‌, ఇతర రాష్టాల్ల్రో కూడా వ్యాపించిందన్నారు. మొత్తంగా కరోనాను కాంగ్రెస్‌ తదితర పార్టీలపై రుద్దారు. అలాగే టుక్డేటుక్డే పార్టీలంటూ ఘాటుగానే విమర్శించారు. బిజెపి దేశాన్ని విభజిస్తోందని గతకొంతకాలంగా కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. కానీ తాజాగా మోడీ ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ..ఘాటుగగానే స్పందించారు.కాంగ్రెస్‌ వ్యవహార శైలి చూస్తుంటే వందేళ్లయినా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలా లేదని, తాము కూడా అందుకు రంగం సిద్ధం చేశామని అన్నారు. కాంగ్రెస్‌ తమిళనాడు మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. నిజానికి దేశాన్ని విభజించి పాలించింది ఆ పార్టీయేనన్నారు. దేశంలోని వివిధ రాష్టాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఎన్నాళ్లయిందో.. అని ప్రధాని ఎద్దేవా చేశారు. ఇకపోతే ఎక్కడా నిరుద్యోగం గురించి ప్రాస్తావించలేదు. దీనిని ఎదుర్కోవడమెలాగో చెప్పలేదు. కేవలం సమాధానం చెప్పే ప్రయత్నంలో తనకున్న చాతుర్యాన్ని ఉపయోగించుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక 2014`2020 మధ్య ద్రవ్యోల్బణం 5 శాతం కంటే తగ్గిందని తెలిపారు. ధరల పెరుగుదల నెహ్రూ కాలం నుంచే ఉందని కొట్టి పారేశారు. గోధుమలు, బియ్యం ధరలు పెరిగితే ఎందుకు భరించలేరంటూ యూపీఏ హయాంలో అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. ధరల నియంత్రణెళి తమ ప్రాథమిక లక్ష్యమన్నారు. ఇక ’మేక్‌ ఇన్‌ ఇండియా’ను ప్రతిపక్షాలు విమర్శించడం హాస్యాస్పదమని, కమిషన్లు, ముడుపులు లేకుండా చేసినందుకే వారు ఈ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వారు తమ కాలంలో అవినీతిని జయించలేకపోయారని విమర్శించారు. తాము చిన్న రైతులకు సాధికారత కల్పించాల నుకుంటే వారు చిన్న రైతుల్ని శత్రువులుగా భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు ఇంకా 2014లోనే నిలిచిపోయినందునే వరుస ఓటములు ఎదుర్కొంటున్నారని, ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయినా అహంకారం మాత్రం వీడలేదని విమర్శించారు. మొత్తంగా కాంగ్రెస్‌ తీరును ఎండగట్టడానికి వేదికను బాగా ఉపయోగిం చుకున్నారు. తమ ప్రభుత్వం 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసిందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. భారత్‌ లీడర్‌గా ఎదుగుతోందని ప్రకటించారు. నిజానికి భారత్‌ ఎదగగడమంటే అర్థాకలి, ధరలు, నిరుద్యోగం వంటి పలు సమస్యల గురించి ప్రకటించక పోవడంకాదు. కాంగ్రెస్‌ను విమర్శించినంత మాత్రాన సమస్యలకు పరిష్కారం దక్కినట్టు కాదు. ఈ సమస్యలను అధిగమించినప్పుడే భారత్‌ ఎదుగుతుందని భావించాలి. ఈ సమస్యలను

పక్కదారి పట్టించినంత మాత్రాన దేశం ఉజ్వలంగా ఉందనుకుంటే సరికాదు. గతంలో వాజ్‌పేయ్‌ హయాం లోనూ భారత్‌ వెలిగిపోతోందని ప్రచారం చేసి దెబ్బతిన్న విషయాన్ని ప్రధాని మోడీ గుర్తించాలి. ఓ రకంగా చెప్పాలంటే ఐదు రాష్టాల్ర ఎన్నికలకు ప్రచారాంగా మోడీ బాగానే ఉపయోగించుకున్నారు. అన్ని పార్టీలు కూడా ప్రజల సమస్యలను పరిస్కరించేందుకు పోరాడాలన్నచిత్తశుద్ది లోపించింది. అధికారమే పరమావధిగా అన్ని పార్టీలు యత్నిస్తూనే ఉన్నాయి. అందుకు బిజెపిక కూడా మినహాయింపు కాదని మోడీ నిరూపించు కుంటున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఏడు దశల్లో జరగనున్న ఐదు రాష్టాల్ర ఎన్నికల్లో..ప్రజలు అనివా ర్యంగానే ఓటేయక తప్పదు. తమ ఆలోచనలకు అనుగగుణంగా ప్రజలు ఓటు వేస్తున్నారని అనుకోవడానికి లేదు. అందుకే ప్రజల సమస్యలపై నేతలకు పెద్దగా ఆసక్తి కానరావడం లేదు. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో వుందో తెలుస్తోంది.ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులై వున్నవారిలో కూడా నిరుద్యోగం పెరుగుతోంది. అవినీతి విశృంఖలంగా పెరిగిపోవడం, అసమర్ధులైన అధికార యంత్రాంగం వంటి కారణాల వల్లే ప్రభుత్వ రంగంలో ఉపాధి సంక్షోభం నెలకొందని భావిస్తున్నారు. సాంకేతిక పొరపాట్లు లేకుండా నిష్పాక్షికంగా రిక్రూట్‌మెంట్‌కు హావిూ కల్పించేలా ఒక్క ముసాయిదా నోటిఫికేషన్‌ కూడా అధికారుల జారీ చేయడం లేదు. పరిస్థితులు ఇలా వున్నా రాజకీయ పార్టీల ఎజెండాలో నిరుద్యోగం గురించి ప్రస్తావనే లేదు. దేశంలో తగిన ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమవడంతో ఉద్యాగార్థులు వలసలు వెళుతున్నారు. డబ్బు,భూమి, అన్ని వనరులు వున్నవారు ఇతర దేశాలకు వలస వెళుతుంటారు. కానీ ఏ ఆధారం లేనివారు నిరుద్యోగులు గా ఇతర దేశాలవైపు చూస్తున్నారు. వ్యవసాయరంగం ఇప్పటికే సంక్షోభంలో వుంది. పని దొరకడం లేదని రోజువారీ కూలీలు వాపోతున్నారు. పని వెతుక్కుంటూ పొరుగు రాష్టాల్ర వారు ఇతర రాష్టాల్రకు వెళుతు న్నారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా వుందో అర్థమవుతోంది. ఈ పరిస్థితులు మారుతాయన్న భరోసా దక్కడం లేదు. అధికారం కోసం నేతల ఆరాటం తప్ప ప్రజల ఆరాటం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో చట్టసభలు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది.