తెలంగాణలో మహిళలకు రక్షణలేదు

అధికారపార్టీ నేతలే అత్యాచారాలకు ఒడిగడుతున్నారు

మండిపడ్డ బీజేపీ మహిళా మోర్చా నేత ఆకుల విజయ
హైదరాబాద్‌,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):   తెలంగాణలో ఆడపిల్లలు, మైనర్‌ బాలికలకు రక్షణ కరువైందని బీజేపీ
మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఆకుల విజయ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్‌ మునిసిపల్‌ వైస్‌ ఛైర్మెన్‌ నిర్మల్‌ నుండి మైనర్‌ బాలికను హైదరాబాద్‌కి తీసుకువచ్చి అత్యాచారం చేశారు. ఇంతవరకు అతడిని అరెస్ట్‌ చేయలేదు. టిఆర్‌ ఎస్‌ నాయకుడు కాబట్టే ఇంతవరకు పోలీసులు అరెస్ట్‌ చేయలేదు.
అలాగే, సిరిసిల్లలో ఒక అమ్మాయి మిస్‌ అయ్యి నెల రోజులు అయింది. కేటీఆర్‌ నియోజకవర్గంలో అమ్మాయి మిస్‌ అయినా ఇంతవరకు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలియదు. కేటీఆర్‌ నియోజకవర్గములో ఇలాంటి మిస్సింగ్‌ కేస్‌ అయితే పోలీసులకు కన్పించడం లేదా? అని ఆమె ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ నేతలకు సంబంధం ఉంది కాబట్టే పోలీసులు సైలెంట్‌ అయ్యారని ఆకుల విజయ ఆరోపించారు.
ఫ్రెండ్లీ పోలీసులు కాదు..టీఆర్‌ఎస్‌ పార్టీకీ పోలీస్‌ లు తొత్తులుగా మారారన్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించని కేసీఆర్‌ దేశానికి ప్రధాని అవుతారు అంట. అత్యాచారం చేసిన మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ ను వెంటనే అరెస్టు చేయాలి. మహిళ ల విూద అత్యాచారం జరుగుతుంటే కవిత ఎందుకు స్పందించడం లేదు. ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఎంజాయ్‌ చేయడం కాదు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పైన స్పందించాలని ఆకుల విజయ డిమాండ్‌ చేశారు. మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల పైన స్పందించడం లేదెందుకు కవిత. నువ్వు మహిళవి కావా కవిత అని ఆమె ప్రశ్నించారు.