మోడల్ స్కూల్లో కరొన కళకలం


మరిపెడ:ఫిబ్రవరి 08(జనం సాక్షి ):మరిపెడ మోడల్ స్కూల్ లో కరొన కళకాలం సృష్టించిది, పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులకు కరొన రావడం తో తక్షణం స్పందించిన పాఠశాల యాజమాన్యం మరియు ప్రాథమిక వైద్య సిబ్బంది 200మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.  ఈ పరీక్షలో తొమిది మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్లు ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ అరుణ దేవి తెలిపారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు మెడిసిన్ అందజేసి తల్లి తండ్రుల సమక్షంలో కరైంటైన్ లో ఉంచినట్లు అమె తెలిపారు. పాఠశాలకు ఒక రోజు సెలవు ప్రకటించారు. పాఠశాలలో శానిటేషన్ చేసిన తర్వాత పునః ప్రారంభిచుటకు అధికారులు నిర్ణహించరని అమె తెలిపారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయ బృదం, వైద్య బృందం పాల్గొన్నారు.