` మరోమారు పరిశీలించిన సీఎం కేసీఆర్
` వచ్చే నెలలో మహాసంప్రోక్షణ నేపథ్యంలో పలు సూచనలు
యాదాద్రి భువనగరి,ఫిబ్రవరి 7(జనంసాక్షి):వచ్చేనెల మార్చిలో యాదాద్రి ఆలయ మహాసంప్రోక్షణను పురస్కరించుకుని సిఎంకెసిఆర్ యాదాద్రి ఆలయ పరిసరాలను సోమవారం పరిశీలించారు. యాదాద్రిచేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. బాలాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్‌కు ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, టీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, మర్రి జనార్ధన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం వేద పండితులు కేసీఆర్‌కు ఆశీర్వచనం అందించారు. స్వామి వారి దర్శనానికి కంటే ముందే కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా.. సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆలయ పండితులు, అధికారులతో కేసీఆర్ సవిూక్షించి, పలు సూచనలు చేసారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ యాదాద్రికి పయనమయ్యారు. యాదాద్రి పర్యటనలో భాగంగా ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మూడు నిమిషాల పాటు ఏరియల్ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. ఇదిలావుంటే సీఎం కేసీఆర్ ఈ నెల 12న భువనగిరికి రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం పరిశీలిం చారు. సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నూతన కలెక్టరేట్ భవనం, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం భవనాలను మంత్రి పరిశీలించారు. భారీ బహిరంగ సభను నిర్వహించనుండడంతో కలెక్టరేట్ పక్కనే ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.