విపక్షాల ఐక్యతకు ఇదే అతిపెద్ద అవకాశంగా నిర్ణయం
బీహార్‌లో బిజెపిని దెబ్బకొట్టేలా నితీశ్ పేరు తెరపైకి
కాంగ్రెస్‌ను ఒప్పించే బాధ్యతకూడా తీసుకోనున్న కెసిఆర్
న్యూఢల్లీి,ఫిబ్రవరి25 (జనంసాక్షి): రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..బిజెపికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా రానున్న రాష్ట్రపతి ఎన్నికను ఉపయోగించుకోవాలని సిఎం కెసిఆర్ యోచిస్తున్నారు. ఈ ఎన్నికలో ఆమోదయోగ్యమైన అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా ప్రాంతీయ పార్టీల్లో ఐక్యత సాధించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల మహారాష్ట్ర పర్యటనలో ఉద్దవ్ థాకరేతో కూడా దీనిపై చర్చించారనే అనుకుంటున్నారు. మరోవైపు ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగారని అంటున్న కెసిఆర్ ఆయనతో తొలిదశలో దీనిగురించి చర్చించి పక్కా వ్యూహం సిద్దం చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ సిఎం నితీశ్ కుమార్ పేరు బయటకు
వచ్చిందని అంటున్నారు. ఈ లెక్కన బీహార్‌లో బిజెపికి చెక్ పెట్టవచ్చని కూడా ప్లాన్‌గా ఉంది. కెసిఆర్ ఈ మధ్య బిజెపి వ్యతిరేక కూటమికోసం గట్టిగా నిలబడ్డారు. ఏచిన్న అవకాశం వచ్చినా మోడీపై విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఐదు రాష్టాల్ల్రో ఎన్నికలు ముగిసి మార్చి పదిన ఫలితాలు రానున్నాయి. ఇందులో బిజెపికి పరాభవం తప్పదన్న భావనలో ఉన్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం త్వరలో ముగియనుంది. వచ్చే జూన్ 20తో పదవీ కాలం ముగుస్తుంది. ఈ లోగానే కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ముగియనుంది. ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో చర్చల్లో సిఎం కెసిఆర్ అనేక విషయాలతో పాటు రాష్ట్రపతి ఎన్నికపైనా చర్చించే ఉంటారని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో విపక్షాల ఐక్యతకు సంబంధించిన రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ లేకుండా బిజెపికి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టలేమని శివసేన తదితర పార్టీలు కూడా ప్రకటించాయి. ఏకపక్షంగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి పోటీగా ప్రతిపక్షాల నుంచి రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అబ్యర్థిని నిలబెట్టాలని దేశంలోని ఎన్డీయేతర పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రాష్ట్రపతి రేసులో నితీష్ కుమార్‌ను నిలబెట్టా లని విపక్షాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నితీష్ కుమార్ కొట్టిపారేసి నప్పటికీ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇటీవల పీకేతో నితీశ్ కుమార్ భేటీని బట్టి అనుమానాలు కలుగుతున్నాయి. దీనివెనక కెసిఆర్ మంత్రాంగం ఉండివుంటుందని అనుకుంటున్నారు. గత రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్‌నాథ్ కోవింద్‌కు అంతా మద్దతు ఇచ్చారు. అయితే పీకేతో భేటీ అనంతరం విూడియాతో మాట్లాడిన నితీష్ కుమార్.. తమ మధ్య ఎలాంటి రాజకీయపరమైన చర్చలు రాలేదని, కేవలం మంచి చెడుల గురించే మాట్లాడుకున్నామంటూ చెప్పుకొచ్చారు. నితీశ్‌తో భేటీకి ముందు.. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో పీకే భేటీ అయ్యారు. ఆ తరవాత కెసిఆర్ కూడా తన స్పీడును పెంచారు. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్‌తో భేటీ కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం ఉందనే భావిస్తున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావితున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మరికొందరు కీలక నేతలతో పీకే మంతనాలు సాగించారు. ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్టాల్ల్రో జరుగుతున్న ఎన్నికల ఫలితాల్లో ఒక్క యూపిలో బీజేపీ ఓడిపోయినా దేశ రాజకీయాలు అనూహ్యంగా మారే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని కెసిఆర్ కూడా పదేపదే విశ్లేషించారు. యూపిలో బిజెపి ఓటమి ఖాయమని కూడా అన్నారు. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నాలను వేగవంతం కావడం ఖాయం అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి సంపూర్ణ ఆధిక్యం ఉంది. త్వరలో జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల తరువాత పరిస్థితి మారే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా యూపీ ఎన్నికల్లో బీజేపీ పడిపోతే.. ప్రతిపక్షాలు పుంజుకోవడం ఖాయం అవుతుంది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం ఒక్కటయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికంటే ముందు.. త్వరలో రానున్న రాష్ట్రపతి ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బిజెపిని దెబ్బతీయాలన్నది కెసిఆర్ ప్లాన్‌గా ఉంది. నిజానికి ఐదు రాష్టాల్ర ఫలితాలు ఎలా ఉన్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం ఖాయంగగా కనిపిస్తోంది. నితీశ్ కాకున్నా మరో అభ్యర్థిని తెరవిూదకు తసీఉకుని రావచ్చు. ఇదే పనిలో నిమగ్నమై.. బీజేపీని టాª`గ్గంªట్ చేసుకుని విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పట్టుదలతో కలిసి ముందుకు వెళ్తున్నారు. ఇందులో
భాగంగానే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నితీశ్ కుమార్‌కు కూడా ఇదే అంశంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే కసరత్తును ప్రారంభించిన కె చంద్రశేఖర్ రావు, ఇతర పార్టీలను సంప్రదించేలా నితీష్ కుమార్‌ను ఒప్పించే బాధ్యతను ప్రశాంత్ కిషోర్‌కు అప్పగించారని సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో నితీశ్ కుమార్ నిలబడితే.. కాంగ్రెస్ మద్ధతు ఇస్తుందా? లేదా? అన్నది సందేహంగా మారింది. కాంగ్రెస్ లేకుండా విపక్షాల ఐక్యత అనేది సాధ్యం కాదని చాలామంది నాయకులు అంటున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి నితీశ్ కుమార్‌పై ఎలాంటి ద్వేషం లేదు. ఆయన రాష్ట్రపతిగా పోటీ చేస్తే మద్ధతు ఇచ్చేలా ఒప్పించడం సులభమే అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ నితీశ్ అయితే ఎన్డీఎ పక్షాలు కూడా మద్దతు ఇస్తాయన్నది కెసిఆర్ వ్యూహంగా ఉంది. అవసరమైతే కెసిఆర్ సోనియాతో చర్చించడానికి వెనకాడక పోవచ్చు. రాష్ట్రపతి ఎన్నికల్లో నితీశ్ అభ్యర్థిగా నిలబడితే బీహార్‌లో రాజీకాయలు కూడా మారవచ్చు. అక్కడ బిజెపి మద్దతు లేకుండా ఆర్జెడి మద్దతుఓ కూడా ప్రభుత్వం రావచ్చు. మొత్తంగా కెసిఆర్ వ్యూహాలు ఇప్పుడిప్పుడే మెల్లగా బయటకు వస్తున్నాయి.