రాజన్న సిరిసల్ల,ఫిబ్రవరి8 (జనం సాక్షి) : 24 గంటలు విద్యుత్ సరఫరా కోసం ప్రస్తుతం ఇతర రాష్టాల్ర నుంచి కొనుగోలు చేస్తున్నామనీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. కెసిఆర్ దూరదృష్టి కారణంగా రాబోయే రోజులలో మనమే విద్యతుª`ª`ను ఇతర రాష్టాల్రకు అమ్మే రోజులు వస్తాయన్నారు. రూ.90 వేల
కోట్లతో కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు 24 గంటలు నీళ్లు అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలను రూ.40 వేల కోట్ల నిధులతో ఆదర్శంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యమనిపేర్కొన్నారు. అన్ని గ్రామాలలో ఉన్న చెరువులను గోదావరి జలాలతో నింపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. మేడిపల్లి, కథలాపూర్ మండలాలు మెట్ట ప్రాంతాలని త్వరలోనే సస్యశ్యామల మవుతాయని పేర్కొన్నారు. సర్పంచులుగా యువతే పెద్ద సంఖ్యలో గెలిచారనీ, ముఖ్యమంత్రి సూచించిన ప్రకారం వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాలను అభివృధ్ధి చేయాలని ఆకాంక్షించారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు.
గోదావరి నీళ్లతో చెరువులకు మహర్దశ