టాస్‌ ఓడి బ్యాంటిగ్‌కు దిగిన భారత్‌


లంకతో లక్నో వేదికగా తొలి మ్యాచ్‌

లక్నో,ఫిబ్రవరి24  జనం సాక్షి : మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత జట్టుతో ఇక్కడి భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ ప్రారంభించారు. ఇటీవల వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన భారత జట్టు అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుండగా, ఆస్టేల్రియాతో జరిగిన సిరీస్‌లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న శ్రీలంక ఈ సిరీస్‌లో గెలవడంపై దృష్టిసారించింది. శ్రీలంక జట్టులో గాయాలపాలైన తీక్షణ, కుశాల్‌ మెండిస్‌ బదులుగా చండీమల్‌, వండర్‌సే జట్టులోకి వచ్చారు. భారత జట్టు మాత్రం ఆరు మార్పులతో బరిలోకి దిగింది. సంజు శాంసన్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, జస్పీత్ర్‌ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్‌, దీపక్‌ హుడా జట్టులోకి వచ్చారు.