రహదారుల విస్తరణపై నిర్లక్ష్యం

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం

విస్తరణ కోసం ఎదురు చూస్తున్న జనం
నిజామాబాద్‌,ఫిబ్రవరి 4 జనంసాక్షి: జిల్లాలోని ప్రధాన రహదారులైన హెచ్‌ఎంబీ, కేకేవై రహదారులపై రద్దీ కారణంగా విస్తరణ చేపట్టాలన్న ఆలోచనలు ముదుకు సాగడం లేదు. ఈ రహదారులపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. దీంతో ఈ రెండు రహదారులు నిత్యం వాహనాల రాకపోకలతో ఇరుకుగా మారాయి. దీంతో వీటి విస్తరణతో పాటు రాష్ట్ర రహదారులుగా ఉన్న రెండు రహదారులను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులుగా గుర్తించింది. వీటి నిర్మాణాల కోసం సర్వేను
కూడా చేపట్టింది. ఈ సర్వేలు పూర్తి చేసి నెలలు గడిచిపోతున్నా.. నిధులు మాత్రం కేటాయించడం లేదు. దీంతో ఈ రెండు జాతీయ రహదారుల నిర్మాణ పనులు చేపడాతారా లేదా అన్న ఆందోళన కలుగుతోంది. ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారో అని ఎదురు చూస్తున్న జిల్లా వాసులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికే హెచ్‌ఎంబీ జాతీయ రహదారి పను లు హైదరాబాద్‌ నుంచి మొదలుకొని మెదక్‌ జిల్లా కేంద్రం వరకు కొనసాగుతున్నాయి. మెదక్‌ జిల్లా కేంద్రం నుంచి ఎల్లారెడ్డి` బా న్సువాడ` బోధన్‌`బైంసా వరకు జాతీయ ర హదారి పనులు సర్వేకే పరిమిత మయ్యాయి. ఈ పనుల నిర్మాణాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతోనే జాతీయ రహదారుల పనులు నిలిచిపోయాయని ఆర్‌ అండ్‌బీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు పనులను చేపట్టేలా కేంద్ర సర్కార్‌ నిధులు కేటాయించాలని ప్రజాప్రతినిధులు పదేపదే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండాపోయింది. ఇక్కడి నుంచి బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాలోని ఈ రెండు ప్రధాన రహదారులకు తీరని అన్యాయమే జరిగింది. రవాణా వ్య వస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లా విూదుగా వెళ్లే హైదరాబాద్‌` మెదక్‌` బోధన్‌` భైం సా(హెచ్‌ఎంబీ) రాష్ట్ర రహదారిని, కరీంనగర్‌` కామారెడ్డి` ఎల్లారెడ్డి` పిట్లం చౌరస్తా(కేకేవై) రాష్ట్ర రహదారులను జాతీయ రహదారిగా గుర్తించింది. కానీ ఈ రహదారుల నిర్మాణాల కోసం బ్జడెట్‌లో నిధులు కేటాయించడంలో మాత్రం శ్రద్ద చూపలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రహదారులకు నిధులు కేటాయిస్తే రహదారుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయి వాహనరాకపోకలకు ఇబ్బందులు తప్పుతాయి. హైదరాబాద్‌ నుంచి బైంసా వరకు 5 జిల్లాలను కలుపుకుని వెళ్లే హెచ్‌ఎంబీ రహదారితో పాటు, కరీంనగర్‌ నుంచి పిట్లం చౌరస్తా వరకు రెండు జిల్లాలను కలు పుకొని వెళ్లే ఈ రెండు రహదారులు పూర్తయితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు సమయం ఆదా అవుతుంది. జిల్లాకు చెందిన రాష్ట్ర శాసనసభపతి ఆధ్వర్యంలో ఎంపీ, బీబీ పాటిల్‌తో పాటు ఎమ్మెల్యేలు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరిని కలిసి రహదారికి నిధులు కేటాయించాలని, పనులు త్వరగా ప్రారంభించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిధులను కేటాయించడంలో బీజేపీ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఈ రహదారుల వెంబడి కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, తదితర రాష్టాల్రతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న ఈ రహదారులపై పెద్ద సంఖ్యలో వాహనాలు తిరుగుతుండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.