తెలుగు భారతికి నా అక్షర హారతి


తెలుగు భాషంటే..."అది ఒక వెలుగు భాష"
తెలుగు భాషంటే....అది ఒక "సముద్రపు ఘోష"
తెలుగు యాసంటే...అదిమన "గొంతులోని శ్వాస"

గలగల పారుతు పరుగుల తీసే 
మన సజీవనదులన్నవి
తమ పరుగులు భారతావనివరకేనని....కానీ
ఎక్కడ ? ఎక్కడ ? ఈ సువిశాల ప్రపంచంలో
ప్రవహించనిదెక్కడ నా "తేనెలూరే తెలుగునది"

అందమైన మన తెలుగుభాషలో
"అమ్మతనమున్నది" 
" పింగళి వెంకన్న వూహల్లో
పురుడుపోసుకున్న ఆ జాతీయజెండాలో
మన"తెలుగుతనమున్నది"...

తెలుగు భాషే మన శ్వాస...తెలుగు భాషే మన ఊపిరి
తెలుగుతల్లే మనదేవత...ఆ తల్లికే మనజీవితాలంకితం

ఎక్కడ తెలుగు వుంటుందో అక్కడ వెలుగు వుంటుంది
ఎక్కడ వెలుగు వుంటుందో అక్కడ వికాస ముంటుంది

ఏమని వర్ణింతు నా తెలుగుభాష వైభవం 
ఏమని వర్ణించు నా తెలుగువాడి పౌరుషం
ఓ తెలుగు తల్లీ మీ కడుపున పుట్టడం 
మా పూర్వజన్మ సుకృతం

అందుకే ఓ మా తల్లీ మీకు ప్రణామం...ప్రణామం... ప్రణామం...
ఓ తెలుగు తల్లీ మీకు వందనం ! అభివందనం ! పాదాభివందనం !!
ఓ తెలుగు భారతీ !  మీకిదే నా అక్షర హారతి...

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్...9110784502