కెసిఆర్‌ సంకల్పంతో ఆదర్శంగా తెలంగాణ

 

పివి ఎక్స్‌ప్రెస్‌పై ర్యాంప్‌ ప్రారంభించిన తలసాని
హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి ): సీఎం కేసీఆర్‌ సంకల్పంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శనివారం పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై లక్ష్మీనగర్‌ వద్ద రూ.5కోట్ల వ్యయంతో మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్మించిన డౌన్‌ ర్యాంప్‌ను మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎంఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్యే కౌసర్‌ మోహిద్దీన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం జనాభా పెరుగుదల, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఒనగూర్చు కుంటుందని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ విజన్‌తో హైదరాబాద్‌ జంటనగరాల రూపురేఖల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. కనెక్టివిటీ, హాస్పిటాలిటీ, శాంతిభద్రతలు, మూడు దశాబ్దాల భవిష్యత్‌ను ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మంత్రి కేటీఆర్‌ మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారన్నారు. ప్రణాళికల రూపకల్పన, రోడ్లు, ్గªª`ల ఓవర్లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్న హెచ్‌ఎండీఏ యంత్రాంగాన్ని మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ఎం.శ్రీలత, గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌, హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంతోష్‌, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, సెక్రెటరీ పీ చంద్రయ్య, సూపరింటెండెంటింగ్‌ ఇంజినీర్స్‌ యూసుఫ్‌ హుస్సేన్‌, పరంజ్యోతి, ఇంజినీర్లు రజిత, గౌతమి, విద్యాసాగర్‌, వెంకటేశ్‌, అశుతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.