విపక్షాల ఐక్యతకు రాష్ట్రపతి ఎన్నిక ఓ పరీక్ష !


ఉమ్మడి అభ్యర్థికోసం యత్నిస్తేనే ముందడుగు

అందుకు పికె,కెసిఆర్‌ చర్చలు మార్గం చూపేనే
కాంగ్రెస్‌ ఇందుకు కలసి వచ్చేనా అన్నదే ప్రశ్న
న్యూఢల్లీి,ఫిబ్రవరి28(జనం సాక్షి): : కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న ప్రయత్నాలకు పునాది పడడడం లేదు. నేతలు ఎవరికి వారు ఇంకా చర్చల దశలోనే ఉన్నారు. కాంగ్రెస్‌ లేకుండా కూటమి కట్టడం అసాధ్యమని ఆలస్యంగా అయినా నేతలు తెలుసుకున్నారు. కాంగ్రెస్‌తో జత కట్టడానికి అనేక పార్టీలు జంకుతున్నాయి. ప్రధానంగగా ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్టాల్ర ఎన్నికలనే తీసుకుంటే..విపక్షాల్లో ఐక్యత ఎండమావి అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఐదు రాష్టాల్ల్రో అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా బిజెపిని ఢీకొనాలన్న ఆలోచన చేయలేదు. అలాగే ఎవరికి వారు అంతా తాము ప్రధాని సీటుకు తగిన వారమే అన్న అహంభావంలో ఉన్నారు. మరోవైపు ఐదు రాష్టాల్ర ఫలితాల తరవాత విపక్షాల ప్రయత్నాల్లో ఊపు ఉంటుందా లేదా అన్నది కూడా తెలియదు. ఇకపోతే రానున్న రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అయినా వీరు ఐక్యంగా కలసికట్టుగా ఉమ్మడి అభ్యర్థికోసం ప్రయత్నిస్తారా అన్నది చూడాలి. విపక్షాల ఐక్యతకు ఉన్న ఏకైక మార్గం ఇప్పుడు రాష్ట్రపతి
ఎన్నిక మాత్రమే. ఈ ఎన్నికల్లో ఉమ్మడి అబ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటే విపక్షాల్లో ఐక్యత సాధ్యమని తేలుతుంది. ఇందుకు కెసిఆర్‌, ప్రశాంత్‌ కిషోర్‌ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాలి. మరో విషయమేమంటే ఇప్పటి వరకు కాంగ్రెస్‌ నేతలతో ఎలాంటి చర్చలు సాగించడం లేదు. ఈ విషయంలో కాంగ్రెస్‌ కూడా కొంత గుంభనంగా ఉంటోంది. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మిషన్‌ ఢల్లీి షురూ అయ్యిందని తెలంగాణ టిఆర్‌ఎస్‌ నేతలు ప్రకటించుకుంటున్నారు. కెసిఆర్‌ తడాకా చూపిస్తారని అంటు న్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ కూడా కెసిఆర్‌తో మంతనాలు జరుపుతున్నారు. అయితే కాంగ్రెస్‌ ఇప్పటికే పికెను దూరం పెట్టింది. పికె.ను నమ్మేస్థితిలో కూడా ఆపార్టీ లేదు. ఎనిమిదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నిస్తున్న కెసిఆర్‌...ఇంటి గెలిసి రచ్చ గెలవాలి.ఇక్కడ వ్యక్తం అవుతున్న అనేకానేక వ్యతిరేకతలను పట్టించుకోవడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో నితీశ్‌ కుమార్‌ను తెరపైకి తెచ్చిన కెసిఆర్‌, పికె ఈ విషయాన్ని కాంగ్రెస్‌తో చర్చించినట్లు కనిపించడం లేదు. నిజానికి కాంగ్రెస్‌ నుంచి ఐక్యతకు సంబంధించిన సంకేతాలు రావడం లేదు. మరోవైపు కాంగ్రెస్‌ ముక్త భారత్‌ పేరుతో మోడీ తనవంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దక్షిణాదిలో తమిళనాట స్టాలిని, కేరళలో పిరయ్‌ విజయ్‌ మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు. తెలుగు రాష్టాల్ల్రో కెసిఆర్‌ తప్ప, జగగన్‌, చంద్రబాబు ఇద్దరూ బిజెపికి కొంచెం దగ్గరగానే ఉన్నారు. కెసిఆర్‌ ముందుగా ఈ రెండు పార్టీల నేతలను ఇంతరవకు సంప్రదించనే లేదు. నిజానికి విపక్షాలన్న కప్పల తక్కెడ లాంటివి. ఎప్పుడు ఏ తట్టలో ఉంటాయో తెలియదు. ఎప్పుడు ఎగిరి ఎక్కడ పడతారో తెలియదు. ఈ క్రమంలో పికె సాయంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఓ అడుగు ముందుకు వేశారు.కేంద్ర ప్రభుత్వ పోకడలతో ఇబ్బందిపడిన, పడుతున్న ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాకరే, స్టాలిన్‌ వంటి వారు మద్దతు పలికారు. ఇదే అదనుగా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ చేపట్టబోయే ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని, ప్రధానమంత్రి అయ్యే అన్ని అర్హతలు కేసీఆర్‌కు ఉన్నాయని టీఆర్‌ఎస్‌ అప్పుడే ప్రచారం మొదలు పెట్టింది. నిజానికి ఈ ప్రచారం కూడా కాంగ్రెస్‌ లేదా, ఇతర ప్రాంతీయ పార్టీలకు గిట్టక పోవచ్చు. కెసిఆర్‌ను వారు జాతీయ ప్రత్యామ్నాయంగాచూస్తారని నమ్మడానికి లేదు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యా మ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటులో గతంలో కూడా కెసిఆర్‌ ప్రయత్నించి విఫలమయ్యారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే ఉమ్మడి నాయకత్వం కోసం ప్రయత్నాలు జరగగలేదు. అలాగే ఆయా పార్టీల నేతలు తామే మోడీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. మమతా బెనర్జీ,ఉద్దవ్‌ థాక్రే,స్టాలిన్‌, అఖిలేశ్‌ యాదవ్‌ ఇలా అంతా తామే ప్రత్యమ్నాయంగా భావిస్తారు. ఈ క్రమంలో ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికకోసం నేతలంతా కదలాలి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్ట గలగాలి. నిజానికి 2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను కూడా కలుపుకొని ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు చంద్రబాబు చొరవ తీసుకున్నారు. అప్పుడు చంద్రబాబు కూడా నరేంద్ర మోదీపై విరుచుకు పడ్డారు. అయితే, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోవడంతో ఆయన ప్రత్యామ్నాయం కూడా కనుమరుగయ్యింది. నిజానికి ఇప్పుడు తొలుత చేయాల్సింది ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి కోసం ఏకాభిప్రా యం రావాలి. ధీటైన అభ్యర్థిని వెతకాలి. అందరికీ ఆమోదయోగ్యమైన నేతను సిద్దం చేయాలి. అప్పుడే మోడీకి కూడా కొంత భయం వస్తుంది. గతంలో కూడా కేసీఆర్‌ను చాలామంది సీరియస్‌గా తీసుకోలేదు. నిజానికి, కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర లేకుండా బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు సాధ్యం కాదు. నరేంద్ర మోదీ వ్యతిరేక రాజకీయాలకు
నాయకత్వం వహించాలనుకుంటున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే కాంగ్రెస్‌ దారి కాంగ్రెస్‌దే అని ప్రకటించారు. కేసీఆర్‌ కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాకరే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పరిస్థితి వేరు. వీరిరువురూ తమ తమ రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ తో జతకట్టి ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అఖిలేశ్‌ యాదవ్‌ ఈ ప్రత్యామ్నాయాలతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఇప్పుడు బీజేపీతో కలసి ఉన్నారు. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న తేజస్వీ యాదవ్‌ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నారు. ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ తన పార్టీని ఇతర రాష్టాల్ల్రో విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వీరందరిని గాడిలో పెట్టగలమా అన్నదే ముఖ్యం. వీరిని ఒకేదారికి తీసుకుని రావాలి. కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రత్యామ్నాయ వేదికను రూపొందించాలి. సమయం తక్కువగా ఉన్నందున రాష్ట్రపతి ఎన్నిక కోసం కసరత్తుచేయాలి. మోడీ లేదా బిజెపి లేదా ఎన్‌డిఎ నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థికి వ్యతిరేకంగా బలమైన ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి పోరాడగలిగితేనే రేపటి ప్రత్యామ్నా యానికి వేదిక లభిస్తుంది. లేకుంటే అంతే సంగతులు. ఈ విషయం గుర్‌ఎరిగి పకె లేఆ కెసిఆర్‌ అడుగులు వేయాలి.