కెసిఆర్‌ కుటుంబం బంగారం అయ్యింది

బిజెపి నేత రవీంద్రనాయక్‌ విమర్శ

హైదరాబాద్‌,ఫిబ్రవరి23  (జనంసాక్షి) : తెలంగాణలో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అన్నట్లు నాయకులు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్‌ నేడు మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీజేపీ నేత రవీంద్ర నాయక్‌ కౌంటర్‌ వేశారు. రవీంద్ర నాయక్‌ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అని కేసీఆర్‌ కుటుంబాన్ని మాత్రం బంగారం చేసుకున్నాడని ఆయన విమర్శించారు. అంతేకాకుండా
ప్పుడు బంగారు భారత దేశం అంటున్నాడు కేసీఆర్‌.. సెంటిమెంటు రగల్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అని ఆరోపించారు. టెంట్‌ లేని ఫ్రంట్‌ పెట్టుకొని స్టంట్‌ చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ నీ అబద్దాలు తెలంగాణ లో ఇక నడవవని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హావిూలు నెరవేర్చలేదని ఆయన అన్నారు. ఇష్టారీతిన అవినీతికి పాల్పడ్డావు? నిన్ను బొక్కలో వేసే రోజు దగ్గర లోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.