పిచ్చుక పై బ్రహ్మస్త్రం

అగ్రరాజ్యాల అహంకారం

తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే
దుర్బుద్ది
మితిమీరిన అధికార దాహం
చిన్న దేశాలపై దాడులు
సామాన్యులను వదలని వైనం
మీసైల్ దాడులు
నరకం చూస్తున్న ప్రజలు
వేలాదిమంది బలి ఆయపోవటం
దేశం వదిలి వెళ్లిపోయే పరిస్థితులు
తల దాచుకోవటానికి ఎక్కడైతేనే
ఈ దుస్థితికి కారకులు ఎవరు
ఎత్కోవటానికి సమయం కానే కాదు
రణం వల్ల వ్రణం మానిపోవచ్చు
గాయపడిన మనస్సును
తిరిగి పుడ్చగలమా
పిచ్చుక పై బ్రహ్మస్త్రం
అగ్ర రాజ్యలకు తగదు తగదు
ఇరుగు పొరుగు దేశాలు
ఆజ్యం లో మరింత కక్షను
ఎగదోయటం మానాలి 
సహనం పాటించి
సమన్వయం చేయాలి
అమాయకుల బలిని ఆపాలి
        గాదిరాజు రంగరాజు
       చెరుకువాడ