అన్నమయ్యకు ప్రణతి

ఆది వాగ్గేయ కారుడు

పదకవిత పితామహుడు

సకల విద్యాల ప్రావీణ్యుడు

స్వరరాగ సంకీర్తనాచార్యులు

తాళ్ళపాక అన్నమాచార్యులు


రామాయణ భారత భాగవత

గ్రంధాల అవపాసన చేసినవాడు


మాట అమృతమయ రాగంగా

పాట శృతిరాగాత్మక కావ్యంగా

భక్తుల్ని పరవసింపజేసినవాడు


తేనేటి రాగాలు జోల పాటలతో

కోనేటి రాయన్ని నిద్రపుచ్చాడు


"బ్రహ్మమొక్కడే .."అంటూ 

కులమత జాతి విద్వేషాలు

సాంఘీక దురాచారాల మీద

సాహిత్యాస్త్రం సంధించాడు


"పొడగంటిమయ్యా..".అంటూ

మొదలైన తన కీర్తన స్రవంతి

ముప్పైరెండువేల దాక సాగింది


ఆధ్యాత్మిక సాహిత్య,శృంగార

రసామృతధార పారించినవాడు


సాహితీ విశ్వరూపంతో జగతిని

మేలుకొల్పి సన్మార్గంలో నడిపాడు


"అంతర్యామి అలసితి"అంటూ..

శ్రీహరి చరణాల చెంతన వాలాడు


వాగ్గేయకారుడు అష్టమిస్తేనేమి

అమరత్వ సంకీర్తనల రూపంలో

భక్తరసజ్ఞుల ఎధపై నర్తిస్తుంటాడు

సాహితీ కిరణమై ప్రభవిస్తుంటాడు 

             """"""""""

(ఫిబ్రవరి 23 న అన్నయ్య వర్దంతి సందర్బంగా….)

             

                   కోడిగూటి తిరుపతి

                  Mbl no :9573929493