ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు


   ముధోల్,ఫిబ్రవరి03(జనంసాక్షి)  మండల కేంద్రమైన ముధోల్ లోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయునికి అభిషేకం పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు క్యాదరి నరసయ్య, సభ్యులు గణేష్, సురేందర్, నారాయణ, లక్ష్మన్, గంగాధర, సత్యనారాయణ, కుల బాంధవులు, తదితరులు పాల్గొన్నారు.