సిఎం జగన్‌ ప్రత్యేక కార్యదర్శిగా జవహర్‌ రెడ్డి

అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా కేఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జవహర్‌రెడ్డి విధుల్లో చేరారు. ఇంతకుముందు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే.