రైతుల్లో భరోసా నింపిన సిఎం కెసిఆర్‌


ఆర్థికంగా రైతుల ఎదుగుదలకు మార్గం

పథకాలన్నీ వెన్నుతట్టి లేపేవే : కడియం
వరంగల్‌,పిబ్రవరి17 (జనంసాక్షి):  దేశచరిత్రలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం రైతుబందు, రైతుబీమా అని ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రైతులకు భీమా కల్పించిందని ఇది విప్లవాత్మక నిర్ణయమని అన్నారు. భీమాతో రైతుల కుటుంబాలకు దీమా కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర రైతుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. దురదృష్టవశాత్తు రైతు మరణించినా, ఆ రైతు కుటుంబంకు వచ్చే రూ. 5 లక్షల భీమాతో ఆర్ధిక భరోసా ఉంటుందన్నారు. రైతుల కష్టాలు, కన్నీళ్లు తుడచడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలోనే మెదటిసారిగా ఇలాంటి పథకం ప్రవేశ పెట్టారని అన్నారు. గతంలో రైతుల సంక్షేమం కోసం ఇన్ని కార్యక్రమాలను అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు ద్వారా ఎకరాకు రూ. 10000 ను అందిస్తున్న ఘనత దేశంలో తెలంగాణలో మత్రమే ఉందన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ వర్తించేలా రైతు బీమా పథకాన్ని ప్రవేశ పెట్టి వారి కుటుంబాల్లో ధైర్యం కల్పించారని అన్నారు. రైతులు ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం అందించే సాయంతో పంటలు పండిరచి ఆర్థికంగా ఎదగాలని అన్నారు. రైతుల కష్టాలు తీర్చాలనే ఉద్ధేశ్యంతో తెలంగాణ సర్కారు రైతు పక్షాన నిలబడి దేశం గర్విచేలా నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు కోసం తీసుకున్న మరో కీలక నిర్ణయం రైతుబీమా అన్నారు. రైతులకు మరణం సంభవింస్తే ఆ కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడతాయి. ఆగాధంలోకి నెట్టబడుతున్నాయి. ఇకనుంచి రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాకూడదని సీఎం కేసీఆర్‌ రైతులందరికీ బీమా పథకాన్ని ప్రవేశపెట్టి వారి
కుటుంబాలకు అండగా నిలిచారని అన్నారు. రైతు సంతోషంగా ఉన్నాడంటే గ్రామం బాగుందన్నది లెక్క.... అలా రైతులంతా బాగుంటే గ్రామాలు, రాష్టాల్రు, దేశం బాగుంటుంది. ఈ తరహా ఆలోచన చేస్తే దేశానికి వెన్నముక అయిన రైతుకు మంచిరోజులు వచ్చినట్లే. రైతులను ఆదుకుంటే గ్రామాలను పటిష్టం చేసినట్లే....దేశాన్ని పటిష్టం చేసుకున్నట్లే...గ్రావిూణ ఆర్థిక వ్యవస్థకు రైతు వెన్నముక..గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ
బలోపేతంతోనే దేశ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉంది. జిడిపిలు, అంకెల గారడీలు పక్కన పెట్టి రైతులపై పెట్టుబడులు పెడితే మట్టిలో మాణిక్యాలు పుడుతాయి. దేశానికి ఢోకా ఉండదు. అందుకే అనేక పథకాలు ఇప్పుడు దేశాన్ని ఆకర్శిస్తున్నాయని కడియం అన్నారు. సహజంగా బీమా అంటే ప్రమాదాలకు వర్తిస్తుంది కానీ ఇది అందరికీ వచ్చేలా నిర్ణయం తీసుకున్నారని కడియం తెలిపారు.