1.యాసంగి ధాన్యంకొనుగోలుపై తదుపరి కార్యచరణపై సీఎం కేసీఆర్ సమాలోచనలు
` ప్రగతిభవన్‌లో మంత్రులతో సమావేశం
` ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పందన, భాజపా నేతల వైఖరి, ధాన్యం సేకరణ సంబంధిత అంశాలపై చర్చ
` ఢల్లీి పరిణామాలను సీఎంకు వివరించిన మంత్రులు
హైదరాబాద్,మార్చి 25(జనంసాక్షి):యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో గతంలోలాగే కేంద్రం మొండి వైఖరి ప్రదర్శించడంతో ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర్‌రావు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చర్చలు జరిపిన రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్లతో కేసీఆర్ ప్రగతిభవన్లో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చర్చల సారాంశాన్ని మంత్రులు సీఎంకు వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పందన, భాజపా నేతల వైఖరి సహా ధాన్యం సేకరణ సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
2.హైదరాబాద్‌తో కలసి పనిచేయనున్న బోస్టన్
` రెండు నగరాల మధ్య అనేక సారూప్యతలు
` మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్
` హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి
` గ్లోబల్ ఇన్నోవేషన్`2022 సదస్సులో కేటీఆర్
` అమెరికా పర్యటనలో పలు ఒప్పందాలు చేసుకున్న మంత్రి
బోస్టన్,మార్చి 25(జనంసాక్షి):హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్ సిటీ ముందుకు వచ్చింది. బోస్టన్‌లో ఆరోగ్య రంగంపై జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్`2022 సదస్సులో పాల్గొన్న మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్.. మంత్రి కేటీఆర్‌కు ఈ మేరకు హావిూఇచ్చారు. హైదరాబాద్‌కు, బోస్టన్ నగరానికి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ తరహాలోనే బోస్టన్‌లో కూడా ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలకు చెందిన అనేక కంపెనీలు పని చేస్తున్నాయన్నారు. రెండు రాష్టాల్ర మధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవకాశాలను పరిశీలించడంతో పాటు లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని చార్లీ బేకర్ పేర్కొన్నారు. తద్వారా ఈ రంగంలో అనేక నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. బోస్టన్‌లో హెల్త్ రికార్డుల డిజిటలీకరణ కొనసాగుతుందని, తద్వారా అక్కడి పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నయన్న విషయాన్ని బేకర్ ప్రస్తావించారు. ముఖ్యంగా కరోన సంక్షోభ సమయంలో ఈ డిజిటల్ హెల్త్ రికార్డుల వలన వేగంగా వారికి చికిత్స అందించేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. ఇరు నగరాల మధ్య అవగాహన కోసం చేపట్టే కార్యక్రమాల వలన భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బయో లైఫ్ సైన్సెస్ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపత్యంలో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను వివరించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణలో కూడా ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో హెల్త్ రికార్డ్‌లను డిజిటలైజేషన్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతమున్న లైఫ్‌సైన్సెస్ రంగంలోని సైంటిస్టులతోపాటు ఐటీ, టెక్ రంగాల డాటా సైంటిస్టుల చేస్తున్న ఉమ్మడి కృషితో రానున్న రోజుల్లో అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. వివిధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత వలన రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ అన్నారు.
3.తెలంగాణ బిడ్డలు భారతీయులుకారా..!
` నవోదయవిద్యాలయల ఏర్పాటులో వివక్ష
` పార్లమెంటులో వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు
` అనుమతించక పోవడానికి నిరసనగా టిఆర్‌ఎస్ వాకౌట్
` గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన
` తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంపై మండిపడ్డ నామా
న్యూఢల్లీి,మార్చి 25(జనంసాక్షి): నవోదయ విద్యాలయాల ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యపూరిత వైఖరికి నిరసనగా పార్లమెంటు ఉభయ సభల నుంచి టిఆర్‌ఎస్ వాకౌట్ చేసింది. ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చిన టిఆర్‌ఎస్ చర్చకు పట్టుబట్టింది. అయితే వీటిని ఉభయసభల్లోనూ తిరస్కరించారు. దీంతో వాకౌట్ చేసిన ఎంపిలు పార్లమెంట్ గాంధీ విగ్రహంముందదు నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకునినిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డలు భారతీయులు కాదా? ఎందుకీ వివక్ష? అని కేంద్రాన్ని ఎంపీ నామా నిలదీశారు. తెలంగాణలో నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై ఉభయ సభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చచారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు. రాజ్యసభలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే. కేశవరావు, లోకసభలో టీఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ వాయిదా తీర్మానాలను ఉభయ సభలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. రాష్టాన్రికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా పలుమార్లు చెప్పినప్పటికీ, కేంద్రం పెడచెవిన పెడుతుందని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, నిరుద్యోగం, నవోదయ విద్యాలయాల ఏర్పాటు వంటి అంశాలను లేవనెత్తామని తెలిపారు. శుక్రవారం నవోదయ విద్యాలయాల అంశంపై రాజ్యసభ, లోక్ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చాము. వాయిదా తీర్మానం పై చర్చించాలి.. తెలంగాణకు అన్యాయ జరుగుతుందిని చెప్పాము. కానీ కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని ఎంపీ తెలిపారు. జిల్లాకొక నవోదయ విద్యాలయం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎంపీ నామా నాగేశ్వర్ రావు గుర్తు చేశారు. ప్రస్తుతం 9 నవోదయ విద్యాలయాలు మాత్రమే ఇచ్చారు.. ఇంకా 23 ఇవ్వాల్సి ఉంది. 8 ఏండ్ల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాము. ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.. కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. 33 జిల్లాలకు 33 నవోదయ విద్యాలయాలు ఇవ్వాల్సిందేనని ఎంపీ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా 7 ఐఐఎం లు.. 4 ఎంఐటీలు.. 16 ఐఐటీలు, 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు.. ఇందులో తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ పట్ల కేంద్రం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తుందన్నారు. మా కంటే చిన్న రాష్టాల్రైన అసోంలో 27, గుజరాత్ లో 31, హర్యానాలో 21, హిమాచల్ ప్రదేశ్‌లో 17, మణిపూర్‌లో 11, త్రిపురలో 7 నవోదయ విద్యాలయాలు ఉన్నాయని నామా నాగేశ్వర్ రావు గుర్తు చేశారు. ఇదిలావుంటే పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసిన ఎంపిలు గగాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, నేతకాని వెంకటేశ్, రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై ఉభయ సభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చినపట్టికీ చర్చకు తిరస్కరించడంతో వాకౌట్ చేశారు.
4.టెట్‌కు బీఈడీ విద్యార్థులూ అర్హులే..
` ఎప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపులు
హైదరాబాద్,మార్చి 25(జనంసాక్షి):టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో ఈయేడు చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పేపర్ 1, పేపర్ 2కు కలిసి దరఖాస్తు రుసుంను రూ. 300గా నిర్ణయిం చారు. ఒక పేపర్‌కు దరఖాస్తు చేసుకున్న ఇదే రుసుం వర్తించనుంది. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసేటప్పుడు అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, స్టేట్, మొబైల్ నంబర్ తప్పనిసరి. ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరి తేదీ ఏప్రిల్ 11. పేమెంట్ అయిన తర్వాత జర్నల్ నంబర్ వస్తోంది. ఈ నంబర్‌తో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకో వచ్చు. ఇక బీఈడీ, డీఈడీ చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్ రాసుకునేం దుకు అవకాశం కల్పించారు. 2017 టెట్ సిలబస్ ప్రకారమే ఈ సారి పరీక్షలు నిర్వహించ నున్నారు. హెల్ప్ డెస్క్ సేవలు మార్చి 26 నుంచి జూన్ 12వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. జూన్ 12న టెట్ నిర్వహించి, 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. జూన్ 6 నుంచి టెట్ హాల్ టికెట్స్‌ను సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో టెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు.
5.కొలువుదీరిన యోగి సర్కారు
` యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం
` ఉప ముఖ్యమంత్రులుగా బ్రిజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య
` హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, ఇతర ముఖ్యమంత్రులు
లక్నో,మార్చి 25(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. విజయవంతంగా ఐదేళ్ల పాలన పూర్తి చేసిన ఒక ముఖ్యమంత్రి వరుసగా రెండోసారి మళ్లీ ప్రభుత్వ పగ్గాలను చేపట్టడం గత 37 ఏళ్లలో ఇదే ప్రథమం. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్టాల్ర సీఎంలు, సాధుసంతులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ చేత గవర్నర్ ఆనంది బెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా బ్రిజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రమాణ స్వీకారం చేశారు. యోగి ఆదిత్యనాథ్ 52 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హర్యానా సీఎం ఎల్‌ఎల్ ఖట్టార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్, ఆసోం సీఎం హిమాంత బిస్వా శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ సీఎం భూ పేంద్ర పటేల్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. మంత్రులుగా కేబినేట్ ర్యాంకులో కేశవ్ ప్రసాద్ మౌర్య (ఉప ముఖ్యమంత్రి), బ్రజేష్ పాఠక్ (ఉప ముఖ్యమంత్రి), సూర్య ప్రతాప్ షాహి, సురేష్ కుమార్ ఖన్నా, స్వతంత్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, లక్ష్మీనారాయణ చౌదరి, జయవీర్ సింగ్, ధర్మపాల్ సింగ్, నంద్ గోపాల్ గుప్తా, భూపేంద్ర సింగ్ చౌదరి, అనిల్ రాజ్‌భర్, జితిన్ ప్రసాద, రాకేష్ సచన్, అరవింద్ కుమార్ శర్మ, యోగేంద్ర ఉపాధ్యాయ్, ఆశిష్ పటేల్, సంజయ్ నిషద్ ప్రమాణం చేశారు. ఇక .సహాయ మంత్రులు (ఇండిపెండెట్ చార్జి)నితిన్ అగర్వాల్, కపిల్ దేవ్ అగర్వాల్, రాజేంద్ర జైశ్వాల్, సందీప్ సింగ్, గులాబ్ దేవి, గిరీష్ చంద్ర యాదవ్, థర్మవీర్ ప్రజాపతి, అసిం అరుణ్, జేపీఎస్ రాథోడ్, దయాశంకర్ సింగ్, నరేంద్ర కష్యప్, దినేష్ ప్రతాప్ సింగ్, అరుణ్ కుమార్ సక్సేనా, దయాశంకర్ మిశ్రా దయాళు.సహాయ మంత్రులుమయాంకేశ్వర్ సింగ్, దినేష్ ఖటీక్, సంజీవ్ గాండ్, బల్దేవ్ సింగ్ ఒలేఖ్, అజిత్ పాల్, జశ్వంత్ సైని, రాంకేష్ నిషద్, మనోహర్ లాల్ మన్ను కోరి, సంజయ్ గాంగ్వార్, బ్రిజేష్ సింగ్, కేపీ సింగ్, సురేష్ రహి, సోమేందర్ తోమర్, అనూప్ ప్రధాన్ వాల్మీకి, ప్రతిభా శుక్లా, రాకేష్ రాథోర్ గురు, రజనీ శర్మ, సతీష్ శర్మ, డానిష్ అజాద్ అన్సారీ, విజయ్ లక్ష్మీ గౌతమ్ ప్రమాణం చేశారు.
6.తెలంగాణను అవమానించేలా పీయూష్ వ్యాఖ్యలు
` ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు
` బిజెపి నేతలను గ్రామాల్లోకి తిరగనీయకుండా చేయాలి
` విూడియా సమావేశంలో ఎర్రబెల్లి, పల్లా
హైదరాబాద్,మార్చి 25(జనంసాక్షి): తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అనే రీతిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడి అవమాపరిచారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ధాన్యం సేకరణతో పాటు నూకలు ఎవరు తింటారో తేల్చుకుందామని బీజేపీ నాయకులకు దయాకర్ రావు సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి దయాకర్ రావు విూడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా, కించపరిచేలా మాట్లాడిన పీయూష్ గోయల్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గులేకుండా కేంద్రానికి వంత పాడే ధోరణిని మానుకోవాలని సూచించారు. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.రాష్ట్రంలో వ్యవసాయానికి వైభవం తీసుకొచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఇంజినీర్లు, సాప్ట్‌వేర్ ఉద్యోగులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారంటే కేసీఆర్ తీసుకుంటున్న రైతు అనుకూల విధానాలే కారణమని స్పష్టం చేశారు. పట్టణాల నుంచి ప్లలెలకు ప్రజలు వలసపోయే పరిస్థితి ఏర్పడిరదన్నారు. కేంద్రం రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. మా నాన్న బతికుంటే కేసీఆర్ విధానాలతో బతికిన వ్యవసాయాన్ని చూసి సంతోషించే వారని దయాకర్ రావు గుర్తు చేశారు. తెలంగాణ రైతులను పట్టించుకోకుండా కేంద్రానికి వంత పాడుతున్న బీజేపీ నేతలను ఢల్లీికి తరమాలని దయాకర్ రావు సూచించారు. వడ్లు కొనిపించే దాకా బీజేపీ నేతలను గ్రామాల్లో అడుగు పెట్టనివ్వొద్దని చెప్పారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు సిగ్గుండాలి. వ్యవసాయ చట్టాలపై రైతులు కేంద్రం మెడలు వంచినట్టే.. తెలంగాణ రైతులు కూడా ఏకమై ధాన్యం కొనేదాకా ఉద్యమిస్తారని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరిత మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమానపరిచాడని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ గురించి మాట్లాడే బీజేపీ నేతలు ధాన్యం కొనుగోలుపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తర భారతదేశానికో నీతి, దక్షిణ భారతదేశానికో నీతి అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్ తెలంగాణ, రైతు వ్యతిరేకి అని గోయల్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి అయితే 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో ఎందుకు పండిరదని ప్రశ్నించారు. పీయూష్ గోయల్ చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నలుగురు బీజేపీ ఎంపీలు కేంద్రానికి తప్పుడు సమాచారం ఇస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. పీయూష్ గోయల్ వెలికి వేషాలు మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని వ్యాఖ్యానించిన గోయల్.. రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు పీయూష్ దగ్గరికి వెళ్లి తెలంగాణ ధాన్యం కొనాలని డిమాండ్ చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు.
7.ఆపరేషన్ గుజరాత్..
` రంగంలోకి దిగిన పీకే
` దృష్టి సారించిన కాంగ్రెస్
న్యూఢల్లీి,మార్చి 25(జనంసాక్షి):’మిషన్ ఇన్ గుజరాత్’పై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ రంగం దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని కలిసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొంతమంది గుజరాత్ కాంగ్రెస్ నేతలు కూడా ప్రశాంత్ కిషోర్‌ను తీసుకోవడానికి ఆసిక్తగా చూపుతున్నట్లు సమాచారం. తుది అభిప్రాయం మాత్రం రాహుల్ గాంధీదేనని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ప్రశాంత్ కిషోర్ సన్నిహితులు ఈ వార్తలను తిరస్కరించారు. గతేడాది ఆయన కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారని, అయితే పలు కారణాలతో భాగస్వామ్యం కుదరలేదని అన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్‌లోనూ వెనకబడిపోవడంతో కాంగ్రెస్‌కి పెద్ద ఎదురుదెబ్బ తగిలిన్లటైంది.
8.మళ్లీ పెట్రోమంట
` మరోమారు పెరిగిన ధరలు
` ఒక్కరోజు గ్యాప్‌తో మూడోరోజు ధరల వాత
` కేంద్రమంత్రి వ్యాఖ్యలపై నెటిజన్ల మండిపాటు
న్యూఢల్లీి,మార్చి 25(జనంసాక్షి):పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రో, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. తాజా పెంపుతో దేశరాజధాని ఢల్లీిలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.112.51, డీజిల్ రూ.96.70గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ రూ.112.51 (84 పైసలు), డీజిల్ రూ.96.70గా (85 పైసలు) ఉన్నాయి. చెన్నైలో 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71, కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.34 (84 పైసలు), డీజిల్ రూ.91.42 (80 పైసలు)కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున అధికమయ్యాయి. దీంతో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. కాగా, దేశంలో గతేడాది నవంబర్ 4వ తేదీ తర్వాత మొదటిసారిగా మార్చి 22న పెట్రోల్, డీజిల్ ధరలు అధికమయ్యాయి. మార్చి 23న కూడా చమురు కంపెనీలు ధరలు పెంచాయి. తాజా పెంపుతో మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిలు ధరలు రూ.2.40
చొప్పున పెరిగాయి. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిపోవడంతో చమురు కంపెనీలు లీటరు డీజిలుపై రూ.13.1 నుంచి రూ.24.9 వరకు, పెట్రోలుపై రూ.10.6 నుంచి రూ.22.3 వరకు వడ్డించే అవకాశం ఉన్నదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమర్థించుకొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగానే ఈ ధరలను పెంచామని, ఒకవిధంగా చూస్తే తాము పెంచిన ధరలు తక్కువేనని చెప్పుకొచ్చారు. ఈ మేరకు గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ’ఏప్రిల్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య అంతర్జాతీయ విపణిలో ద్రవ సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) ధరలు 37 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. కరోనా సంక్షోభం, ఆ తర్వాత రష్యా`ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ, బంకుల్లో మేము పెట్రో ధరలను 5 శాతం మాత్రమే పెంచాం’ అని పురి తెలిపారు. వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపుపై కూడా వివరణ ఇచ్చారు. ’ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2022 మధ్య అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధర 285 శాతం పెరిగింది. అయితే, గడిచిన ఆరు మాసాల్లో 37 శాతం మాత్రమే పెంచాం’ అని పేర్కొన్నారు. వినియోగదారులకు అందుబాటు ధరలోనే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పెట్రోపెంపుపై పార్లమెంట్‌లో పురి ఇచ్చిన
వివరణపై సోషల్‌విూడియాలో నెటిజన్లు పెద్దయెత్తున మండిపడుతున్నారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికే కేంద్రం కావాలనే పెట్రో రేట్లను ఇంతకాలం స్థిరంగా కొనసాగించిందని, ఎన్నికలు ముగియగానే మళ్లీ బాదుడు మొదలుపెట్టిందని విమర్శిస్తున్నారు. కేంద్రమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.
9.ఏవియేషన్ షోను ప్రారంభించిన జ్యోతిరాదిత్య
హైదరాబాద్‌కు గర్వకారణమన్న మంత్రి వేముల
హైదరాబాద్,మార్చి 25(జనంసాక్షి):వింగ్స్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్న ఏషియన్ బిగ్గెస్ట్ ఏవియేషన్ ఎక్స్‌పోను పౌరవిమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సల్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. సివిల్ ఏవియేషన్ మినిస్టీ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా ఎక్స్ పో గురువారమే ప్రారంభమైంది. అయితే అధికారికంగగా శుక్రవారం జ్యోతిరాదిత్య ప్రారంభించారు. ఈ నెల 27 వరకు వింగ్స్ ఇండియా ఎక్స్ పో కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎయిరో స్పేస్ తయారీ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏవియేషన్ షోకు ఆతిథ్యమివ్వడం హైదరాబాద్‌కు గర్వకారణమన్నారు. ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు రాష్టాన్రికి ప్రాధాన్య రంగాలని ఆయన చెప్పారు. హైదరాబాద్ బేగంపేటలో జరుగుతున్న ఏవియేషన్ షోలో భాగంగా వింగ్ ఇండియా ఏవియేషన్ సదస్సును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లయింగ్ ఫర్ ఆల్ విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు. పాత విమానాశ్రయాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను అభివృద్ధికి చేస్తున్నామన్నారు. వాటర్ ఎయిరో డ్రోమ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని వెల్లడిరచారు. అన్ని జిల్లాల్లో హెలీప్యాడ్ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. డ్రోన్ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం తన విజన్‌ను చాటిచెప్పిందన్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా`2022 ఏవియేషన్ షో సందర్శకులను అలరిస్తోంది. గతేడాది బోయింగ్ విమానాల హంగులను చూసిన నగరవాసులను.... ఈసారి ఎయిర్‌బస్ సొగసులు, ఎంబ్రరర్ రాజసం, ఫైటర్ జెట్ విన్యాసాలు కట్టిపడేస్తున్నాయి. ఆర్మీ హెలికాప్టర్లు, చార్టెడ్ ఫ్లయిట్లు, కమర్షియల్ విమానాలు ఇలా పది వరకు విమానాలు రన్‌వేపై సందర్శకుల కోసం నిలిపి ఉంచారు. విమానాల లోపలి ఫీచర్లు, పనితీరు, బోర్డింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై ఎగ్జిబిటర్లు.... సందర్శకులకు వివరిస్తున్నారు. మొదటి రోజు బీ2బీ విూటింగ్స్‌లో భాగంగా ఎయిర్‌బస్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీలు భారత పౌరవిమానయాన శాఖతో.... తమ భాగస్వామ్యం, భవిష్యత్తు ఏవియేషన్ ప్రణాళికలు పంచుకున్నాయి. విమానాల ప్రదర్శనతోపాటు... ఎయిర్‌బస్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీలు భవిష్యత్తు ప్రణాళికలపై కీలక ప్రకటలను వెలువరించాయి. భారత్ తమకు కీలక వ్యాపార భాగస్వామి అని రాబోయే ఇరవై ఏళ్లలో 2 వేల 210 విమానాలను భారత్‌కు అందజేస్తామని ఎయిర్‌బస్ ప్రకటించింది. ప్రముఖ విమాన ఇంజన్ల తయారీ కంపెనీ.... ప్రాట్ అండ్ విట్నీ ఈ ఏడాది ఏప్రిల్ కల్లా బెంగళూరులో తమ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. క్రమంగా భారత్‌లోని ఇతర నగరాలకు ఈ ఫెసిలిటీని విస్తరిస్తామని పేర్కొంది.ఏవియేషన్ షోలో భాగంగా ఎయిర్ బస్ 350 ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బిజినెస్ డెలిగేషన్, ఎగ్జిబిటర్ల కోసం... ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫీచర్లను ప్రదర్శించారు. ఏవియేషన్ షోలో భాగంగా సందర్శకుల కోసం వింగ్ కమాండర్ కొమర్, స్క్వాడ్రన్ లీడర్ అక్షయ్ టీం ఆధ్వర్యంలోని సారంగ్ టీమ్ చేసిన విన్యాసాలు చూపరులను అలరించాయి.
10.మొదటి దశ సైనిక చర్య పూర్తయినట్లే
` వెల్లడిరచిన రష్యా రక్షణశాఖ
కీవ్,మార్చి 25(జనంసాక్షి): మాస్కో: ఉక్రెయిన్పై చేపట్టిన సైనిక చర్యలో మొదటి దశ దాదాపు పూర్తయ్యిందని రష్యా రక్షణశాఖ వెల్లడిరచింది. ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా విముక్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. అయినప్పటికీ, దిగ్బంధించిన ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేసే అవకాశాలను తోసిపుచ్చలేదు. ఉక్రెయిన్లో చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్ విషయంలో రెండు ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ తెలిపింది. ‘ఒకటి.. డాన్బాస్లోని వేర్పాటువాద ప్రాంతాల్లోనే దాడులు చేయడం. మరొకటి.. ఉక్రెయిన్ మొత్తానికి విస్తరించడం’ అని రక్షణ శాఖ చెప్పింది.రష్యా సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ప్రతినిధి సెర్గీ రుడ్స్కోయ్ మాట్లాడుతూ.. 93 శాతం లుహాన్స్క్, 54 శాతం డొనెట్స్క్ రీజియన్లు రష్యా నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. ఉక్రెయిన్ వైమానిక, నావికా దళాల్లోని అత్యధిక భాగాన్ని తమ బలగాలు నాశనం చేశాయని.. దీంతో మొదటి దశ సైనిక చర్య విజయవంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు.సైనిక చర్య పేరుతో గత నెల 24వ తేదీ నుంచి ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేస్తోంది. కనికరం లేకుండా పౌర గృహాలపైనా బాంబులు వేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే వేలాది మంది పౌరులు, వందలాది మంది చిన్నారులు మృతిచెందినట్లు సమాచారం. లక్షల కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. అనేక దేశాలు ఈ చర్యను వ్యతిరేకిస్తూ మాస్కోపై కఠిన ఆంక్షలు విధిస్తున్నా పుతిన్ సర్కారు వెనక్కి తగ్గడం లేదు.
మరోసారి అత్యాధునిక క్షిపణిని ప్రయోగించిన రష్యా
ఉక్రెయిన్‌పై పోరులో రష్యా తన అమ్ములపొదిలోని కీలక అస్త్రాలను వాడటం మొదలుపెట్టింది. ఇప్పటికే కింజల్ హైపర్‌సోనిక్ క్షిపణిని రెండు సార్లు వాడిన రష్యా..తాజాగా కాలిబర్ దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైళ్లను రెండోసారి ప్రయోగించింది. నిన్న క్రిమియాలోని సెవస్టపోల్ వద్ద సముద్రంపై రష్యన్ కార్వెట్టి నుంచి దీనిని ప్రయోగించింది. దీనికి సంబందించిన వీడియోకూడా వైరల్ అయింది. రష్యా రక్షణ శాఖ దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. ఉక్రెయిన్‌లోని ఒర్జెవ్ గ్రామంలోని సైనిక స్థావరంపై దాడి చేసినట్లు పేర్కొంది. ఈ ప్రదేశం కీవ్‌కు 200 మైళ్ల దూరంలో ఉంది. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి అందిన ఆయుధాలను కూడా ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా ఈ క్షిపణులను అత్యంత కీలకమైన లక్ష్యాలపై మాత్రమే ప్రయోగిస్తుందని పశ్చిమదేశాల అధికారులు చెబుతున్నారు.గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకొని వెళ్లి భూమిపై ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేసేలా కాలిబర్ క్షిపణిని అభివృద్ధి చేశారు. భూమికి తక్కువ ఎత్తులో సమాంతరంగా ఇది ప్రయాణిస్తుంది. మార్గం మధ్యలో దీని లక్ష్యానికి సంబంధించిన మార్గాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. దీనిలో దాదాపు 500 కిలోల వార్‌హెడ్‌ను అమర్చవచ్చు. దీనిని గోదాములు, కమాండ్ పోస్టులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు వాడతారు. మార్చి నెల మొదట్లో కూడా రష్యా క్షిపణిని వాడి మైకలైవ్ నగరంపై దాడి చేసింది. నాటి దాడిలో 8 మంది మరణించారు. కాలిబర్‌ను అభివృద్ధి చేసిన తర్వాత 2015 అక్టోబర్‌లో సిరియాలో దీనిని ఉపయోగించింది. అప్పట్లో కాస్పియన్ సముద్రం నుంచి 26 క్షిపణులను సిరియా ప్రభుత్వ వ్యతిరేక వర్గంపై ప్రయోగించింది.
11.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొహెడ మార్కెట్
` అదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన
` ఢల్లీిలోని అతిపెద్ద పండ్లమార్కెట్ ఆజాద్‌పూర్‌మండీని సందర్శించిన మంత్రి నిరజంన్‌రెడ్డి
న్యూఢల్లీి,మార్చి 25(జనంసాక్షి):అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొహెడ మార్కెట్ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని
మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.శనివారం ఢల్లీిలోని అతిపెద్ద పండ్లమార్కెట్ ఆజాద్‌పూర్‌మండీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో పండ్ల రైతులకు ప్రోత్సాహం అవసరంమారుతున్న జీవనశైలి నేపథ్యంలో పండ్ల ప్రాధాన్యం పెరిగింది .. ప్రజలు ఎక్కువగా పండ్లను వినియోగిస్తున్నారుమారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారాయి, భవిష్యత్ లో మరింత మారతాయి మార్కెట్ నిర్వహణపై చర్చవ్యవసాయ పంటల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా ఉద్యాన పంటల ప్రాధాన్యం, విలువ ఎక్కువ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగు పెరుగుతున్నది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయం సుస్థిరమవుతున్నది’’ అని అన్నారు. సందర్శనలో పాల్గొన్న వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు