1.ధాన్యం ఎఫ్‌సీఐ సేకరించాలి
` రాష్ట్రంపై నిందలు ఆపండి
` మంత్రి నిరంజన్‌రెడ్డి
` ఢల్లీికి చేరుకున్న తెలంగాణ మంత్రుల బృందం
న్యూఢల్లీి,మార్చి 22(జనంసాక్షి):పంజాబ్ తరహాలోనే తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యాన్ని కేంద్ర సర్కారు కొనుగోలు చేయాలని రాష్ట్య వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢల్లీి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు.కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలుచేయాలని కోరుతామని, స్పష్టమైన హావిూ రాకపోతే సీఎం కేసీఆర్ ప్రకటించిన దానికి అనుగుణంగా ముందుకువెళ్తామన్నారు. వరిధాన్యం కొనుగోలుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు అర్థరహితమన్నారు. ఈ విషయంపై మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలి.. లేదా ఆ శాఖ అధికారులు మాట్లాడాలిగానీ బండి సంజయ్‌కి ఏం సంబంధం అని ప్రశ్నించారు. కేంద్రం స్పందించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్ర సర్కారే కొనుగోలు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఢల్లీికి వెళ్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి, సంబంధిత అధికారులను కలుస్తామని చెప్పారు. వన్ నేషన్`వన్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ రూపొందించాలని కోరతామన్నారు. కేంద్ర సర్కారుతో తాడోపేడో తేల్చుకుని వస్తామన్నారు.
2తెలంగాణలో ‘కాల్‌అవే’ పెట్టుబడులు
` డిజిటెక్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థ
` విజయవంతంగా కొనసాగుతున్న కేటీఆర్ అమెరికా పర్యటన..
` పలు కంపెనీలతో భేటీలు
హైదరాబాద్,మార్చి 22(జనంసాక్షి): అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా కేటీఆర్ బృందం అమెరికాలో పర్యటిస్తూ వివిధ కంపెనీలతో సమావేశం అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన కాల్ అవే గోల్ఫ్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌లో ఒప్పందం చేసుకున్నారు. టాప్ గోల్ఫ్ బ్రాండ్‌గా కాల్ అవే కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లో కాల్ అవే నెలకొల్పనున్న డిజిటెక్ సెంటర్ ద్వారా కొత్తగా 300 మందికి ఉపాధి లభించే అవకాశాలున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. డిజిటెక్ సెంటర్‌తో పాటు గోల్ఫ్ ఉత్పత్తుల తయారీ కొరకు రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. తెలంగాణలో స్పోర్ట్స్ టూరిజంలో భాగం కావాలని కంపెనీ ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు.
ఫిస్కర్ సీఈఓతో భేటీ..
తన పర్యటనలో భాగంగా ఫిస్కర్ సంస్థ ఛైర్మన్, సీఈఓతో కేటీఆర్ బృందం సమావేశం అయింది. భేటీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విషయంలో రాష్ట్రం అవలంబిస్తోన్న విధానాలను ఫిస్కర్ సంస్థ ప్రతినిధులకు కేటీఆర్ వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా కోరారు. కేటీఆర్ ఆహ్వానం మేరకు ఫిస్కర్ సంస్థకు చెందిన బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించి పెట్టుబడుల పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పరిశీలించనుంది.
3.తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదల
` జూలైలో ఎంసెట్ నిర్వహణకు తేదీల ప్రకటన
హైదరాబాద్,మార్చి 22(జనంసాక్షి):తెలంగాణ ఎంసెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. జులై 2022లో ఎంసెట్, ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్ష జరగనుంది. జులై 13న ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష ఉంటుంది. జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్‌ను నిర్వహిస్తారు. జులై 13న ఈసెట్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలను 28 రీజనల్ సెంటర్స్ పరిధిలోని 105 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
4.పెట్రోమంటపై భగ్గుమన్న పార్లమెంట్
దిల్లీ,మార్చి 22(జనంసాక్షి): చమురు, వంట గ్యాస్ ధరల పెంపుపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు మంగళవారం దద్దరిల్లాయి. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల గంట పూర్తికాగానే కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి చమురు ధరల అంశాన్ని లేవనెత్తారు. ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతారని ప్రతిపక్ష పార్టీలు ఎప్పటి నుంచో చెబుతున్నాయని, ఇప్పుడు అదే జరిగిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ధరల పెంపునకు నిరసగా కాంగ్రెస్, తృణమూల్, ఎన్సీపీ, డీఎంకే, వామపక్ష పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. విపక్షాలు మాట్లేందుకు స్పీకర్ అనుమతినివ్వకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం తలెత్తింది. ఈ ఉదయం పెద్దల సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు చమురు ధరలపై ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభమైనా.. అదే పరిస్థితి పునరావృతమైంది. టీఎంసీ, కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి వెల్‌లోకి దూసుకెళ్లగా.. ఇతర ప్రతిపక్ష సభ్యులు టేబుళ్లపై నిల్చుని నిరసన చేపట్టారు. డిప్యూటీ ఛైర్మన్ వారించినా సభ్యులు వెనక్కి తగగ్లేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. దాదాపు ఐదు నెలల తర్వాత చమురు ధరలను మంగళవారం పెంచారు. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 80 పైసల చొప్పున పెంపు ఉంటుందని చమురు సంస్థలు నేడు ప్రకటించాయి. ఇక వంటగ్యాస్ సిలిండర్ ధరను కూడా రూ.50 పెంచుతున్నట్లు వెల్లడిరచాయి
5 .దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్,మార్చి 22(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు ఐదు నెలల తర్వాత చమురు సంస్థలు ధరలను పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 87పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.10, డీజిల్ రూ95.40పైసలకు చేరింది. ఏపీలో పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగింది. దీంతో విజయవాడలో పెట్రోల్ రూ.110.80, డీజిల్ రూ.96.83గా ఉంది. గుంటూరులో పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ.97.26కు చేరింది.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
6.టీఎంసీ నేత హత్యతో బెంగాల్‌లో చెలరేగిన హింస
` 8 మంది మృతి
బీర్భుమ్,మార్చి 22(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఓ రాజకీయ నాయకుడి హత్య అనంతరం చెలరేగిన ఉద్రిక్తతల్లో 8 మంది సజీవ దహనమయ్యారు.హత్యకు నిరసనగా ఆందోళనకు దిగిన కొందరు ఇళ్లకు నిప్పంటించడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..బీర్భుమ్ జిల్లాలోని రాంపూర్‌హట్ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ నాయకుడు భదు ప్రధాన్ సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై నాటు బాంబులు విసరడంతో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున రాంపూర్‌హట్ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మనుషుల్ని లోపల పెట్టి, ఇళ్లకు తాళాలు వేసి నిప్పంటించినట్లు స్థానికులు చెబుతున్నారు. 10`12 నివాసాలకు మంటలు అంటుకున్నాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 8 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భదు ప్రధాన్ హత్యకు ప్రతీకారంగానే ఈ అల్లర్లు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వంపై మండిపడ్డాయి. అయితే ఈ అల్లర్ల వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తు చేపట్టేందుకు బెంగాల్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది.
9.రష్యాపై చర్యల విషయంలో భారత్ స్పందన బలహీనం..
` బైడెన్ సంచలన వ్యాఖ్యలు
` నాటో రష్యాకు భయపతుతోంది
` అందుకే సభ్యత్వం ఇవ్వడంలేదు
` జెలెన్‌స్కీ వ్యాఖ్యలు
వాషింగ్టన్,మార్చి 22(జనంసాక్షి): ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా విషయంలో తటస్థంగా ఉంటూ వస్తోన్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మాస్కోపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకో బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ఉంటూ రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకొస్తుంటే.. దిల్లీ మాత్రం అస్థిరంగా, బలహీనంగా స్పందిస్తోందని అన్నారు. సీఈవోలతో జరిగిన బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.’’పుతిన్ గురించి నాకు బాగా తెలుసు. నాటోను విభజించగలనని బలంగా నమ్ముతూ పుతిన్ లెక్కలు కూడా వేసుకున్నారు. కానీ, ఆయన లెక్క తప్పింది. నాటో కూటమి ఐక్యంగా ఉంది. చరిత్రలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఇదంతా రష్యా వల్లే అనుకుంటున్నాను. అయితే, పుతిన్ దూకుడును అడ్డుకోవడంలో నాటో, అమెరికా మిత్ర దేశాలు, ఐరోపా సమాఖ్య, ఆసియా భాగస్వామ్య దేశాలన్నీ ఐక్యంగా ఉన్నాయి. క్వాడ్ కూటమిలోనూ జపాన్, అస్ట్రేలియా దేశాలు రష్యాపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ, ఒక్క భారత్ మాత్రమే ఈ విషయంలో ఎందుకో బలహీనంగా ఉంది. రష్యాపై ఆంక్షల వంటి చర్యలు తీసుకునే విషయంలో అస్థిరంగా ఉంది’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్య దాదాపు నెల రోజులుగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. పలు నగరాలపై రష్యా సేనలు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రెమ్లిన్ దురాక్రమణను అడ్డుకునేందుకు అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు రష్యాపై ఆంక్షల కొరడా రaుళిపించాయి. మాస్కో నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా.. భారత్‌కు చౌక ధరకు చమురు విక్రయించేందుకు ముందుకొచ్చింది. దీనికి భారత్ కూడా అంగీకరించింది.రష్యా నుంచి దాదాపు 30 లక్షల బ్యారెళ్ల ముడి చమురును డిస్కౌంట్‌లో కొనుగోలు చేసింది. కాగా.. ఈ పరిణామాలపై ఇటీవల స్పందించిన అమెరికా.. భారత్ ఒప్పందం ఆంక్షల పరిధిలోకి రాదని పేర్కొంది. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో తాము ఎటు పక్క నిలిచామో, రేపు చరిత్ర పుస్తకాల్లో తమ గురించి ఏమని రాస్తారో ప్రతి దేశమూ గుర్తుంచుకొని వ్యవహరించాలని హెచ్చరించింది.అంతకుముందు.. రష్యా సాగిస్తోన్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి వేదికగా పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై ఓటింగ్‌కు కూడా భారత్ దూరంగా ఉంటూ వచ్చింది. తాము యుద్ధానికి వ్యతిరేకమన్న భారత్.. చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ పరిణామాలపైనే బైడెన్ తాజాగా స్పందించారు.
నాటో రష్యాకు భయపతుతోంది: జెలెన్‌స్కీ
రష్యాను ఎదుర్కొనే క్రమంలో నాటో దేశాల సాయం పొందుతోన్న ఉక్రెయిన్..వాటిని విమర్శించే విషయంలో కఠినవైఖరే ప్రదర్శిస్తోంది. నాటో సభ్యత్వం, నో`ఫ్లై జోన్ ఏర్పాటు విషయంలో వాటిని విమర్శిస్తూనే ఉంది. నాటో కూటమి రష్యాకు భయపడుతోందని, అందుకే ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటూ తాజాగా ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాటో కూటమిలో మమ్మల్ని చేర్చుకునేందుకు అంగీకరించాలి. లేకపోతే రష్యాకు భయపడుతున్నామని అందుకే చేర్చుకోలేకపోతున్నామని బహిరంగంగా ఒప్పుకోవాలి. చివరిది నిజం. ఆ తర్వాత మేం శాంతించాలి. మాకు నాటోలో సభ్యత్వం లేకపోయినా భద్రతకు హావిూ ఇవ్వగల నాటో దేశాలున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు.ఇక మేరియుపొల్ నగరంలో ఆయుధాలను విడిచిపెట్టి, లొంగిపోవాలని రష్యా చేసిన డిమాండ్‌ను ఉక్రెయిన్ అంగీకరించదని ఈ సందర్భంగా జెలెన్‌స్కీ వెల్లడిరచారు. ‘రష్యా డిమాండ్‌ను అంగీకరించం. అలా ఎలా ఒప్పుకుంటాం? మా ప్రజల్ని చంపేశారు. ఇది పూర్తిగా అసాధ్యం. ఖర్కివ్, మేరియుపొల్, కీవ్ నగరాల్లో ప్రజలు లొంగిపోవాలని వారు డిమాండ్ చేస్తారని అనుకుందాం. కానీ, అక్కడి ప్రజలు అందుకు ఒప్పుకోరు. వారు నగరాలను స్వాధీనం చేసుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. అక్కడి ప్రజలందరినీ చంపి, వాటిని ఆక్రమించుకోవాలి’ అని స్పష్టం చేశారు. నాజీల అడుగుజాడల్లో నడుస్తోన్న ఆ దేశం.. తమను నాజీలంటూ ఆరోపిస్తోందన్నారు. అలాగే ఎక్కడైతే రాజీకి ముందుకు వస్తామో.. అక్కడే యుద్ధం ముగుస్తుందని గుర్తుచేశారు.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలై ఇప్పటికి మాడు వారాలు దాటినా రష్యా పైచేయి సాధించలేకపోయింది. నగరాలపై దీర్ఘశ్రేణి, హైపర్‌సొనిక్ క్షిపణులతో రష్యా దాడులు చేస్తుండగా, ఆ దేశ సరఫరా వ్యవస్థల్ని ధ్వంసం చేసేలా జెలెన్‌స్కీ సేనలు మెరుపుదాడులకు దిగుతున్నాయి. రెండు దేశాల మధ్య వీడియో మాధ్యమంలో చర్చలు కొనసాగినా ప్రతిష్టంభన తొలగిపోలేదు. నేరుగా పుతిన్‌తో భేటీ అయ్యేందుకు జెలెన్‌స్కీ ఆసక్తి చూపిస్తుండగా.. ముందుగా చర్చల్లో మరింత పురోగతి సాధించాల్సి ఉందని రష్యా ప్రతినిధులు అంటున్నారు.
7.ఎరువుల ధరలు పెంపుతో రైతులు అప్పులపాలు
` టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
` కౌలురైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలి
` కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
న్యూఢల్లీి,మార్చి 22(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో 105 సీట్లు సాధిస్తామని చెబుతున్నా కేసీఆర్... పీకేను ఎందుకు తెచ్చుకున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఢల్లీిలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో కలిసి విూడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పీకేని పిలిపించుకున్నారని ఆరోపించారు. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమంటూ రాష్టాన్న్రి అప్పులపాలు చేశారన్నారు. రూ.20 వేల కోట్లు ఖర్చుపెడితే రాష్ట్రం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయవచ్చని, కానీ ఈ విషయంలో కేసీఆర్ డ్రామా ఆడుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు జాప్యం వల్ల ఎంతో మంది రైతులు చనిపోయారన్నారు. ఎరువులకు ధరలు పెంచి రైతులను అప్పులపాలు చేశారని, మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు అమలు చేయాలన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కోల్ మైన్ టెండర్లలో అవినీతి జరుగుతోందన్నారు. ఆయన బంధువు ప్రతిమా శ్రీనివాస రావుకు నైనీ కోల్ మైన్ ను కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారన్నారు. కోల్ మైన్ టెండర్ వ్యవహారం కాళేశ్వరం, మిషన్ భగీరథ మించిన మెగా స్కాం అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ ను వెంటనే తప్పించి, పారదర్శకంగా టెండర్లు ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాలని వారం కిందట పీఎం మోడీని కలిసి వివరించినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. మూసీ నది కలుషితమై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. నమామి గంగా పేరుతో గంగా నది ప్రక్షాళనకు కేంద్రం రూ.30 వేల కోట్లు కేటాయించిందని, మూసీ నదికి కనీసం రూ.3 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్, విజవాడ హైవేను 6లేన్లు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి లేఖ ఇచ్చినట్లు తెలిపారు. హైవే ఎక్స్‌టెన్షన్‌కు జీఎంఆర్ ముందుకు రాకుంటే కొత్త కంపెనీకి ఆ బాధ్యతలు అప్పచెప్పాలని మంత్రికి చెప్పానన్నారు. అలాగే తెలంగాణ చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రతి పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటాయని, అవి త్వరలోనే సమసిపోతాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విషయంలో స్పందించారు. చివరి రక్తపు బొట్టు వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ దోపిడికి బీజేపీ సహకరిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. లక్షల కోట్లు దోచుకుంటున్న సీఎం కుటుంబాన్ని జైలుకు పంపుతామని బీజేపీ నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అవినీతిపై విచారించే దమ్ము బిజెపికి లేదన్నారు. ఇద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం ఉందన్నారు. ధాన్యం కొనుగోలు, సింగరేణి కోల్ మైన్స్ విషయంలో రాష్టాన్రికి అన్యాయం జరుగుతోం దన్న రేవంత్.. ఈ విషయాల్లో టీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి డ్రామాలాడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇంత భారీ మొత్తంలో అవినీతి జరుగుతుంటే కేంద్రం ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరి స్తోందని.. సీఎం అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కేంద్రంపై నమ్మకం లేనందునే కోర్టు తలుపులు తట్టామని.. టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి టెండర్ల విషయంలో 50వేల కోట్లకుపైగా అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓ సంస్థకు లాభం చేకూర్చేందుకు టెండర్ నింబంధనల్లో మార్పులు చేశారని, దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు జాతీయ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సింగరేణి సీఎండీగా కొనసాగే అర్హత శ్రీధర్‌కు లేదన్న రేవంత్.. పదవీకాలం పూర్తయిన ఐఏఎస్ ను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. సింగరేణిలో జరుగుతున్న ఉల్లంఘనల విషయంలో ప్రధాని జోక్యం చేసుకుని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ను రేవంత్ కలిశారు. మాణిక్కం ఠాగూర్‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంతో పోరాటం అని కేసిఆర్, మంత్రులతో సహా మాట్లాడుతున్నారని, కేసిఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, జైలుకు పోవడం ఖాయమని బీజేపి నేతలు మాట్లాడుతున్నారన్నారు. సింగరేణి బొగ్గు గనుల్లోని వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గును కావాల్సిన వారికి కేసిఆర్ ప్రభుత్వం కట్టబెడుతోందని ప్రధాని మోడికే నేరుగా ఫిర్యాదు చేసినా ఏవిూ జరగలేదని ఆయన విమర్శించారు. దొంగ సొమ్మును పంచుకోవడానికి ఇద్దరూ కుమ్మక్కయ్యారని, బీజేపీ, టీఆర్‌ఎస్ తోడుదొంగలని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ దోపిడీని బీజేపీ చూసిచూడనట్లు వ్యవహరించడంవల్ల, బీజేపీకి ఇతర రాష్టాల్ర ఎన్నికల్లో నిధులను కేసీఆర్ సమకూర్చుతున్నారన్నారు.
8.చైనా విమాన ప్రమాదంలో అందరూ మృతి?
` లభించని ఏ ఒక్కరి ఆచూకీ..
` బ్లాక్ బాక్స్ కోసం వెతుకులాట
బీజింగ్,మార్చి 22(జనంసాక్షి): చైనాలో సోమవారం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి పలు విషయాలు బయటపడుతున్నాయి.ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో సిబ్బంది సహా 132 మంది ఉన్నప్పటికీ... ఇప్పటివరకు ఒక్కరి ఆచూకీ కూడా తెలియలేదని అధికారులు వెల్లడిరచారు. అనేక గంటలుగా గాలింపు చేపడుతున్నా.. ఎలాంటి ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదని తెలిపారు. అయినప్పటికీ సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే 132మంది పరిస్థితిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే, వీరంతా మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలిపే బ్లాక్?బాక్స్ ఆచూకీపై కూడా ఎలాంటి సమాచారం లేదు. ఈ ఘటనపై దర్యాప్తులో చైనా ఈస్టర్న్? ఎయిర్?లైన్స్?కు పూర్తి సహకారం అందిస్తున్నట్లు విమాన తయారీ సంస్థ బోయింగ్ తెలిపింది.ఈ ప్రమాదంతో చైనా ఎయిర్‌లైన్స్ ఘనమైన రికార్డుకు కూడా బ్రేక్ పడిరది. వరుసగా 100 మిలియన్? గంటలకు పైగా ఆ దేశంలో ఎలాంటి విమాన ప్రమాద ఘటన జరగలేదు. 2010లో చివరి సారి హిలాంగ్?జియాంగ్ రాష్ట్రంలో జరిగిన విమాన ప్రమాద ఘటనలో 42 మంది చనిపోయారు. తాజా ప్రమాదం నేపథ్యంలో చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ (సీఈఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద ఉన్న అన్ని బోయింగ్ 737 విమానాల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.132 మందితో వెళ్తున్న విమానం గువాంగ్‌షీ రాష్ట్రం, ఉరaౌ నగర సవిూపంలోని పర్వత ప్రాంతంలో సోమవారం కూలిపోయింది. చైనా ఈస్టర్? ఎయిర్?లైన్స్?కు చెందిన బోయింగ్? 737 విమానం.. కున్?మింగ్? నుంచి గ్వాంగౌÊరaకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలినప్పుడు పర్వత ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగినప్పుడు భారీ శబ్దం వినిపించిందని, ఆ తర్వాత క్షణాల్లోనే పేలుడు సంభవించిందని ప్రత్యక్షసాక్షి చెప్పారు. విమానంలో మొత్తం 132 మంది ఉండగా.. అందులో 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు.
9.కాలుష్య కాసారంలో.. మళ్లీ ఢల్లీినే
` వరుసగా నాలుగోఏడాది ప్రపంచంలో అత్యంత కాలుష్య రాజధానిగా గుర్తింపు
దిల్లీ,మార్చి 22(జనంసాక్షి): దేశంలో కాలుష్య పరిస్థితులు ఏ మాత్రం మెరుగుపడట్లేదు సరికదా.. నానాటికీ మరింత దిగజారుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతంలో కాలుష్య స్థాయిలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానిగా దిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఇక గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్న తొలి 50 నగరాల్లో 35 భారత్‌లోనే ఉండటం గమనార్హం. ఈ మేరకు స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ విడుదల చేసిన ‘‘ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2021’ వెల్లడిరచింది. 2021లో భారత్‌లోని ఏ నగరమూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను చేరుకోలేకపోయిందని నివేదిక తెలిపింది. 48 శాతం నగరాల్లో అయితే డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలు కంటే 10రెట్లు కాలుష్యం ఉన్నట్లు పేర్కొంది. దిల్లీలో గతేడాదితో పోలిస్తే కాలుష్య స్థాయిలు 15 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే తొలి వంద కాలుష్య నగరాల్లో 63 భారత్‌లోనే ఉండటం గమనార్హం. అత్యంత కాలుష్య రాజధానుల జాబితాలో దిల్లీ తొలి స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా రెండో స్థానంలో ఉంది. ఇక, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో రాజస్థాన్ భీవాడి ప్రథమ స్థానంలో ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్ రెండు, దిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో తొలి 15 నగరాల్లో 10 భారత్‌లోనివే కావడం గమనార్హం. చైనాలోని హోటన్ నగరం ఈ జాబితాలో మూడో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్‌కు చెందిన ఫైసలాబాద్, బహవల్‌పూర్, పెషావర్, లాహోర్ కాలుష్య నగరాల జాబితాలో ఉన్నట్లు నివేదిక వెల్లడిరచింది.
10.రేవంత్‌రెడ్డితోనే నా పంచాయితీ.
` కాంగ్రెస్‌తో కాదు:జగ్గారెడ్డి
హైదరాబాద్,మార్చి 22(జనంసాక్షి): కాంగ్రెస్‌లోని కొందరు సోషల్ విూడియాలో తన పరువు తీస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేస్తానని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశాలు, రేవంత్‌తో విభేదాలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి విూడియా సమావేశం నిర్వహించారు.’’నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడటం నా స్వభావం. ఇది కాంగ్రెస్ పంచాయితీ కాదు.. రేవంత్‌రెడ్డితోనే నా పంచాయితీ. మా ఇద్దరి గుణగణాల పంచాయితీ. రేవంత్‌రెడ్డి మెదక్ పర్యటనకు వెళ్తే నన్ను ఆహ్వానించలేదు. ఆ పర్యటనకు నన్ను పిలవకపోవడంతో నాకు కోపం వచ్చింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా? పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలుపుకొనిపోయే పద్ధతి లేదా?ఏ ఆలోచన లేని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుంది. సోనియాగాంధీ కుటుంబం వల్లే పార్టీ గొప్ప స్థాయికి చేరింది. కాంగ్రెస్‌పై అభిమానంతో ఎప్పటినుంచో ఈ పార్టీలో కొనసాగుతున్నా. నాకు, సీఎం కేసీఆర్‌కు రాజకీయంగా ఎలాంటి వివాదాలు లేవు’’ అని జగ్గారెడ్డి అన్నారు.
11.అసంతృప్త నేతలతో సోనియా భేటీ
ఆనంద్ వర్మ,మనీష్ తివారీల హాజరు
న్యూఢల్లీి,మార్చి 22(జనంసాక్షి):అసంతృప్త నేతలతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ మాత్రమే హాజరయ్యారు. మరో సారి కూడా ఈ సమావేశాన్ని సోనియా నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరికొన్ని రోజుల్లో జీ 23 గ్రూపుకు చెందిన నేతలందరితో సమావేశం కావాలని సోనియా నిర్ణయించుకున్నారు. పార్టీ పటిష్ఠత, పార్టీ నిర్మాణంతో పాటు పార్టీతో వీరికి ఏర్పడ్డ గ్యాప్‌ను కూడా పూరించడంపై సోనియా వీరితో చర్చించారు. జీ 23 గ్రూపుకు చెందిన నేతలతో సోనియా గాంధీ సమావేశం కావడం ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితమే జీ 23 గ్రూపులో కీలక వ్యక్తి అయిన గులాంనబీ ఆజాద్‌తో సోనియా భేటీ అయ్యారు. పార్టీ పటిష్ఠతపై ఇరువురూ చర్చించారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని తామెన్నడూ ప్రశ్నించలేదని, కాంగ్రెస్‌కు ఒకరే అధ్యక్షులు ఉంటారని ఆజాద్ పేర్కొన్నారు.