1.ఎట్టిపరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లం
దేశంలో పరివర్తన రాజకీయాలు అవసరం
ప్రజల సమస్యల పరిష్కారంలో బిజెపి విఫలం
ప్రశాంత్ కిషోర్ పైసా తీసుకోకుండా సాయం చేస్తున్నారు
ప్రత్యామ్నాయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తా
తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం
ధాన్యం సేకరణపై జాతీయ విధానం రావాలి
పంజాబ్ తరహాలో ధన్యాంసేకరించాల్సందే
తెలంగాణతో పెట్టుకుంటే అంతే సంగతులు
తెలంగాణపై ప్రధాని మోడీ నిర్లక్ష్య వైఖరి
విభజన హావిూల అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యం
దేశ సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాశ్మీర్ ఫైల్స్
దేశాన్ని విభజించి పాలించే దుర్మార్గపు ఆలోచన
అవాంఛనీయ, అనారోగ్య ప్రచారం సరికాదు
తెలంగాణ భవన్‌లో విూడియా సమావేశంలో మండిపడ్డ సీఎం కేసీఆర్
నేడు కేంద్రమంత్రిని కలువనున్న మంత్రుల బృందం
హైదరాబాద్,మార్చి 21(జనంసాక్షి):రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సిఎం కెసిఆర్ మరోమారు స్పష్టం చేశారు. గతంలో తాము చేపట్టిన పనులు పూర్తి చేయాలంటే మళ్లీ అధికారంలోకి రావాలన్న సంకల్పంతో ఎన్నికలకు వెళ్లామని అంటూ..ముందస్తు ఊహాగానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతను ఇచ్చారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్తే పరిస్థితి లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ విూడియాతో మాట్లాడారు.గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండిరదని, మేం ప్రారంభించిన ప్రాజెక్టులు, పనులు మేం చేయాల్సి ఉండే. కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆ అవసరం లేదు. పాలమూరు, సీతారామ పూర్తి కావాలి. తెలంగాణకు ఐటీ, పరిశ్రమల పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. బజార్లో అరిచే వ్యక్తుల గురించి మాట్లాడను. కేసీఆర్ ఎప్పుడు మోసం చేయడు.. ఏం చెప్పినామో అదే చేస్తాం. చెప్పిందే చేస్తామని అన్నారు. తొలిసారి 63 సీట్లు, రెండోసారి 88 సీట్లు, ఇప్పుడు 95`105 సీట్ల మధ్య గెలుస్తాం. 25 రోజుల తర్వాత ఒక రిపోర్ట్ ఇస్తాను.. దాని చూస్తే విూరే ఆశ్చర్య పడుతారు. నిన్ననే ఒక లేటెస్ట్ రిపోర్టు వచ్చింది. 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 స్థానాల్లో మేం గెలుస్తామని రిపోర్టులో వచ్చిందని కేసీఆర్ తెలిపారు. ఇకపోతే జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ నిర్మాణాత్మకపాత్ర పోషిస్తారని అన్నారు. మోడీ ఎనిమిదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలం అయ్యారని అన్నారు. 8 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క పనిని మోడీ చేయలేకపోయారని అన్నారు. అందుకే ప్రజలు క్షేత్రంగా పరివర్తన రాజకీయాలు రావాల్సి ఉందన్నారు. అందుకు ప్రశాంత్ కిషోర్ సాయంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. దేశ రాజకీయాలతో పాటు అన్ని అంశాలపై అవగాహన ఉన్న ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పని చేస్తే తప్పేంటని ముఖ్యమంత్రి కేసీఆర్ విూడియాను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ టీఆర్‌ఎస్ ఎన్నికల కోసం పని చేస్తున్నాడా అని ఓ విూడియా ప్రతినిధి కేసీఆర్‌ను ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు. కిశోర్ తమతో కలిసి పని చేస్తుండు.. అది తప్పా.. ఆయన ఏమైనా రహస్యమా. ప్రశాంత్ కిశోర్ తనతో కలిసి పని చేస్తడు. దేశం గురించి ఆలోచన చేసినప్పుడు తెలంగాణ అంతర్భాగమే కదా గత 8 ఏండ్ల నుంచి కిశోర్ తనకు మంచి స్నేహితుడు. ఆయన పైసల కోసం పని చేయడు. దేశం కోసం ఆయన చిత్తశుద్ధితో పని చేస్తున్నాడు. ఆయన పైసల కోసం పని చేస్తున్నట్లు విూ దగ్గర రిపోర్టు ఉందా? బీజేపీకి, జగన్‌కు, మమతకు పని చేసిండు. 12 రాష్టాల్రతో పాటు దేశానికి పని చేసిండు.. దేశ రాజకీయాల విూద అవగాహన ఉంది కాబట్టి.. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి కిశోర్‌ను నేనే పిలిచాను. బ్రహ్మాండంగా పని చేస్తున్నాం. 100 శాతం ఆయన చిత్తశుద్దితో పని చేస్తున్నారు. ఆయన ఎన్నో దేశాల్లో పని చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. ఏ రంగంలో చూసినా ఈ దేశం తిరోగమనంలోనే ఉందని, దీనికి బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపాల్సిందే.. ప్రగతిశీల విధానంలో పని చేసే ప్రభుత్వం రావాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ `రష్యా యుద్ధం కారణంగా 20 వేల మంది పిల్లలను స్వదేశానికి తీసుకురావడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. తద్వారా విద్యార్థులు అనేక బాధలు అనుభవించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మానసిక వ్యధ అనుభవించారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన మెడికల్ విద్యార్థులను తామే చదివిస్తామని ప్రకటించాం. ఆ తర్వాత బెంగాల్ కూడా ప్రకటించింది. కేంద్రం నుంచి మాత్రం ఉలుకు లేదు.. పలుకు లేదు. దేశంలో అభివృద్ధి లేదు. జీడీపీ పెంచేదిలేదు. ఆర్థిక వృద్ధిని పెంచలేదు. భయంకరమైన ఇండెక్స్ ఉన్నాయి. యూత్ నిరుద్యోగ ఇండెక్స్‌లో లాస్ట్ ర్యాంకులో ఉన్నాం. 20.84 ర్యాంకులో ఉన్నాం. సిరియా కంటే అధ్వాన్నంగా ఉన్నాం. అభివృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో తిరోగమనంలో ఉందని కేసీఆర్ తెలిపారు. బిజెపి పార్టీ తీసుకొచ్చే దుర్మార్గ విధానాలను తిప్పికొట్టాలి. ప్రజలను చైతన్యవంతం చేయాలి. కేంద్ర వ్యతిరేక ఉద్యమాలను కూడా నిర్వహిస్తాం. కేంద్రం చెప్పిన ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇవ్వలేదు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని ధర్నా చేస్తాం. ధాన్యం వద్దే ఆగిపోము. రిజర్వేషన్ల వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీస్తాం. రిజర్వేషన్ల విషయంలో 50 శాతం కంటే ఎక్కువ ఉండొద్దని రాజ్యాంగంలో లేదు. ప్రత్యేక పరిస్థితులు సంభవిస్తే 50 శాతం అధిగమించొచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీనిపై శాసనసభ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది. ఈ తీర్మానంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎస్సీ వర్గీకరణపై కూడా తీర్మానం చేసి పంపించాం. దాని విూద కూడా అతిగతి లేదు. బీసీల కులగణను పట్టించుకోవడం లేదు. విద్వేషాలు సృష్టించి, ఉద్వేగాలకు లోను చేసి వాటిని రాజకీయంగా ఉపయోగించుకునే దుర్మార్గం నెలకొని ఉంది. దీని వల్ల దేశ అభివృద్ధి కుంటు పడుతుంది. దేశంలో అనేక భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రగతిశీల విధానంలో పని చేసే ప్రభుత్వం రావాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తనపై ఈడీ దాడులకు దిగినా భయపడనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటివి అన్నిచోట్ల పనిచేయవు. బోడి బెదిరింపులకు భయపడమని అన్నారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే తాన ప్రయత్నాలని అన్నారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చాలా శూన్యత ఉంది. అందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. దేశంలో కొత్త జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీజేపీకి ఉద్యోగాలివ్వడం తేలీదు. ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చేయడం లేదు. యూపీయే ప్రభుత్వం బాగాలేదని బీజేపీకి అధికారం ఇస్తే అంతకంటే దారుణంగా పరిస్థితులు తయారయ్యాయి. నిరుద్యోగుల రేటు బాగా పెరిగింది. జీడీపీ తగ్గింది. రెండు మూడు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా సామర్ధ్యం ఇదే అని కేంద్రం చెప్పుకుంది. ఒక్క ఫ్యాక్టరీ పెట్లలేదు. వున్నవి అమ్మేస్తున్నారు. అయితే డీమానిటైజేషన్.. లేదంటే మానిటైజేషన్ చేసుకోవా లంటున్నారు. పంచాయితీ రాజ్ ఆస్తులు మోనిటైజ్ చేసుకోమంటున్నారు. రాజకీయంగా చాలా దారుణమ యిన పరిస్థితులున్నాయి.యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ బలం తగ్గుతోంది. ఇది స్పష్టమయిన పరిస్థితి. దేశం ఒక నిర్ణయానికి వచ్చింది. 8 ఏళ్ళు గడిచింది. బీజేపీ ప్రభుత్వం వచ్చి. ఏదైనా మంచి చేయాలి. మంచి ఆవిష్కరణలు జరగాలి. ఇది ఎంతో ఎక్కువ టైం. ఒక ప్రాజెక్ట్ కట్టలేదు. దేశం బాగుపడాలంటే.. ఈ ప్రభుత్వం పోవాలని నిర్ణయానికి వచ్చామన్నారు. ఈ నెల 28,29 న జరిగే ట్రేడ్ యూనియన్ల ఆందోళనకు టీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం తీరుపై టీఆర్‌ఎస్ ఎల్పీలో సుదీర్ఘ చర్చ జరిగింది.
తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం
ఆహార ధాన్యాల సేకరణలో దేశమంతా ఒకే విధానం ఉండాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణలో జాతీయవిధానంతో ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ విూడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సుదీర్ఘమైన చర్చ తర్వాత రాష్ట్రంలో పండిన పండబోయే యాసంగి వరి ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్రంలో కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించామని అన్నారు. వన్ నేషన్ వన్ రేషన్ మాదిరిగానే వన్ నేషన్ వన్ ప్రొక్యూర్‌మెంట్ ఉండాలని కేంద్రాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో దేశమంతా ఒకే పాలసీ ఉండాలి. పంజాబ్‌కు ఒక నీతి, గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి ఉండదు. ఇది రైతుల జీవన్మరణ సమస్య.. ఆ పంట సేకరించే విషయంలో ఇబ్బంది పెట్టొద్దు. కొన్ని రాష్టాల్రు ఉద్యమించాయి కాబట్టి.. 100 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశాయని కేసీఆర్ గుర్తు చేశారు.మంగళవారం మంత్రుల బృందం, ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లి, ఆహార మంత్రిని తెలంగాణ రైతుల పక్షాన కలుస్తారు. కేంద్రం సూచన మేరకు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచన మేరకు రైతులు పంటల మార్పిడి చేశారు. గతంలో 55 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంటే,ఈ సారి 35 లక్షల ఎకరాల్లో ఉందన్నారు. దీంట్లో 3 లక్షల ఎకరాల్లో సీడ్ కోసం వరిని ఉత్పత్తి చేశారు. మరొక రెండున్నర లక్షల ఎకరాల్లో తినడానికి వాడుకుంటారు. 30 లక్షల ఎకరాల్లో పండిరచిన వరి అమ్మాల్సి ఉంటుంది. పంట మార్పిడి కింద వరి ఉత్పత్తిని తగ్గించగలిగామని కేసీఆర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార రంగంలో అన్ని దేశాలు కూడా స్వాలంబన ఉండాలని కోరుకుంటాయి. భారతదేశంలో కూడా ఫుడ్ సెక్టార్ ముఖ్యమైంది కాబట్టి.. ప్రపంచ జనాభాలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో దేశంలో ఆహార కొరత రాకుండా ఉండేందుకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చారు. ఈ క్రమంలో కేంద్రం ధాన్యం సేకరించి, నిల్వ చేయాల్సి ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో ఒక వేళ ఎక్కువ పంట మొత్తంలో వస్తే.. కేంద్రమే భరించి సేకరించాలి. ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదన్నారు. కేంద్రం సాయం లేకపోయినా, కొత్త రాష్ట్రమైనప్పటికీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి, భూగర్భ జలాలు పెంచుకుని మంచి ఉత్పత్తులు సాధిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుల ముఖాల్లో వెలుగులు వచ్చాయి. ఆత్మహత్యలు తగ్గాయి. ప్రశాంత వాతావరణం ఉంది. ఈ క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాసంగి కాలంలో వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కనీస మద్దతు ధర నిర్ణయించేంది బియ్యానికి కాదు.. వరి ధాన్యానికి. ఎంఎస్పీ ప్రకారమే పంజాబ్‌లో సేకరిస్తున్నారు. అదే పద్ధతిలో మా వడ్లను కూడా కొనాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ధాన్యం సేకరణ విషయంపై కేంద్రంతో చర్చించేందుకు రేపు మంత్రుల బృందం, ఎంపీల బృందం ఢల్లీికి వెళ్లి కేంద్ర ఆహారశాఖ మంత్రిని కలిసి, మెమోరాండం అందజేస్తారన్నారు. వాళ్లు సమ్మతిస్తే సంతోషం.. సమ్మతించని పక్షంలో ఎంతని పోరాటానికైనా సిద్ధం కావాలని సమావేశం నిర్ణయించిందని పేర్కొన్నారు. ’ఈ పోరాటం ఆషామాషీగా ఉండదు. మాటలు, పేపర్ స్టేట్‌మెంట్లుగా ఉండదు.. యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటది. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా టీఆర్‌ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య.తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండెనో.. అంత ఉధృతంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రం అల్టిమెట్‌గా తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్న ఉత్పన్నం కాదు. అదే పద్ధతిలో తెలంగాణలోని యావత్ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జడ్పీలు, మున్సిపల్, ఇతర సంస్థలు, మార్కెట్ కమిటీల్లో తీర్మానం చేసి ప్రధానికి పంపిస్తాం. అప్పటికే తీసుకుంటారని భావిస్తున్నాం. అలా కానీ పక్షంలో వందకు వందశాతం ఉద్యమిస్తాం. ఎంత వరకైనా పోరాడుతాం. గతంలో పంజాబ్ రైతులను ఏడిపించిన అనేక కేంద్ర ప్రభుత్వాలు.. చాలా పోరాటాల తర్వాత వందశాతం ప్రొక్యూర్‌మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ సమాంతరంగా పంజాబ్ మాదిరిగా వందశాతం ప్రొక్యూర్‌మెంట్ ఆర్డర్ వచ్చే వరకు పోరాటం చేస్తాం. దాన్ని వదిలే ప్రశ్నే లేదు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. విూడియా సమావేశంలో మంత్రులు, పార్టీ నేతలు పాల్గగొన్నారు.తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని, రైతులను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాడాలని టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి కూడా కేంద్రం రెండు పంటలు కొనేలా పంజాబ్ తరహాలో ఉద్యమిద్దామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తుందని నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక విషయాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు రాజ్యాంగ రక్షణ అవసరం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రంగా ఆందోళన చేపడుతామని స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ మండిపడ్డారు. విభజన చట్టం హావిూలను అమలు చేయడంలో మోదీ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. రైతు వేసే ప్రతి గింజకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం ఏ వర్గాన్ని సంతృప్తి పరచటం లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. 24, 25 తేదీల్లో రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలన్నారు. 28వ తేదీన యాదాద్రికి పార్టీ శ్రేణులంతా తరలిరావాలని సూచించారు. ఉద్యోగాల భర్తీ పక్రియకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సబ్ కమిటీ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి కావాల్సింది కహ్మీర్ ఫైల్స్ కాదు.. డెవలప్‌మెంట్ ఫైల్స్ కావాలన్నారు. దేశంలో సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ సినిమాను విడుదల చేశారని మండిపడ్డారు. కేంద్రం కశ్మీర్పైల్ సినిమాను వదిలిపెట్టి, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు. కశ్మీర్‌లో హిందూ పండిట్‌లను చంపినప్పుడు బీజేపీ అధికారంలో లేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. రైతుల సమస్యలను పక్కదోవ పట్టించడానికే కశ్మీర్ ఫైల్ సినిమాను ముందుకు తెచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రం అసలు విషయాలను పక్కనపెట్టి ఈ సినిమాను ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే దుర్మార్గం జరుగుతోందని కేసీఆర్ మండిపడ్డారు.సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజరయ్యారు.
తెలంగాణతో పెట్టుకుంటే అంతే సంగతులు
తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఒక వేళ తెలంగాణతో పెట్టుకుంటే విూరే భంగపడుతారని మోదీని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి చేతులెత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణను కదిలించకండి.. తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు. మేం ఉద్యమ వీరులం. ఉద్యమం చేస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. విూరే భంగపడుతారు. పంజాబ్‌కు అవలంబిచిన విధానాన్నే మాకు అవలంభించండి. మేం కోరేది గొంతెమ్మ కోర్కె కాదు. పండిరచిన ధాన్యాన్ని ఎంఎస్పీ ధరకు సేకరించిండి. విూరే మిల్లింగ్ చేసుకోండి.. పూర్తి స్థాయిలో సహకరిస్తాం. పంజాబ్‌లో కొన్నట్టే మా ధాన్యం కొని డబ్బులు ఇచ్చేయ్. దేశ ఆహార భద్రత విషయంలో రాజ్యాంగ బద్ధమైన విధిని కేంద్రం నెరవేర్చాలి. దీన్ని నుంచి కేంద్రం తప్పించుకోవద్దని కేసీఆర్ సూచించారు.రోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆ విధంగానే రేపు పొద్దున కరువు కాటకం వస్తే అన్నం పెట్టే స్థితిలో ఉండాలి. ఏ దేశానికి కూడా ఇండియాకు వారం రోజులు అన్నం పెట్టే స్థితి లేదు. ఈ క్రమంలో ధాన్యం సేకరించి నిల్వ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు పండిరచిన ధాన్యాన్ని సేకరించాలి. మేం అడిగేది భారత రైతుల కోసమే.. పాకిస్తాన్, అమెరికా రైతుల కోసం కాదని కేసీఆర్ చెప్పారు. దేశాన్ని పంటల కాలనీలుగా విభజించండి. ఇది ప్రజాస్వామ్యం.. పోరాడే, అడిగే హక్కులుంటాయి. పంజాబ్, హర్యానా మాదిరిగానే వంద శాతం కొనుగోలు చేయాలి. దేశమంతా ఒకే పాలసీ ఉండాలని కోరుతున్నాం. అట్ల చేయని పక్షంలో అనేక పోరాట రూపాల్లో ఉద్యమం చేస్తాం. అవసరమైతే కేబినెట్ అంతా వెళ్లి తీవ్రమైన నిరసన కార్యక్రమాలు చేపడుతాం. కిసాన్ నాయకులు కూడా తమకు మద్దతు తెలుపుతామన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు రాజ్యాంగ రక్షణ లేదు. రైతులకు రాజ్యాంగ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
కాశ్మీర్ ఫైల్స్‌తో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రమోషన్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై యువత ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ విూడియాతో మాట్లాడారు. దేశానికి కావాల్సింది కాశ్మీర్ ఫైల్స్ కాదన్నారు. సోషల్ విూడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. అవాంఛనీయమైన, అనారోగ్యకరమైన ప్రచారం ఏ రకంగా కూడా ఆహ్వానించ తగనటువంటి.. కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాను తీసుకొచ్చారు. ఏదైనా ప్రొగెషివ్ గవర్నమెంట్ ఉంటే ఇరిగేషన్, ఇండస్టియ్రల్, ఎకనామిక్ ఫైల్స్ తీసుకురావాలి. కశ్మీర్ ఫైల్స్ తో వచ్చేది లేదు. పోయేది లేదు. దీనిపై కశ్మీర్ పండిట్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ వీడియోలు తన దగ్గర ఉన్నాయి. ఈ రకమైన టువంటి దేశ విభజన, ప్రజల విభజన సరికాదు. తెలంగాణ సమాజానికి అసలు జీర్ణం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం దశాబ్దాల తరబడి ఉధృతంగా చేశాం. సకల జనుల సమ్మె అనే పిలుపునిచ్చాం. కానీ హిందువుల సమ్మె, కైస్త్రవుల సమ్మె, ముస్లింల సమ్మె అని పిలుపు ఇవ్వలేదని కేసీఆర్ గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్టాల్ల్రో సెలవులు ఇచ్చి సినిమాను చూడమంటున్నారు. ఈ దేశం ఎటు వైపు పోతోంది. ఇదేం విభజన రాజకీయం. ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఒక మంచి వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. దేశం నుంచి 5 లక్షల కోట్ల సాప్ట్ వేర్ ఎగుమతులు ఉన్నాయి. ఈ విభజన రాజకీయాల వల్ల అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. ప్రభుత్వ అసమర్థత బయటపడిరది. కరోనాను అరికట్టడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. కోట్ల మందిని వేల కిలోవిూటర్ల నడిపించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుంది. కనీసం రైళ్లను కూడా కల్పించలేదు. అద్భుతమైన గంగా నదిలో వందల, వేల శవాలు తేలేటట్టు చేసింది ఈ ప్రభుత్వం. ఈ సత్యాలను దాచలేరని కేసీఆర్ పేర్కొన్నారు.
2.అమెరికాలో తొలిరోజు కేటీఆర్ పర్యటన సక్సెస్..
` రూ.150 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ‘కెమ్ వేద లైఫ్ సైన్సెస్’
వాషింగ్గన్,మార్చి 21(జనంసాక్షి):అమెరికాలో తొలిరోజు మంత్రి కేటీఆర్ పర్యటన సక్సెస్..150 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కెమ్ వేద లైఫ్ సైన్సెస్‌తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కే తారకరామారావు పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ కెమ్ వేద ముందుకు వచ్చింది. శాండియాగో లోని సంస్థ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేసింది.లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రముఖ పరిశోధన సంస్థగా కెమ్ వేద కంపెనీకి పేరుంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్, పరిశ్రమలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా విస్తరించేందుకు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టు సంస్థ తెలిపింది. కేవలం 45 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ ఈ రోజు 450 మందికి చేరిందని, దీనిని మరింతగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌కు తెలిపింది. 8 ఎకరాల్లో రెండు చోట్ల తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, తమ కంపెనీని ఇంత భారీగా విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాలసీలు, అక్కడ ఉన్న నాణ్యమైన మానవ వనరులు ప్రధాన కారణాలని తెలిపింది.హైదరాబాద్ నగరం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్‌లకు ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్న కెమ్ వేద లైఫ్ సైన్సెస్ కంపెనీ కి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఫార్మా లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టంలో ఉన్న మానవ వనరులు, అవకాశాలను ఉపయోగించుకొని ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని హావిూ ఇచ్చారు. హైదరాబాద్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఈకో సిస్టంను ఈ డెవలప్‌మెంట్ సెంటర్ మరింత బలోపేతం చేస్తుంది అని కేటీఆర్ అన్నారు.హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ వేగంగా విస్తరిస్తున్నదని, ఫార్మా, లైఫ్ సైన్సెస్ వృద్ధిలోభాగస్వామ్యం తమకు అత్యంత సంతోషాన్ని ఇస్తున్నదని కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ బీమారావు పారసెల్లి తెలిపారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ సుమారు రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యంత నైపుణ్యం కలిగిన 500 మంది నిపుణులకు పరిశోధన అవకాశాలు లభిస్తాయని వెల్లడిరచారు. భవిష్యత్తులో తమ కంపెనీని మరింత విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్, తదితరులు పాల్గొన్నారు.తన పర్యటనలో భాగంగా తొలి రోజు సమావేశాల కోసం అమెరికాలోని శాన్ డియాగో లో అడుగు పెట్టిన మంత్రి కే తారకరామారావుకు స్థానికంగా ఉన్న తెలుగు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. శాన్‌డియాగోలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాల గురించి వారిని మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ తమ నగరంలో పర్యటించడం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు.
3.కాంగ్రెస్ అసంతృప్తుల భేటీపై అధిష్టానం సీరియస్
` మంత్రి హరీశ్‌రావుతో వీహెచ్ భేటిపై ఆరా
` జగ్గారెడ్డిని అదనపు బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు
హైదరాబాద్,మార్చి 21(జనంసాక్షి):రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌లోని సీనియర్ అసంతృప్తి నేతలు సమావేశంపై కాంగగ్రెస్ హైకామండ్ మండిపడిరది. సమావేశం నిర్వహించకూడదని హైకమాండ్ ఆదేశించినా నేతలు సమావేశం కావడంపై మండిపడ్డారు. ఈ సమావేశాన్ని నిర్వహించవద్దని కొందరు నేతలు సీనియర్లను ప్రాధేయపడ్డారు. అందరం కలిసి పనిచేద్దామని కోరారు. ఇవన్నీ పట్టించుకోకుండా సమావేశమయ్యారు. దీంతో సీనియర్ల భేటీపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. చర్యలు తీసుకునేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. రెండ్రోజుల్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. సమావేశం నిర్వహించిన సీనియర్లకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వద్దని చెప్పినా విూడియా సమావేశం నిర్వహించడంపై ఏఐసీసీ ఆగ్రహంగా ఉంది. మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ భేటీపై కాంగ్రెస్ పెద్దలు ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్‌కు లాయల్టీగా చెప్పుకునే నేతలు.. రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించడంపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారాన్ని కూడా హైకమాండ్ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రెండ్రోజుల్లో ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజు తెలంగాణకు రానున్నారు. ఇరు వర్గాలను కూర్చోబెట్టి బోస్‌రాజు మాట్లాడుతారని చెబుతున్నారు. బోస్‌రాజు వచ్చే వరకు షోకాజ్ నోటీస్ ఇస్తారా.. లేదా అనేది సస్పెన్స్‌గా మిగిలింది. షోకాజ్ నోటీస్ ఇస్తే సమాధానం చెప్తామని సీనియర్లు అంటున్నారు. ఇదిలావుంటే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నేతలు కీలక ప్రకటనలతో హోరెత్తిస్తూ వుంటారు. ఈ క్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఉంది. అలా అని హద్దు విూరితే అధిష్టానం ఊరుకోదు. గీత దాటితే వేటు తప్పదన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధిష్టానంకి తెలుసు. వ్యక్తిగత సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలన్నారు. పీసీసీలో ఎన్నో కమిటీలు ఉన్నాయి. ఏఐసీసీ కూడా ఉంది. ఏదైనా సమస్య ఉంటే ఏఐసీసీకి చెప్పుకొనే అవకాశం ఉంది. ఏఐసీసీ నాయకులు అన్నీ పరిశీలిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈసమయంలో ఇలాంటి విూటింగ్ లు కరెక్ట్ కాదు. జగ్గారెడ్డి ప్రజాబలం ఉన్న నాయకుడు. విూ సవాళ్లు మనపై కాదు.. అధికార పార్టీపై విసరాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రి హరీష్ ని వీహెచ్ ఎందుకు కలిశారు అనేది ఏఐసీసీ పరిశీలిస్తోంది. ఏఐసీసీ నియమించిన పీసీసీనీ గౌరవించాలి. పార్టీకి నష్టపరిచే ఎటువంటి కార్యక్రమాలను ఏఐసీసీ సహించదు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ విధేయులు. సోనియాకు, రాహుల్ కి అందరం విధేయులం. ప్రత్యేకించి మేము విధేయులం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాహాటంగా మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. మన ఊరు మన పోరు సభలు విజయవంతం అవుతున్నాయి. కేసీఆర్ మరో కొత్తనాటకానికి తెరలేపారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
జగ్గారెడ్డిని అదనపు బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు
ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ షాకిచ్చింది. జగ్గారెడ్డికి అదనంగా ఉన్న పార్టీ బాధ్యతలను టీపీసీసీ తొలగించింది. పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి ఆయనను టీపీసీసీ తప్పించింది. స్వతంత్రంగా ఉంటానని గతంలో హైకమాండ్‌కు జగ్గారెడ్డి లేఖ రాశారు. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించనప్పటి నుంచి జగ్గారెడ్డి గుర్రుగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని ఆయన పనితీరును జగ్గారెడ్డి తప్పుబడుతున్నారు. ఆదివారం జగ్గారెడ్డి విూడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆయన పార్టీ లైన్‌లో పనిచేయడంలేదన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించే శక్తి రేవంత్‌కు ఉంటే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, సంగారెడ్డిలో పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని సవాల్ విసిరారు. అప్పుడు రేవంత్‌రెడ్డే హీరో అని తాను ఒప్పుకొంటానన్నారు. తాను గెలిస్తే తానే హీరోనన్నారు. ఒకవేళ ఇద్దరమూ ఓడిపోతే ఇద్దరమూ జీరోలమేనన్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నేతలు కొందరు ఆదివారం ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. అయితే వీహెచ్.. మంత్రి హరీశ్‌రావును కలిసినట్లు, ఆ తరువాతే ఈ భేటీ జరుగుతున్నట్లు వార్తలు రావడంతో హైడ్రామా చోటుచేసుకుంది. వీహెచ్ నుంచి ఆహ్వానం అందిన వారితో ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఏదైనా ఉంటే పార్టీ ఫోరంలో మాట్లాడుకోవాలే తప్ప ఇలాంటి సమావేశాలు పెట్టవద్దని సూచించారు. దీంతో పలువురు సీనియర్ నేతలు సమావేశానికి దూరంగా ఉన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని దిక్కరిస్తూ సమావేశం ఏర్పాటు చేసిన నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జగ్గారెడ్డిపై మాత్రమే చర్యలు తీసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
4.దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ
` రాష్ట్రపతి నుంచి అవార్డు స్వీకరణ
దిల్లీ,మార్చి 21(జనంసాక్షి):
రాష్ట్రానికి చెందిన దర్శనం మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నుంచి మొగిలయ్య పద్మశ్రీ స్వీకరించారు. పలు విభాగాల్లో ఈ సారి కేంద్ర ప్రభుత్వం 128 పద్మ అవార్డులను ప్రకటించగా.. రెండు విడుతల్లో అవార్డులను ప్రదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇవాళ దివంగత సీడీఎస్ బిపిన్ రావత్, రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం) పద్మవిభూషణ్, ఎనిమిది మందికి పద్మభూషణ్, 54 మందికి రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగిలయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. కళాకారుడుగా కిన్నెర పాటలతో ప్రతి ఒక్కరిని తన్మయత్వంలో ముంచెత్తుతున్న మొగిలయ్య. తరాల తెలుగు జీవన విధానం, చారిత్రక గాధలు ఒడిసిపట్టి, పాట రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాద్యం పేరునే ఇంటి పేరుగా మార్చుకుని కిన్నెర మొగిలయ్యగా స్థిరపడ్డారు. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సర్కారు సత్కరించింది. అంతే కాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని, మొగిలయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం 8వ తరగతిలో ఓ పాఠ్యాంశంగానూ చేర్చింది.
5.కీవ్‌లో కొనసాగుతున్న రష్యా దాడులు
` షాపింగ్‌మాల్‌పై మిస్సైల్ దాడిలో ఆరుగురు మృతి
కీవ్,మార్చి 21(జనంసాక్షి):ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న రెట్రోవిలీ షాపింగ్ మాల్‌పై రష్యా మిస్సైల్ దాడి చేసింది. ఆ దాడిలో ఆరుగురు మృతిచెందారు. అయితే ఆ దాడికి చెందిన వీడియోను రిలీజ్ చేశారు. ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ ఆ వీడియోను రిలీజ్ చేసింది. అగ్నిమాపక సిబ్బంది ఆ మాల్‌లో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేపట్టారు. మరో వైపు మారియపోల్ నగరం .. రష్యా ఇచ్చిన డెడ్‌లైన్‌ను తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయేది లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. ఆయుధాలను వదిలేస్తే, పౌరుల తరలింపునకు సహకరించనున్నట్లు రష్యా చెప్పింది. కానీ రష్యా ప్రభుత్వాన్ని నమ్మలేమని ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడిరచింది. మారియపోల్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడు తున్నట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. నగరంలోని 90 శాతం బిల్డింగ్‌లో ఇప్పటికే ధ్వంసం అయ్యాయి. ఆ నగరంలో ఇంకా మూడు లక్షల మంది తలదాచుకుంటున్నారు. వాళ్లకు విద్యుత్తు, నీరు, ఆహారం అందడం లేదు.
6.త్వరలోనే రాజకీయాలకు ఆజాద్ గుడ్‌బై.. ?
` ప్రజలను కులమతాలుగా విభజిస్తున్నారని ఆవేదన
` రాజకీయ పార్టీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ దిగ్గజనేత
` సమాజంలో మార్పునకు కీలక పాత్ర పోషించాలని ఉందని వెల్లడి
దిల్లీ,మార్చి 21(జనంసాక్షి):గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఎదిరిస్తోన్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్..కాంగ్రెస్‌తోపాటు ఇతర రాజకీయ పార్టీలన్నింటిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు మరోసారి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజల్లో విభజన తెచ్చేందుకు రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ఏ క్షణమైనా ప్రకటించవచ్చనే ముందస్తు సూచన చేశారు. అనంతరం పౌరసమాజంలో క్రియాశీల పాత్ర పోషించాలనే కుతూహలంతో ఉన్నట్లు వెల్లడిరచారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన కొన్ని రోజులకే కాంగ్రెస్ దిగ్గజనేత నుంచి ఇటువంటి అభిప్రాయం వ్యక్తం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.’సమాజంలో చాలా మార్పు తీసుకురావాలి. ఇందులో పౌరసమాజం పాత్ర ఎంతో కీలకం. కులం, మతం ఇతర అంశాల పేరుతో ప్రజల్లో విభజన తెచ్చేందుకు రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు మా సొంత పార్టీ కాంగ్రెస్ కూడా మినహాయింపేవిూ కాదు. దేశంలో రాజకీయాలు చాలా నీచంగా మారాయి. ఎంతగా అంటే.. ఒక్కోసారి మనం మనుషులమేనా అన్న అనుమానం కలుగుతోంది. అందుకే పౌరసమాజం అంతా ఐకమత్యంగా ఉండాలి’ అని జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆజాద్ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకొని.. సామాజిక సేవలో మరింత చురుగ్గా పాల్గొనాలనే కుతూహలంతో ఉన్నానని చెప్పారు. అందుకే ఏక్షణమైనా వచ్చి తాను రాజకీయాలను వీడుతున్నానని ప్రకటించినా ఆశ్చర్యం లేదంటూ వేదికపై ఉన్నవారికి ముందస్తు సూచన చేశారు.కశ్మీరీ పండిట్‌లకు ఎదురైన అనుభవాలతో రూపొందించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆజాద్.. కశ్మీర్ లోయలో చోటుచేసుకున్న అశాంతికి పాకిస్థాన్ ఉగ్రవాదమే ప్రధాన కారణమన్నారు. వారివల్ల కశ్మీర్ లోయలో హిందువులు, కశ్మీరీ పండిట్‌లు, ముస్లింలతోపాటు డోగ్రాస్ వర్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతున్న నేపథ్యంలో అందుకుగల కారణాలపై పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తోన్న (జీ 23) నేతల్లో గులాంనబీ ఆజాద్ ఒకరు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం పార్టీ సంస్థాగత మార్పుపై ఆజాద్ గళమెత్తారు. ఇందులో భాగంగా ఇటీవలే సోనియా గాంధీతోనూ నేరుగా సమావేశమయ్యారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో వరుస పరిణామాలు చోటుచేసుకుంటున్న సమయంలోనే రాజకీయాల నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆజాద్ హింట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
7.చైనాలో ఘోర విమాన ప్రమాదం
` టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఫ్లైట్
` ప్రమాదసమయంలో విమానంలో 132 మంది
బీజింగ్,మార్చి 21(జనంసాక్షి): చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 132 మందితో వెళ్తోన్న బోయింగ్ 737 విమానం చైనాలో గుయాంగ్జి ప్రాంతంలో కుప్పకూలింది.ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు.స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 1.11 గంటల ప్రాంతంలో కున్మింగ్ నగరం నుంచి గుయాంగ్‌రaౌ నగరానికి బయల్దేరిన చైనా ఈస్ట్రన్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం మధ్యాహ్నం 2.22 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయింది. ఆ సమయంలో విమానం 3225 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వద్ద సమాచారం ఉంది. ఆ వెంటనే గుయాంగ్జి ప్రాంతంలోని వుజౌ నగర సవిూపంలో ఓ పర్వతాన్ని ఢీకొట్టి కూలినట్లు తెలుస్తోంది. ఈ విమానం 3.05 గంటలకు ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఈలోపే ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.విమానం కూలిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగినట్లు చైనా విూడియా కథనాలు పేర్కొన్నాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే.. ప్రమాద తీవ్రతను బట్టి విమానంలో ఉన్న వారు ఎవరూ బతికే అవకాశం లేదని స్థానిక విూడియా కథనాలు పేర్కొన్నాయి.గతంలో 2010లో చైనాలోని యిచున్ ప్రాంతంలో విమానం కుప్పకూలిన ఘటనలో 42 మంది చనిపోయారు.
8.18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోస్..?
` కేంద్రం యోచన
దిల్లీ,మార్చి 21(జనంసాక్షి): దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోసు ఇచ్చే విషయమై కేంద్రం యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతుండడం, అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి మూడో డోసు నిబంధన అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు సహా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రికాషన్ డోసు పేరిట మూడో డోసు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన వారికీ బూస్టర్ డోసు కేంద్రం ఇవ్వనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, మూడో డోసు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా ఉచితంగానే ఇస్తారా? లేదా ప్రైవేటులో డబ్బులు చెల్లించి వేసుకోవాలా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.దేశంలో గతేడాది జనవరి 16న కొవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత ఆరోగ్య కార్యకర్తలు, ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేయడం ప్రారంభించారు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి కో`మార్బిడిటీ ఉన్న వాళ్లకు తొలుత ప్రాధాన్యం ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా తీసుకునే అవకాశం కల్పించారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 3 నుంచి 15`18 ఏళ్ల వయసు వారికి, మార్చి 16 నుంచి 12`14 ఏళ్ల వయసు వారికీ టీకా తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది.
9.తెలంగాణ నుంచి రారైస్ కొంటాం..
` ప్రభుత్వమే సహకరించట్లేదు: పీయూష్ గోయల్
దిల్లీ,మార్చి 21(జనంసాక్షి):దేశమంతా ధాన్యం సేకరిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశ్నించారు. ఇవాళ దిల్లీలో కేంద్ర మంత్రి గోయల్‌ను తెలంగాణ భాజపా ఎంపీలు ధర్మపురి అర్వింద్, బాపూరావు, బండి సంజయ్ కలిశారు. కేంద్రంపై తెరాస ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఎంపీలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం యాసంగి ధాన్యం కొనట్లేదని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై గోయల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా గతంలోనే ఈ విషయంపై సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. యాసంగి సీజన్‌లోనూ తెలంగాణ నుంచి రారైస్‌ను కొంటామని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వమే సహకరించడం లేదన్నారు. గతంలో సేకరించి ఇస్తానన్న బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పారు. ఇకపై బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసిందన్నారు. పసుపు రైతులకు పరిహారంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర మంత్రితో చర్చించారు. పరిహారంపై ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని చెప్పినట్లు సమాచారం.