పండగపూట విషాదం


చెరువులో పిల్లతో కలసి దూకిన తల్లి

రాజన్న సిరిసిల్ల,మార్చి18 (జనంసాక్షి):  గంభీరావుపేట మండలంలో హోలీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పిల్లతో కలసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కొత్తపల్లి గ్రామంలో జరిగింది. గ్రామ శివారులో ఉన్న చెరువులో అభిజ్ఞ(03), హంసిక (6 నెలలు)
మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. తల్లి రేఖ మృతదేహం ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల తల్లి రేఖ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.