తెలంగాణలో ఇక ఉద్యోగాల జాతర




నిరుద్యోగ చకోర పక్షులకు వర్షపు జల్లు

భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటన
80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
11,103 కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ
ఇక ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ ఉంటుందని స్పష్టీకరణ
ఉద్యోగలు వయో పరిమితి సడలిస్తున్నట్లు వెల్లడి
నీళ్లు నియామకాలు తదితర అంశాలపై వివరణ
అసెంబ్లీ వేదికగా శుభవార్త తెలిపిన సిఎం కెసిఆర్‌
హైదరాబాద్‌,మార్చి9 (జనం సాక్షి) :   నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తీపి కబురు అందించారు. ఎంతోకాలంగా ఆశపెడుతూ వచ్చి ఉద్యోగాలకు సంబంధించి ఎట్టకేలకు ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా భారీ ఉద్యోగ ప్రకటన చేశారు. ఉద్యోగార్థులకు ఆనందం నింపారు. ఉద్యోగ వయోపరి మితిని సడలించడంతో పాటు,కాంట్రాక్ట్‌ కార్మికులను రెగగ్యులరైజ్‌ చేస్తూ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 80,039 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగగా ప్రకటించారు. ఇకముందు తెలంగాణలో కాంట్రాక్ట్‌ ఉద్యోగగాలు ఉండవని ప్రకటించారు. అలాగే ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని అన్నారు.
వనపర్తి పర్యటనలో చెప్పినట్లుగా అంతా టివిల ముందు కూర్చుని చూసేలా ఉద్యోగాలపై సుదీర్ఘ ప్రకటన చేశారు. అలాగే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, ఉమ్మడి ఎపిలో ఎదుర్కొన్న అనుభవాలు, 9,10 షెడ్యూల్‌,ముల్కీ రూల్స్‌, రాష్ట్రపతి ఉత్తర్వులు తదితర అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇప్పటికే వివిధ శాఖల్లో లక్షకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు ప్రకటించిన సిఎం కెసిఆర్‌ భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసారు. 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టుల ను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయా ల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలిందని సీఎం తెలిపారు. ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను రాష్ట్ర యువతకు తెలియజేయడానికి సంతోషిస్తున్నానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ భర్తీ పక్రియ వల్ల ఏటా సుమారు రూ. 7,000 కోట్ల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి, ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.
మొత్తం తెలంగాణలో 91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్‌ ఉద్యోగుల
క్రమబద్దీకరణ చేస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడిరచారు. విద్యాశాఖలో 25 నుంచి 30 వేల వరకు పోస్టులు, కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. క్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు.అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు ప్రకటించారు. 5 శాతం ఓపెన్‌ కోటాలో పోటీ పడొచ్చని కేసీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంబురాలు ఆకాశన్నాంటుతున్నాయి. కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటూ వెళ్తోంది. భారీ ప్రాజెక్టులతో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించి తెలంగాణను సస్యశ్యామలం చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. కేసీఆర్‌ మానస పుత్రిక అయిన మిషన్‌ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరును అందించారు. ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో సమకూరుతున్న ఆదాయ వనరులను సబ్బండ వర్గాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అంతే కాకుండా ఏడేండ్లలోనే అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచి, తలసరి ఆదాయంలో నంబర్‌వన్‌గా నిలిచింది.
మొత్తానికి నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రకటనను సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా చేశారు. మొత్తం 91,142 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడిరచారు. తక్షణమే 80,039 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు తెలిపారు. కాగా.. రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్‌`1లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్టు వెల్లడిరచారు. ఇకపై కాంట్రాక్ట్‌ పద్ధతితో నియామకాలు ఉండవన్నారు. కేసీఆర్‌ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ పరిమితి పదేళ్లు పెంచాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా.. ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి ఓసీ అభ్యర్థులకు 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49, దివ్యాంగులు 54 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక తెలంగాణలో ఏయే శాఖలో ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారో వివరాలు ఇలా ఉన్నాయి. గ్రూప్‌ `1 ` 503, గ్రూప్‌ `2 582గ్రూప్‌`3 ` 1,373, గ్రూప్‌`4ల ` 9,168 పోస్టుల భర్తీజిల్లా స్థాయిలో 18,866మల్టీజోన్‌లో 13,170 పోస్టులుఅదర్‌ కేటగిరి వర్సిటీలు 8,174పోలీస్‌ శాఖ 18,334సెకండరీ ఎడ్యుకేషన్‌ 13,086 పోస్టులువైద్యశాఖ 12,755ఉన్నత విద్యాశాఖలో 7778 పోస్టులుబీసీ వెల్ఫేర్‌ 4311 పోస్టులురెవెన్యూలో 3560 పోస్టులుఎస్సీ వెల్ఫేర్‌ 2879 పోస్టులుఇరిగేషన్‌లో 2692 పోస్టులుట్రైబర్‌ వెల్ఫేర్‌ 1825పర్యావరణ, ఫారెస్ట్‌ సైన్స్‌ 1598 పోస్టులుపంచాయతీరాజ్‌ 1455ఉపాధి 1221 పోస్టులుఆర్థిక శాఖ 1146స్త్రీశిశు సంక్షేమ శాఖ 895 పోస్టులుమున్సిపల్‌ 859వ్యవసాయం 801 పోస్టులురవాణా 563పశుసంవర్ధక శాఖలో 353 పోస్టులుపరిపాలన శాఖ 343యువజన, టూరిజం 184 పోస్టులుఎª`లానింగ్‌ 136సివిల్‌సప్లై 106అసెంబ్లీ 25ఎనర్జీ 16 పోస్టులు ఉన్నాయి. ఈ ప్రకటన మొదలు పెట్టగానే అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచారు. కెసిఆర్‌కు అబినందనలు తెలుపుతూ నినదించారు.
````