నేడు నిరుద్యోగులకు తీపికబురు


` ఉదయం పదిగంటలకు టీవీల ముందు కూర్కొండి

` అసెంబ్లీ వేదికగా కీలకప్రకటన చేస్తా..

` మతోన్మాతభాజపాను బంగాళఖాతంలో పారేద్దాం

` దేశంలో గోల్‌మాల్‌ గగోవిందం గాళ్లు మోపయ్యారు`

కులం,మతం పిచ్చితో రాజకీయం చేస్తున్నారు`

మోడీ తదితరులను బంగాళాఖాతంలో పడేయాలి`

అప్పుడే దేశానికి విముక్తి  లభిస్తుంది`

తెలంగాణ లాగా దేశం కూడా ముందుకు సాగాలి 

` వనపర్తి సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం

వనపర్తి,మార్చి 8(జనంసాక్షి):వనపర్తి వేదికగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో మార్చి 9న బుధవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగ యువ సోదరుల కోసం ప్రకటన చేయబోతున్నట్టు వెల్లడిరచారు. నిరుద్యోగ సోదరులంతా రేపు పొద్దున 10 గంటలకు టీవీలు చూడండి. ఏం ప్రకటన చేయబోతున్నామో చూడండి.. అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అణువణువున తెలంగాణ జీర్ణించుకున్న రక్తంలో తెలంగాణ కోసం చివరి ఊపిరి దాకా.. చివరి బొట్టు దాకా తెలంగాణ ప్రగతి కోసమే తప్ప టీఆర్‌ఎస్‌ వేరే పని చేయదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దళిత బిడ్డల కోసం ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా.. 10 లక్షలు ఇవాళ దళిత కుటుంబానికి ఇస్తున్నాం. తిరిగి ఇచ్చేది లేదు. కిస్తీ కట్టేది లేదు. బ్యాంక్‌ లింకేజ్‌ లేదు. వడ్డీ లేదు.. వాళ్లకు నచ్చిన పని. వచ్చిన పని చేసుకొని అద్భుతంగా ముందుకు పోవాలి. తెలంగాణ తెచ్చుకొని ఎలాగైతే మనం కరెంట్‌, మంచినీళ్లు అన్నీ తెచ్చుకున్నమో.. మన దళిత బిడ్డలు కూడా అలాగే బాగు కావాలి. దళిత బంధు..ఇతర అన్ని వర్గాల వారు కూడా దళిత బిడ్డలకు అండగా ఉండాలి. భారతదేశమే మన దగ్గర నుంచి నేర్చుకోవాలి.. అని సీఎం వెల్లడిరచారు.దేశంలో గోల్‌మాల్‌ గగోవిందం గాళ్లు మోపయ్యారుదేశంలో గోల్‌ మాల్‌ గోవిందం గాళ్లు మోపు అయ్యారని.. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ వనపర్తి సభలో అన్నారు. ప్రజలకు మత పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. దుర్మార్గమైన చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయాలను మంట కలుపుతున్నారు. చైతన్యం ఉన్న గడ్డగా.. తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకం తెలంగాణలో రానివ్వను. మనందరం కూడా ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. కులం, మతం, జాతి లేకుండా ప్రజలంతా బాగుపడాలన్నారు. దీనికి ఒక్కటే మార్గమని మోడీతో పాటు మతపిచ్చి గాళ్లను బంగాళాఖాతంలో కలపాలన్నారు. తెలంగాణ బాగుపడట్టలు దేశం కూడా ముందుకు సాగాల్సి ఉందన్నారు. ఒకనాడునేను చెప్పిన... నన్ను అవమానించారు ఆరోజు. నేను చెప్పిన ప్రతి మాట.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిరూపించి చూపించా. ఇదే ప్రగతి దేశమంతటా రావాలి. దేశం బాగుపడితే ఇంకా మనం కూడా బాగుపడతాం. అందుకే దేశం కోసం పోరాటానికి ముందుకు పోవాలి. పోదామా.. దేశం కోసం పోరాటానికి.. చివరి దాకా కొట్లాడుదామా.. ఎక్కడ అడిగినా.. ఏ జిల్లాలో అడిగినా.. ఇదే చైతన్యం కనిపిస్తా ఉంది. నేను మిమ్మల్ని అడిగేది ఇదే. ఈ దేశంలో మంచిని కాపాడటానికి.. మంచిని పెంచడానికి అవసరమైతే నా ప్రాణాన్ని కూడా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. అదే పద్ధతిలో ముందుకు వెళ్లాలని అన్నారు. బుద్ధి తక్కువ పార్టీలు, వెదవలు.. వాళ్ల చిల్లర రాజకీయాల కోసం దేశాన్నే, భారత జాతినే బలి పెట్టేటువంటి విష ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.. చైతన్యవంతమైన తెలంగాణ మేధావులు.. దయచేసి దాన్ని తిప్పి కొట్టాలన్నారు. భయంకరమైనటువంటి ఆ వ్యాధి ఆ క్యాన్సర్‌ మనకు రాకుండా చూసుకోవాలి.. అని సీఎం స్పష్టం చేశారు. అంతకుముందు వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు  మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు.ఆ తర్వాత వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. వనపర్తిలో మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గద్వాల్‌ ఎమ్మెల్యే తండ్రి చనిపోతే పలకరించడానికి హైదరాబాద్‌ నుంచి గద్వాల్‌ దాకా తాను బస్సులో వెళ్లానని.. ఆ సమయంలో హైదరాబాద్‌ నుంచి గద్వాల్‌ వరకు ఎక్కడ చూసినా ధాన్యపురాశులే కనిపించాయని.. ఎక్కడ చూసినా భూములు పచ్చగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ ఆన్నారు.ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈసందర్భంగా మన రాష్ట్ర, దేశ, ప్రపంచ మహిళలందరికీ కూడా నా తరుపున, మన రాష్ట్రం తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యత్ర నార్యంతు ప్యూజంతే.. తత్ర రమంత దేవతా అని చెప్పి ఎక్కడ స్త్రీలు పూజించబడతరో దేవతలు సంచరిస్తూ ఉంటారని చెప్పారు. తెలంగాణలో కూడా మన పేదింటి బిడ్డలను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలను మనం తీసుకుంటున్నాం. అవన్నీ విూ కళ్ల ముందట ఉన్నయి. అవన్నీ నేను మళ్లీ చెప్పను. ఎక్కువ సమయం కూడా తీసుకోను. అంతకంటే ముందు వనపర్తి జిల్లా అయితదని కూడా ఎవ్వరూ కలగనలేదు. మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి అన్నీ. ఇంతకుముందే మెడికల్‌ కాలేజీకి కూడా శంకుస్థాపన చేసి వస్తున్నా. దీన్ని సుసాధ్యం చేసుకున్నందుకు మంత్రి నిరంజన్‌ రెడ్డి, వనపర్తి జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో చాలా సార్లు మహబూబ్‌ నగర్‌ జిల్లాకు వచ్చి కండ్లల్లో కన్నీరు పెట్టుకొని వెళ్లా. ఏడ్చి ఏడ్చి ప్రజల కండ్లలో ఇంకిపోయిన నీళ్లు, ఎండిపోయిన బోరుబావులు.. ఇవి ఆనాటి బాధలు. ఎన్నో రకాల బెదిరింపులు.. అవమానాలు.. కేసీఆర్‌ నిన్ను చంపేస్తం అని ఒకరు.. వ్యక్తిగతంగా నన్ను తిట్టినా.. ఓర్పుతో.. విూ దీవనతో పనిచేస్తే రాష్ట్రం వచ్చింది. ఖచ్చితంగా ఉద్యమ జెండా పాలనలో ఉంటేనే న్యాయం జరుగుతుందని విూరు మాకు అధికారం ఇచ్చారు. ఒక్కసారి కాదు రెండు సార్లు ఇచ్చారు. తెలంగాణ రాకముందు ఆనాడు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఒక్కటంటే ఒక్క మెడికల్‌ కాలేజీ లేదు. నేడు ఐదు మెడికల్‌ కాలేజీలు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఉన్నాయి. ఆనాడు కావాలని పక్షపాత వైఖరితో ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీ దద్దమ్మల్లా ఉంటే.. ఇప్పుడు మొండిపట్టతో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పూర్తి చేసుకున్నాం. దాని వల్ల ఇప్పుడు వనపర్తి జిల్లా సస్యశ్యామలం అయింది. హైదరాబాద్‌ నుంచి గద్వాల్‌ దాకా ధాన్యపు రాశులు చూశా. అద్భుతమైన పంటలతో నేడు పాలమూరు జిల్లా పాలు కారుతోంది. పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా త్వరలో పూర్తి చేస్తే.. బ్రహ్మాండమైన వజ్రపు తునుక మహబూబ్‌ నగర్‌ జిల్లా అవుతుంది. తెలంగాణ వచ్చినప్పుడు కరెంట్‌ లేదు.. మంచినీళ్లు లేవు.. సాగునీరు లేదు.. వలసలు.. భయంకరమైన బాధలు.. ఆకలి చావులు.. ఈరోజు నేను పేపర్లలో చూసి గర్వపడుతున్నా. రాయచూర్‌ ప్రాంతం నుంచి మనకు కూలీలుగా వస్తున్నరు. కర్నూలు జిల్లా నుంచి వస్తున్నారు. యావత్‌ తెలంగాణలో 11 రాష్టాల్ర నుంచి వలస కూలీలు వచ్చి మన దగ్గర ఉత్పత్తి అయ్యే పనిలో వాళ్ల జీవితాన్ని గడుపుతున్నారు. 7 ఏళ్లు కడుపు గట్టుకొని అవినీతి రహితంగా పనిచేస్తే ఈ అభివృద్ధి సాధ్యం అయింది.. అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

(అన్నిరంగాల్లో ప్రగతిపథంలో తెలంగాణఎనిమిదేళ్లలో పాలమూరులో అద్భుత ప్రగతివిద్యుత్‌, నీటి రంగాల్లో గణనీయమైన పురోగతిఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఆదేశంవచ్చే యేడాది నుంచే ఆంగ్ల బోధనవనపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌వనపర్తి,మార్చి 8(జనంసాక్షి):అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వనపర్తి సవిూకృత జిల్లా కలెక్టరేట్‌ను కెసిఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభించుకున్నందుకు ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, ప్రజలను అభినందిస్తున్నట్లు వెల్లడిరచారు. కొన్ని రాష్టాల్ల్రో సెక్రటేరియట్ల కంటే మన కలెక్టరేట్లు బాగున్నయన్నారు. ఎనిమిదేళ్ల వెనక్కి తిరిగి చూస్తే పాలమూరు జిల్లా అంటే కరువు జిల్లా అని గుర్తు చేశారు. ఈ రోజు వనపర్తి జిల్లా కావడమే కాదు ఇంత అద్భుతమైన కలెక్టరేట్‌ నిర్మాణం జరిగిందన్నారు. వనపర్తి పట్టణంలో గజిబిజి గందరగోళం ఉండేది. పట్టణంలోని రోడ్ల వెంట ప్రయాణిస్తూ వచ్చాను. చక్కటి రోడ్లు  నిర్మాణమవుతున్నాయి. మిగతా వాటిని పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించాను. కరువు మాయమై పంటలు పండుతున్నయ్‌. అద్భుతమైన ఒక రూపం వచ్చింది. నిన్న తెలంగాణ ఎకనామిక్‌ సర్వే అసెంబ్లీ పెట్టాం. తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా అనేక రంగాల్లో ఉందన్నారు.  ఒకప్పుడు కరెంటు రాదు.. ఎప్పుడు వస్తదో తెలియదు.. ఇవాళ తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు.  రాష్ట్ర ఆర్థిక వనరులకు సంబంధించిన విషయంలో రాష్ట్రం ముందు వరుసలో ఉన్నది. ప్రతి ఇంటికి నల్లాపెట్టి నీరిచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. తలసరి ఆదాయం పెరగడం, విద్యుత్‌, వనరులు పెరుగడం చూస్తున్నామని అన్నారు.  అధికారులు, ప్రజాప్రతినిధులంతా కష్టపడ్డరు. తెచ్చుకున్న రాష్టాన్న్రి ఇష్టపడి అభివృద్ధి చేయాలనే యజ్ఞంలో భాగస్వాములయ్యారు కాబట్టి ఇవాళ రాష్ట్రమంతా కలిపి ప్రగతిపథంలో ముందుకు వెళ్తున్నదని అన్నారు. ఇకపోతే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. పెండిరగ్‌లో ఉన్న ప్రమోషన్లను ఇవ్వాలని విద్యాశాఖ మంత్రిని కోరడంతో పాటు సీఎస్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్‌ రూల్స్‌ ఎక్కడున్నాయంటే.. వేరే రాష్టాన్రికి చెందిన వాళ్లు.. తెలంగాణకు వచ్చి నేర్చుకొని వెళ్లేలా ఉండాలని అన్నారు. 30, 35 సంవత్సరాలు పని చేసిన వ్యక్తులకు ఎప్పుడు ప్రమోషన్లు ఏ టైంకు వస్తయ్‌.. ఎప్పుడు రిటైర్డ్‌ అవుతారు.. రిటైర్డ్‌ అయ్యే లోపే బెనిఫిట్స్‌ అన్నీ రెడీ చేసి పదవీ విరమణ రోజున కార్యాలయంలో సన్మానించి, అధికారిక వాహనంలో దించిరావాలని చెప్పాను. కష్టపడి సేవ చేసిన వారిని గుర్తిస్తే వచ్చే వారి మంచిగా పని చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇవాళ మనం సాధించింది తక్కువ. దీన్ని చూసే చాలా మంది.. చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ వచ్చే ముందు జరిగినటువంటి ప్రచారాలు, తెలంగాణపై పెట్టిన నిందలు విన్నాం. కానీ, ఇప్పుడు అవి రివర్స్‌ అయ్యాయని అన్నారు. ఎన్నో రాష్టాల్రు మనకన్నా ఆర్థికంగా, పారిశ్రామికంగా ముందున్నం అని చెప్పుకున్నటువంటి రాష్టాల్ర కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కంటే పలు రాష్టాల్ర కంటే ఎక్కువ.. ఇదంతా విూ కృషే. ఇవాళ 24 గంటలు అన్ని రంగాలకు ఎక్కడ కూడా నిమిషం కూడా కరెంటు పోకుండా సరఫరా చేసే ఒకేఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.  గతంలో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ఉన్న సమయంలో విద్యుత్‌ అత్యధిక వినియోగం 13600 మెగావాట్లు. ఇవాళ తెలంగాణ 14వేల మెగావాట్లకు వెళ్తున్నది. ఇంకా 14వేల మెగావాట్లయినా సరఫరా చేస్తామని అధికారులు అంటున్నరు. ఎన్ని కొత్త పరిశ్రమలు వచ్చినా.. విద్యుత్‌ వినియోగం ఎంత పెరిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, రాబోయే 10, 15 సంవత్సరాల వరకు బాధలేకుండా చేసినట్లు వెల్లడిరచారు. కష్టపడ్డం కాబట్టి ఇవాళ ఇవన్నీ బ్రహ్మాండంగా చేసుకున్నాం. ప్రాథమికంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం. మంచినీళ్ల బాధ పోయింది. కరెంటు బాధ పోయింది.. సాగునీటి సమస్య పోయింది.. పోతున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే పటిష్ట పడుతాం. ఈ రకంగా మినిమమ్‌ బేసిక్‌ ఇష్యూస్‌ చేసుకున్నం. ఇప్పుడు విద్య, వైద్యం విూద దృష్టి పెట్టాం. మన ఊరు` మన బడి రాష్ట్ర కార్యక్రమమైనా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల విూదుగా వనపర్తి నుంచే ప్రారంభం చేసుకున్నాం. ప్రభుత్వ రంగంలో విద్య కూడా చాలా అద్భుతంగా జరగాలే. దాదాపు 10వేల కోట్ల ఖర్చుతో కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. వైద్య రంగంలో కూడా ముందుకు దూసుకెళ్తున్నామని అన్నారు. నాకు నిరంజన్‌రెడ్డి వ్యక్తిగతమైన మిత్రుడు. ఇలాంటి మిత్రుడిని కలిగి ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఇవాళ వనపర్తి ప్రాంతంలో వచ్చిన అద్భుతమైన అభివృద్ధి ఇక్కడ ఎవరూ ఊహించలే. ఇవాళ ఏ రంగంలో చూసినా తనపడే నాయకత్వం. పని చేసి సాధించాలే.. నా ప్రజలకు మేలు చేయాలి నాకు అవకాశం ఉన్నప్పుడు అని తండ్లాడే వారుంటే అన్ని జిల్లాలు వనపర్తిలా తయారవుతాయి. ఆయన నాయకత్వంలో పని చేయాలి. గ్రామ పంచాయతీలు బాగా పని చేస్తున్నాయ్‌.. వాటిని అభినందిస్తున్నాను. మిగతా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలన్నారు.  ప్రత్యేకంగా వనపర్తి పట్టణానికి సీఎం నిధి నుంచి రూ.కోటి, మిగతా మున్సిపాలిటీలకు రూ.50లక్షలు, అదే విధంగా గ్రామ పంచాయతీలకు అదనంగా రూ.20లక్షలు మంజూరు చేస్తున్నట్లు సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ అంటే కరువు జిల్లాగా పేరుంది. జిల్లాలో 25,30వేల ఎకరాల విస్తీర్ణంలో అడవి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. జిల్లా మంత్రి, కలెక్టర్‌ పూర్తి శ్రద్ధ వహించి గ్రామాలు, పట్టణాల్లో హరితహారం, విలేజీ నర్సరీలను చాలా బాగా చేయాలి. అవెన్యూ ప్లాంటేషన్‌ కూడా బాగా చేయాలన్నారు. గతంలో నార్మల్‌ రెయిన్‌ఫాల్‌ 500 అని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక వర్షాలు ఇప్పుడు వనపర్తి జిల్లాలో కరుసున్నయ్‌ రెండు సంవత్సరాల నుంచి. అసలు కరువున్నది మాయమయ్యే పరిస్థితి ఉన్నది. ఇంకా కూడా కాలువలన్నీ మంజూరయ్యాయి. కాలువలు, ఎత్తిపోతలు పూర్తయితే వనపర్తి జిల్లా బంగారు పర్తి కావాలని కోరుకుంటున్నా. ఇంకా ఇక్కడ అద్భుతాలు కావాలే. అందరికీ మరోసారి అందరినీ అభినందిస్తూ, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతున్నా’ అన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వచ్చే యేడాది నుంచే ఆంగ్ల బోధనవచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విూడియంలో బోధన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు`మన బడి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పైలాన్‌ను సీఎం కేసీఆర్‌, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ప్రసంగించారు. మన ఊరు మనబడి కార్యక్రమం ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయనుందని తెలిపారు. దీనికి వనపర్తి జిల్లా వేదికగా శ్రీకారం చుట్టాం. వనపర్తికి ఆ గౌరవం దక్కుతుందన్నారు. తామంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పైకి వచ్చిన వాళ్లమే అని పేర్కొన్నారు. విూ ముందు ఈ హోదాలో నిలబడ్డామంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఆ రోజు గురువులు చెప్పిన విద్యనే కారణం అన్నారు. భవిష్యత్‌లో చాలా చక్కటి వసతులు పాఠశాలల్లో నిర్మాణం కాబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల బోధన కూడా ప్రారంభం కాబోతుందన్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విూ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అంతకుముందు వనపర్తి జిల్లా కేంద్రానికి సవిూపంలో ఉన్న చిట్యాలలో వ్యవసాయ మార్కెట్‌ యార్డును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మార్కెట్‌ యార్డు వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ వనపర్తి జిల్లా కేంద్రానికి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. ఇందుకోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.