హైకోర్టు తీర్పు మేరకు నడుచుకోవాలి

రాజధాని మార్పు సరికాదు: కాంగ్రెస్‌

గుంటూరు,మార్చి4 ( జనంసాక్షి ) :   రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తోందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలి అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ రెండేళ్లుపైగా ఉద్యయం చేస్తున్న రైతులకు, ఉద్యమకారులకు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం మారిన ప్రతీసారి రాజధాని మారిస్తే రాష్ట్రం అధోగతి పాలౌతుందన్నారు. మూడు రాజధానుల అంశాన్ని మొదటి నుంచి కాంగ్రెస్‌ వ్యతిరేకించిందని తెలిపారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేసిందని విమర్శించారు. వేల కోట్లతో నిర్మించిన భవనాలు అన్ని శిథిలావస్థకు చేరాయన్నారు. అమరావతి రాజధానికి తూట్లు పొడిచేలా వైసీపీ వ్యహరించిందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ బయటకి వచ్చి ఏకైక రాజధానిగా అమరావతి అని ప్రకటించాలని మస్తాన్‌ వలి డిమాండ్‌ చేశారు.