సామ్రాజ్యవాద దేశాలఆధిపత్యంలో,భాగమేఉక్రెయిన్ పై దాడి

 

ఇల్లందు మార్చి 2: (జనంసాక్షి)
ప్రపంచ దేశాలలో సామ్రాజ్యవాద దేశాలు నాటో కూటమి గా ఏర్పడి వెనుకబడిన దేశాలను తమ కూటమి లో చేరాలని ఒత్తిడి ఆదిపత్యాల  మూలంగానే ఉక్రెయిన్-రష్యా సైనిక బలగాల మధ్య భీంకర దాడులు కొనసాగుతున్నాయని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు నాయిని రాజు అన్నారు.బుధవారం  సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా ఇల్లందు పట్టణ కేంద్రంలో రష్యా సామ్రాజ్యవాద దాడులను నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు, ఈ కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఇల్లందు పట్టణ కార్యదర్శి కామ్రేడ్ రేసు సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడారు,ఉక్రెయిన్ రష్యా ల మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం ఆ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదని ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలలో ఉన్న పౌర సమాజం పై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని,ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకునే ఆయిల్ సంపదలు,ఇతర ఉత్పత్తి ధాన్యాల పై రేట్లు మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు అన్నారు, అదేవిధంగా ప్రపంచ దేశాల లోనే ఉక్రెయిన్ లో వైద్యవిద్యకు ప్రఖ్యాతిగాంచిన దేశమని ఇప్పటికే అక్కడ చదివే వివిధ దేశాలు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అదేవిధంగా ఆ రెండు దేశాల సైనిక బలగాల కుటుంబాలు పౌర సమాజం తీవ్రంగా నష్టం జరుగుతుందని తక్షణమే యుద్ధ వాతావరణాన్ని విరమించుకోవాలి ఆ వైపుగా ప్రపంచ దేశాలు శాంతిని నెలకొల్పే విధంగా కృషి కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ నాయకులు కొమరం ఎంపిటిసి అజ్మీర బిచ్చ పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వీ, సిపిఐ ఎంఎల్ ప్రజా పందా నాయకులు ఈసం భద్రన్న యదళ్ళపల్లి  సావిత్రి గంగాధర భాస్కర్, బుర్ర రాఘవులు శేషయ్య,  తులిస్యా, బండారి సత్యం భూక్య శివ, వెంకటమ్మ, ధారావత్ దేవా తదితరులు పాల్గొన్నారు.
x