స్టాలిన్‌కు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సిఎంల శుభాకాంక్షలు

అమరావతి,మార్చి1  (జనం సాక్షి):  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఢల్లీి పర్యటనలో ఉన్న కేసీఆర్‌.. సీఎం స్టాలిన్‌కు ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కొద్ది రోజుల క్రితం తమిళనాడులో పర్యటించి జాతీయ రాజకీయాలపై సీఎం స్టాలిన్‌తో కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసిందే. ఇకపోతే మంత్రికెటిఆర్‌ కూడా స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.