విజయవంతంగా ముగిసిన యాత్ర
హైదరాబాద్,మార్చి4(జనంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన తండ్రి శిబూ సోరెన్‌తో కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన శిబూ సోరెన్‌కు కేసీఆర్ ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. శాలువాతో శిబూ సోరెన్‌తో పాటు హేమంత్ సోరెన్‌ను సత్కరించారు. అనంతరం హేమంత్ సోరెన్‌తో కేసీఆర్ ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఇద్దరు సీఎంలు కలిసి విూడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదు.. దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో పలువురి నేతల్ని కలవడం జరుగుతోంది. కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ఢల్లీి నుంచి జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. రాంచీలో పలు చోట్ల కేసీఆర్ బ్యానర్లు ప్రదర్శించి.. ఇలాంటి నాయకుడు దేశానికి అవసరమని పేర్కొన్నారు. రాంచీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గిరిజన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా విగ్రహం వద్దకు చేరుకుని, పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ్నుంచి సీఎం హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి కేసీఆర్ వెళ్లారు. అక్కడ హేమంత్ కటుఉంబ సభ్యులను కలిశారు. కెసిఆర్ వెంట సతీమణి శోభ, కూతురు కవిత తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. సీఎం హేమంత్ సోరెన్‌తో కలిసి ఆ కుటుంబాలను కేసీఆర్ పరామర్శించారు. గల్వాన్‌లోయలో మరణించిన వీరజవాను కుందన్‌కుమార్ ఓరaా సతీమణి నమ్రతకుమారి, మరో వీరుడు గణెళిశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున
చెక్కులను కేసీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన వారిని కేసీఆర్ ఓదార్చారు.
జార్ఖండ్ పర్యటనలో భాగంగా కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు.