రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల కార్యక్రమం

 



` 74మందికి అవార్డుల ప్రదానం చేసిన రాష్ట్రపతి
` అవార్డు అందుకున్న టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా
న్యూఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది.దేశ రాజధాని న్యూఢల్లీిలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ మాజీ సీఎం కళ్యాణ్‌సింగ్‌కు మరణానంతరం ప్రకటించిన పద్మ విభూషణ్‌ అవార్డును ఆయన కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌ అందుకున్నారు. అలాగే పద్మ భూషణ్‌ అవార్డును భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణా ఎల్లా, సీఎండీ సుచిత్రా ఎల్లా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల విూదుగా అందుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చొప్రా సహా పలువురు క్రీడాకారులు పద్మ అవార్డులు అందుకున్నారు. క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా, శాస్త్రీయ గాయకుడు ప్రభా ఆత్రే, నటుడు విక్టర్‌ బెనర్జీ సహా 74 మందికి రాష్ట్రపతి అవార్డులను అందించారు. ఈ సంవత్సరం, 128 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించగా.. తొలి విడుత పంపిణీ కార్యక్రమం ఈ నెల 21న జరిగింది. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌ (మరణానంతరం), శాస్త్రీయ గాయకుడు ప్రభా ఆత్రేకు పద్మ విభూషణ్‌, నటుడు విక్టర్‌ బెనర్జీ, భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర ఎల్లా పద్మ భూషణ్‌ అవార్డులను అందుకున్నారు.టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రో బంగారు పతక విజేత నీరజ్‌ చోప్రా, టోక్యో పారాలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగవత్‌, జావెలిని త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌, ప్రముఖ గాయకుడు సోను నిగమ్‌తో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ చేతుల విూదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అలాగే ఐర్లాండ్‌కు చెందిన ప్రొఫెసర్‌ రట్జర్‌ హోస్ట్‌కు ఐరిష్‌ పాఠశాలల్లో సంస్కృతానికి ప్రాచుర్యం కల్పించడంలో చేసిన కృషికి సైతం రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి కేంద్రం అవార్డులను ప్రకటిస్తున్నది. ఈ ఏడాది జాబితాలో నాలుగు పద్మవిభూషణ్‌, 17 పద్మభూషణ్‌, 107 పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 34 మంది మహిళలు, 13 మందికి మరణానంతరం పద్మ అవార్డులు దక్కాయి. అలాగే విదేశీయులతో పాటు పలువురు ప్రవాస భారతీయులను సైతం కేంద్రం పద్మ అవార్డులతో సత్కరించింది