చేతకాని వారే కకులమతాల గురించి మాట్లాడుతారు

అమరావతి గురించి కష్టపడుతుంటే కులం పేరుతో దూషణలు

జగన్‌ అవినీతి, అక్రమాలే లక్ష్యంగా ప్రచారం
తెలుగువారే తన కులం అన్న చంద్రబాబు
తన హయాంలో 72శాతం పోలవరం పూర్తి
అక్కడా అవినీతి అంటూ దుష్పచ్రారం చేశారు
జగన్‌ తీరుపై మండిపడ్డ చంద్రబాబు నాయుడు
అమరావతి,మార్చి4 ( జనంసాక్షి ) :  తెలుగువారే నా కులం, మతమని, తెలుగువారంతా నా కుటుంబ సభ్యులేనని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం తాను కష్టపడితే తనకు కులమతాలు అంటగట్టారని మండిపడ్డారు. తెలుగువారి సంక్షేమమే తనకుముఖ్యమని అన్నారు.
చేతకానివాళ్లు కుల, మత, ప్రాంతాల గురించి మాట్లాడతారని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వ, ప్రజావ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లి వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఐటీడీపీ సభ్యులతో చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు. అవాస్తవాల చెప్పి ఏపీ సీఎం జగన్‌ ప్రజలను మోసం చేశారని, ఏపీలోని యువకులు, మహిళలు, మేధావులు ప్రజలకు వాస్తవాలు చెప్పి ప్రభుత్వాన్ని గ్దదె దించాలని కోరారు. వైఎస్‌ వివేకాను గొడ్డలిపోటుతో చంపి గుండెపోటుగా చిత్రికరించేందుకు ప్రయత్నించారని, ఆ నేరాన్ని టీడీపీపై మోపారని అన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందున సీబీఐపై ఎదురుదాడి చేస్తున్నారని జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. నిజాలను వెలికితీయడంలో ఐటీడీపీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని సూచించారు. ఏపీలో జరుగుతున్న అన్ని తప్పులకు తానే కారణమంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ వివేకానంద రెడ్డిని చంపి గుండెపోటు అని ప్రచారం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాలు చెప్పి వైసీపీని ఓడిస్తామన్నారు. సానుభూతితో జగన్‌ ఓట్లు వేయించుకున్నారన్నారు. వివేకా హత్య, కోడి కత్తితో సానుభూతి పొందారని, ఇప్పుడు కోడి కత్తి ఎక్కడుందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. పోలవరాన్ని పరిగెత్తించి 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఉంటే ఈపాటికి 100 శాతం పూర్తయ్యేదన్నారు. అవినీతి, అబద్దాల పుట్టా వైసీపీ అని దుయ్యబట్టారు. పోలవరంలో అవినీతికి పాల్పడ్డామన్నారు.. నిరూపించారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి చేతకాని సీఎం దాని గురించి మాట్లాడతారని అన్నారు. ప్రాంతాలను రెచ్చగొట్టి ఓట్లు వేయించు కుంటారా?.. ఓట్ల కోసం ప్రాంతాలు, కులాలు, మతాలను రెచ్చగొడతారా? అంటూ మండిపడ్డారు.
తెలుగువారంతా తమ కుటుంబ సభ్యులేనని, తెలుగువారే తన కులం, మతం అని చంద్రబాబు అన్నారు.
పేటీఎం బ్యాచ్‌ను అడ్డుపెట్టుకుని టీడీపీపై విషప్రచారం చేశారని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. ప్రజల కష్టాలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ఐటీడీపీ సభ్యులపై ఉందన్నారు. ఐటీడీపీ సభ్యులపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని, భయపడకుండా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులను రద్దు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.