కల్లు రుచిచూసి గౌడన్నలకు మద్దతు పలికిన భట్టి
ఖమ్మం,మార్చి4 (జనంసాక్షి) : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రలో సరదాగా కల్లు రుచి చూశారు.. మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత ఆరు రోజుల నుంచి మల్లు భట్టి విక్రమార్క
పాదయాత్రను కొనసాగుతున్నారు. శుక్రవారం పాదయాత్ర వల్లభి గ్రామ సవిూపానికి చేరుకుంది.. ఈ సమయంలో కల్లు గీత కార్మికులు కల్లు తాగాల్సిందిగా భట్టిపై ఒత్తిడి చేయడంతో.. ఓ పట్టుపట్టి ఖుషి అయ్యారు.. ఇక, ప్రజలకు మెడిసిన్ మాదిరిగా ఉపయోగపడే కల్లును దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ కోసం గళమెత్తాలని గౌడన్నలు సీఎల్పీ నేతకు విజ్ఞప్తి చేశారు..
పీపుల్స్ మార్చ్‌లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పెన్షన్ దారులు, రేషన్ కార్డుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.. ప్రజల కోసం చేసే పీపుల్స్ మార్చ్ ను వ్యతిరేకించే వాళ్ళని దూరం ఉంచాలని సూచించిన ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో బంగారు తల్లి పథకం పేరుతో ఆడపిల్లలకు మూడు లక్షలు ఇచ్చామని గుర్తుచేశారు.. సబ్సిడీ విత్తనాలు ఇవ్వకుండా రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టినందుకు పాలాభిషేకం చేయాలా? అంటూ కేసీఆర్‌పై ర్ అయిన ఆయన.. మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అని మండిపడ్డారు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ అందించామని.. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారులను మధ్యవర్తులుగా మార్చిందని విమర్శించారు. రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని, రాబోయే ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌కు ఉరి వేయడం ఖాయమని జోస్యం చెప్పిన భట్టి.. ప్రజలకు ప్రజావ్యతిరేకంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో ఎవరికైనా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.. బీజేపీకి పనిచేస్తానన్న కేసీఆర్.. ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామిని ఎలా కలిసారు అని నిలదీశారు.
పాదయాత్రలో పదనిసలు