విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం బాసట

ఐదులక్షల సాయం ప్రకటించిన సిఎంజగన్‌

ఘటనను సిఎం జగన్‌కు వివరించిన మంత్రులు
అమరావతి,మార్చి5 (జనం సాక్షి): విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో పాముకాటుకు గగురై మరణించిన విద్యార్థికుటుంబానికి ప్రభుత్వం అండగా నిలచింది. ఈ ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి రంజిత్‌ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ముగ్గురు విద్యార్థులు పాముకాటుకు గురైన సంగతి తెలిసిందే. పాము కాటేసిన ముగ్గురు విద్యార్థులలో 8 తరగతి చదువుతున్న రంజిత్‌కుమార్‌ మృతి చెందాడు. గురుకులంలో విద్యార్ధులు పాముకాటుకు గురైన ఘటన పై ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ వివరించారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందడం, మరో ఇద్దరు విద్యార్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించారు మంత్రులు. విద్యార్థి మృతిపై స్పందించిన ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక సాయం ప్రకటించారు. ఈఘటనపై సీఎం జగన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.మృతి చెందిన విద్యార్థి మంతిన రంజిత్‌ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. మంత్రుల ద్వారా విద్యార్ధి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి వెల్లడిరచారు. దీంతో విద్యార్ధి కుటుంబానికి ఊరట లభించనుంది.భోజనం అనంతరం విద్యార్థులు నిద్రిస్తున్న ఓ గదిలోకి అర్ధరాత్రి సమయంలో పాము ప్రవేశించింది. కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన మంతిని రంజిత్‌, వంగపండు నవీన్‌, ఈదుబిల్లి వంశీలను కాటువేసింది. వారిని ప్రాథమిక వైద్యం అనంతరం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయనగరం లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ రంజిత్‌ మృతిచెందాడు. నవీన్‌, వంశీలకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పరామర్శించారు. రంజిత్‌ మరణంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.