యాదాద్రి సలహాదారుగా చినజీయర్‌ను తొలగించాలి


ట్వీట్‌ చేసిన పిసిసి చీఫ్‌ రేంవత్‌ రెడ్డి

హైదరాబాద్‌,మార్చి18  (జనంసాక్షి):  సమక్కసారలమ్మలపై త్రిదండి చినజీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్‌ వేదికగా స్పందిస్తూ....తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మలను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్‌ తొలగించాలన్నారు. మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంటూ రేవంత్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సీతక్క కూడా చినజీయర్‌పై ఘాటు విమర్శలు చేశారు.