ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా హెల్త్‌ ప్రొఫైల్‌



ప్రజల ఆరోగ్య వివరాలతో హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రారంభం

ములుగు జిల్లాలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు
గిరిజన యూనివర్సిటీ పట్ల కేంద్రం తీరుపై మంత్రి ఆగ్రహం
ములుగు,మార్చి5 (జనం సాక్షి):  ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం హెల్త్‌ ప్రొఫైల్‌ను ప్రారంభించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ’తెలంగాణ హెల్త్‌ ప్గ్రొªల్‌’ను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణెళి లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికోసం పైలట్‌ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్‌లో హెల్త్‌ ప్రొఫైల్‌ పెలెట్‌ ప్రాజెక్టును మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి హరీశ్‌ రావు ప్రారంభించారు. అంతకు ముందు జిల్లా దవాఖాన భవనం, రేడియాలజీ ల్యాబ్‌, పీడియాట్రిక్‌ యూనిట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయడంలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఒక ఐడీ నంబర్‌ ఇస్తారు. వారి నుంచి నమూనాలను సేకరించి, 30 రకాల డయాగ్నోస్టిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాల ఆధారంగా వారి ఆరోగ్య సమస్యలను నిర్దారిస్తారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేస్తారు. ఈ సమాచారంతో అనేక ప్రయోజనాలు కలుగ నున్నాయి. దీర్ఘకాలిక బాధితులను గుర్తించడం, వారికి మెరుగైన వైద్యం అదించడం, క్యాన్సర్‌ వంటి రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందించడం.. ఇలా అనేక ప్రయోజనాలు కలుగనున్నాయని మంత్రి వివరించారు. సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 18 ఏండ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచికలను సేకరిస్తారు. ములుగు జిల్లాలో దాదాపు 2 లక్షల 18 వేల 852 మంది 18 ఏండ్లు పైబడిన వారు ఉన్నారు. వారి నుంచి..
జ్వరం, రక్త పోటు, రక్తహీనత, రక్తంలో చక్కెర స్థాయి, వయసు తగ్గ ఎత్తు, బరువు, బ్లడ్‌ గ్రూపు, శరీర కొలతలు, రక్తంలో ప్రాణవాయువు, గుండె కొట్టుకునే తీరు, ఇతర అంశాలు, అనారోగ్య సమస్యలు నమోదుచేసుకుంటారు. రక్తం, మూత్ర నమూనాలను సేకరించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశీలిస్తారు. ప్రతి వ్యక్తి ఆధార్‌ నంబర్‌, ఇంటి అడ్రస్‌ వంటి వివరాలు సేకరించిన వారికి ఏకీకృత నంబర్‌ను కేటాయిస్తారు. దీంతో వ్యక్తి ఆరోగ్య వివరాలు తెలుసుకునే వీలుంటుంది. కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ (సీబీపీ), సంపూర్ణ మూత్ర పరీక్ష, మూత్రపిండాల పనితీరు తెలుసుకునేందుకు ఆల్బుమిన్‌, బ్లడ్‌ యూరియా, క్రియాటిన్‌ మొదలైన పరీక్షలు చేస్తారు. ఈ పథకంలో భాగంగా వైద్య పరీక్షల ఆధారంగా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి వెంటనే చికిత్స అందిస్తారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి భవిష్యత్తులో ఏ విధమైన జబ్బులు రాకుండా తగిన సూచనలు చేస్తారు. ఈ సందర్భంగా మంత్రిహరీస్‌ రావు మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీలో 90శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలు దేశానికే ఆదర్శంగా ఉంటాయని చెప్పారు. ములుగులో రూ.42 కోట్లతో 250 పడకల దవాఖానకు శంకుస్థాపన చేసుకున్నామని
వెల్లడిరచారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం రూ.20 కోట్లు ఇచ్చిందని చెప్పారు. గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకే గిరిజన యూనివర్సిటీయా అని ప్రశ్నించారు. గిరిజనులకు 90 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వా కాపీ కొడుతోందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. అందరినీ సమానంగా చూడాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారని... సమానం కాదు ఎక్కువగానే చూస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శమని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ... ఈ హెల్త్‌ ఫ్గ్రొªల్‌ అనేది గిరిజనులకే ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు. ములుగు జిల్లా మరింతగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సత్యవతి రాథోడ్‌ పేర్కన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. అన్ని జిల్లాలను సమానంగా చూసినప్పుడే తెలంగాణ సమాంతరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా ఆసుపత్రిలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. అంతే స్థాయిలో నిధులు ఇవ్వాలన్నారు. గిరిజన యూనివర్సిటీపై స్పష్టత ఇవ్వాలని సీతక్క కోరారు.