బడుగుల అండను కోల్పోతున్న బిఎస్పీ


యూపి ఫలితాలతో మాయావతి పరిశీలన చేసుకోవాలి

కాన్షీరామ్‌ లాంటి నేత ఇప్పుడు బిఎస్పీకి అవసరం

న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి):  ఒకప్పుడు యూపీ రాజకీయాలను శాసించిన బీఎస్పీ నామావశిష్టంగా మారిపోవడం విషాదం. బడుగు వర్గాలకు అండగా నిలిచిన పార్టీ మట్టి కరచి పోవడం దేశంలో బడుగులకు గొడుగు లేకుండా పోయింది. దీనికితోడు మాయావతి నాయకత్వం కూడా ప్రభావవంతంగా లేదు. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ఐపిఎస్‌ పదవికి రాజీనామా చేసి బిఎస్పీలో చేరిన ప్రవీణ్‌ కుమార్‌ లాంటి వారికి 

ఈ ఫలితాలు నిస్తేజం కలిగించేవే. ఒకప్పుడు యూపిని ఏలడంతో పాటు, బడుగులకు ఆశాజ్యోతిగా ఉన్న బిఎస్పీ ఇప్పుడు ఉనికి కోల్పోవడం చూస్తుంటే..బడుగులకు కూడా ఆశలు సన్నగిల్లాయా అన్న అనుమానా లు వస్తున్నారు. అంతేగగాకుండా యూపిలో అధికార పీఠానికి దూరంగానే మిగిలిపోయింది. సంక్లిష్ట కుల, ప్రాంత సవిూకరణలతో బహుముఖ పోటీ ఉండే యూపీ లాంటి రాష్ట్రం ఈసారి కేవలం బీజేపీ, ఎస్పీల ద్విముఖ పోరుగా మారిపోవడం గమనించాలి. ఈ పోరుతో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)తో పాటు కాంగ్రెస్‌ కేడా  నలిగిపోయింది. ప్రియాంక పగ్గాలు తీసుకొని ప్రచారం చేసినా, యూపీలో 3 శాతం కన్నా తక్కువ ఓట్లకే కాంగ్రెస్‌ పరిమితమైతే, బిఎస్పీ అంతకన్నా దారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది. 

 దశాబ్దాలుగా లేని విధంగా యూపీలో అధికార పక్షాన్నే రెండోసారీ పీఠమెక్కించాయి. గతంలో బిజెపి మద్దతుతో లేదా ఎస్పీ మద్దతుతో అధికారం నడిపిన మాయావతి ఎందుకనో నిస్తేజంగగా మారారు. తాజా రాజకీయాల్లో నామమాత్ర పాత్రకే పరిమితం అయ్యారు. బిఎస్పీ తన పూర్వ ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. గూండాగిరీకి దూరంగా శాంతిభద్రతల పానలపై ప్రచారం యూపీలో బీజేపీకి కలిసొచ్చాయి. ఇంటింటా ఎన్నికలలో గెలుపోటములు ఎక్కువగా సెంటిమెంట్‌  అంశాల విూదే తప్ప, అసలు వాస్తవాల విూద ఆధారపడి ఉండవు. అయితే ఓటు బ్యాంకును కూడా కలోప్‌ఓవడం మాయావతి నాయకత్వ వైఫల్యం తప్ప మరోటి కాదు. కాన్షీరామ్‌ లాంటి బలమైన నేత ఇప్పుడు బిఎస్పీకి రావాలి. బడుగు బలహీనవర్గాలకు అండగా ఉన్నారన్న ప్రభావం చూపాలి. ధరల పెరుగుదల, ఉపాధి లేమి, రైతు ఉద్యమాలు, మధ్యతరగతి కష్టాలు, అధికారపక్షానికి సాధారణంగా ఎదురయ్యే వ్యతిరేకత లాంటివేవీ బీజేపీ గెలుపును ఆపలేక పోయాయి. భావోద్వేగాలను ప్రేరేపించే ఈ ప్రయత్నం తాజా ఎన్నికల్లోనూ ఫలించింది. పార్టీ అధికారంలో ఉన్న యూపీలో లఖిమ్‌పూర్‌ ఖేరీ, హాథ్రస్‌ లాంటి ఘటనలు, ఉత్తరాఖండ్‌లో సీఎంల మార్పులు, గోవాలో అంతర్గత బలహీనతల లాంటి ప్రతికూలతలున్నా ఓటర్ల తీర్పు మాత్రం బీజేపీకే అనుకూలించింది. పోటాపోటీ ఉంటుందన్న ఉత్తరాఖండ్‌లో తుది తీర్పూ కాంగ్రెస్‌కు షాక్‌ కలిగించింది. నిజానికి బిఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీల్లోనే బడుగు బలహీన వర్గగాలకు పెద్దపీట దక్కుతుంది. అలాంటిది ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికలతో తమ మూలాలను కోల్పోయాయి. బీజేపీ, మోదీ ప్రభంజనాలకు ఇప్పటికైతే తిరుగులేదనే భావనను ఈ ఎన్నికలు కలిగించాయి. విభిన్న సవిూకరణాల ఎన్నికల రాజకీయాల నిర్వహణలో ప్రస్తుతం దేశంలో మరే పార్టీ దానికి పోటీలో లేవని నిరూపితం అయ్యింది. కులాల గురించి పోరాడుతున్న వారు సైతం బిజెపి గొడుగుకిందకు చేరుతున్నారు. ఈ ఫలితాలతో బిఎస్పీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజానికి బిఎస్పీలో కూడా మాయావతి తిరుగేలని నియంతలా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌ దేశంలో ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో మాత్రమే అధికారానికి పరిమితమైంది. అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి, సంక్షేమాల కార్డుతో కేజీవ్రాల్‌ పంజాబ్‌ కోటపై జెండా పాతారు. కాంగ్రెస్‌, బీజేపీ తర్వాత దేశంలో ఒకటికి రెండుచోట్ల అధికారంలో ఉన్న పార్టీ అనే ఘనతను ’ఆప్‌’కు కట్టబెట్టారు. ఓ రకంగా చెప్పాలంటే బిఎస్పీ, కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ ఆప్‌, బిజెపిలకు మళ్లుతోందని గుర్తించాలి. అదే సందర్భంలో పర్మినెంట్‌ ఓటు బ్యాంక్‌ కూడా ఇక ఉండబోదన్న సంకేతాలను గుర్తించాలి. కొత్త ఓటర్ల రాక,యువత ఆలోచనలు మారడం లాంటివి కూడా సంప్రదాయ ఓటుబ్యాంక్‌ను దెబ్బతీస్తున్నాయి. మోదీ పాపులారిటీకి యువత ఆకర్శితులు అవుతున్నారు. ఈ ఫలితా లతో ఆగస్టులో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం బీజేపీకి తగ్గిపోనుంది. జాతీయ వేదికపై ఇక బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి స్థానాన్ని కాంగ్రెస్‌ కోల్పోతుంటే, ఆ లోటు భర్తీకి ఆప్‌ పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఒక రకంగా ఇది కాంగ్రెస్‌కు,బిఎస్పీలకు  మేలుకొలుపు లాంటిది. ఇప్పటికైనా నాయకత్వ లోపాలను సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్‌కు భవిష్యత్తు కష్టమే. ఒక్క కాంగ్రెస్‌కే కాదు... ఇతర ప్రతిపక్షాలకూ ఈ ఎన్నికల ఫలితాలు పాఠం నేర్పాయి. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా కలసి పోరాడితే తప్ప, మోదీనీ, బీజేపీనీ 2024లోనైనా సరే ఎదుర్కోవడం అంత సులభం కాదని స్పష్టం చేశాయి.