యశోదలో వరలక్ష్మి కీలక భూమిక


వరలక్ష్మీ శరత్‌కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ అదరగొడుతుంది. ఇటీవలె క్రాక్‌, నాంది సినిమాలతో హిట్‌ అందుకున్న ఆమెకు తెలుగులో మరింత క్రేజ్‌ పెరిగింది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. శనివారం ఆమె పుట్టినరోజు కావడంతో యశోద టీం ఆమెకు బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తూ ఆ చిత్రం నుంచి స్పెషల్‌ పోస్టర్‌ వదిలారు. ఈ చిత్రంలో ఆమె ’మధుబాల’ అనే పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్‌లో స్పష్టమవుతుంది. ఇకపోతే టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది సమంత. ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌సిరీస్‌లో రాజీగా అదరగొట్టినా, పుష్పలో ఊ అంటావా మావా అంటూ ఐటం సాంగ్‌తో కవ్వించినా అది ఒక్క సామ్‌కే చెల్లుతుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత కెరీర్‌ విూద మరింత ఫోకస్‌ పెట్టిన ఈ హీరోయిన్‌ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా ఆమె పాన్‌ ఇండియా చిత్రం యశోదలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి సామ్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజవగా అది అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సామ్‌ యశోదకుగానూ ఎంత పారితోషికం తీసుకుంటుందన్న వార్త ఆసక్తికరంగా మారింది. సామ్‌ యశోద సినిమాకు రూ.3 కోట్ల పారితోషికం తీసుకుంటుందట! సుమారు రూ.30 కోట్ల బ్జడెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరీశ్‌ శంకర్‌, హరీశ్‌ నారాయన్‌ దర్శకత్వం వహిస్తుండగా శ్రీదేవీ మూవీ బ్యానర్‌పై శివలంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.