ప్రశాంత్ కిశోర్ వ్యూహం మేరకు కెసిఆర్ అడుగులు
నితీశ్ కుమార్,ఆజాద్‌ల పేర్లతో ఊహాగానాలు
యూపి ఫలితాలు వస్తే తప్ప కానరాని స్పష్టత
న్యూఢల్లీి,మార్చి5(జనం సాక్షి): ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలవటం విపక్షాల వ్యూహంలో భాగమే అంటున్నారు. కొంత కాలంగా జనతాదళ్ (యు), బీజేపీ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఉత్తర ప్రదేశ్, మణిపూర్ రెండిరటిలో బీజేపీకి వ్యతిరేకంగా జేడీ (యూ) అభ్యర్థులను నిలబెట్టటం అందుకు ఒక ఉదాహరణ. అలాగే ఆ పార్టీ నేతలు కాషాయ సంస్థల కార్యక్రమాలు, విధానాలపై విషం చిమ్ముతున్నారు. మరోవైపు, నితీష్ కుమార్ మద్య నిషేధ విధానాన్ని బీహార్ బీజేపీ నాయకత్వం తీవ్రంగా విమర్శించింది. ఇంతకూ నితీష్ మదిలో ఏముంది అనే విషయం యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత కానీ తెలియందటున్నారు ఆయన సన్నిహితులు.అంతేకాదు, ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు అనుసరించే ఎత్తుగడ ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్ పంజాబ్‌ను నిలబెట్టుకోగలిగి, ఉత్తరాఖండ్, గోవాలను గెలుచు కోగలిగితే ప్రతిపక్ష శిభిరం అంత సులువుగా దానిని పక్కన పెట్టలేదు. కానీ, కాంగ్రెస్ వారితో కలిసి వెళ్లేది కూడా అనుమానమే. హస్తం పార్టీ ఒంటరి దారినే ఎంచుకుంటుందని మమతా బెనర్జీ గట్టిగా నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీతో కలిసి నడవాలా వద్దా అనేది శరద్ పవార్, మమతా బెనర్జీ , కేసీఆర్ ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. వచ్చే జూన్‌లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు విపక్షాల ఐక్యతకు మొదటి పరీక్ష కానుంది. కేసీఆర్ ప్రస్తుత హడావుడి అంతా రాష్ట్రపతి ఎన్నికల కోసమేననే వార్తలు వస్తున్నాయి. 2024 ఎన్నికలకు బీజేపీ వ్యతిరేక పునాది బలపడాలంటే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీని ఓడిరచాలన్నది కేసీఆర్`ప్రశాంత్ కిశోర్ గేమ్ ప్లాన్‌గగా ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే ఈ ఇరువు రాష్ట్రపతి పదవికి అనువైన అభ్యర్థిని వెతుకుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం నితీష్ కుమార్‌లపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. కేసీఆర్ ఈ వ్యూహంపై కసరత్తు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటీవల ఢల్లీిలో నితీష్ కుమార్, ప్రశాంత్ కిశోర్ రహస్యం భేటీ ఉద్దేశం కూడా ఇదే అని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ టీమ్ ప్రస్తుతం తెలంగాణా ఎన్నికల్లో పనిచేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని అంచనా వేస్తోంది. పీకే గతంలో వైఎస్ జగన్ కోసం, స్టాలిన్, మమతా బెనర్జీ కోసం పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేసీఆర్ నేషనల్ ఇమేజ్ పెంచే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో బిజీ అయ్యేందుకే కేసీఆర్ రాష్ట్ర ఎన్నికల బాధ్యతను పీకే టీంకు అప్పగించారనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలో ప్రాంతీయ పార్టీల పోకడలకు భిన్నంగా ఈ సారి సరికొత్త ఎత్తుగడలతో బీజేపీ వ్యతిరేక కూటమి ముందుకు సాగాలని కేసీఆర్ ఆశిస్తున్నారు. రాబోయే కొద్ది రోజులలో దీనిపై మరింత స్పష్టత రానుంది. ఇకపోతే రాష్ట్రపతి ఎన్నికకు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ను అభ్యర్థిగా రంగంలోకి దించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు ప్రచారం బయటకు వచ్చింది. గతంలో ఆయనను రాజ్యసభ ఛైర్మన్ అంటే ఉపరాష్ట్రపతిని చేస్తారన్న టాక్ కూడా వచ్చింది. ఆజాద్ ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో చర్చలు ప్రారంభించారని తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఉన్న ఒక సీనియర్ నేతను ఇటీవల ఆజాద్ ఢల్లీి పిలిపించుకుని ఈ విషయమై మాట్లాడినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతిచ్చే విషయమై జగన్‌ను ఒప్పించాల్సిందిగా కోరినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలో ముస్లిం
నేతను అభ్యర్థిగా పెట్టడంద్వారా బీజేపీపై ఉన్న ముస్లిం వ్యతిరేక ముద్రను తొలగించుకోవడంతో పాటు రాజ్యాంగపరంగా అత్యున్నత పదవి విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించిన ఖ్యాతి దక్కుతుందని మోదీ భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆజాద్ అయితే మిగతా పార్టీలు మద్దతిస్తాయని, తమ నేత కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకించే అవకాశం ఉండదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నేతను ఎందుకు బిజెపి ప్రతిపాదిస్తుందన్న వాదనా ఉంది. రాజ్యసభలో ఉన్నప్పుడు మోదీ ఆయనతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. ఆజాద్ రాజ్యసభ నేతగా పదవీ విరమణ చేసినప్పుడు మోదీ తన అనుబంధాన్ని తలుచుకుని కంటతడిపెట్టిన విషయం తెలిసిందే. ఆయనను రాష్ట్రపతిగా ఎంపిక చేసేందుకు బీజేపీ ఎంతో ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసిందని తెలుస్తోంది. యూపీ ఎన్నికల్లో బీజేపీ సంఖ్యాబలం ఎంత తగ్గితే రాష్ట్రపతిగా ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికకు అంత ఇబ్బంది వస్తుంది. బిజెపి యూపీలో దెబ్బతింటే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతునిచ్చేందుకు పార్టీలు ముందుకురావు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆపార్టీ ప్రతిపక్షాల మద్దతు పొందేందుకు పావులు కదుపుతోందన్న వాదన కూడా ఉంది. ఎన్డీఏ నుంచి బిహార్ ముఖ్యమంత్రి, జేడీ (యూ) నేత నితీశ్ కుమార్ బయటకు వస్తే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే విషయం యోచిస్తామని ఎన్సీపీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఇటీవల అన్నారు. అయితే, నితీశ్ దీనిని ఖండిరచారు. కొన్ని రోజుల కిందట మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసిన సందర్భంలో పలు సవిూకరణాలతో పాటు రాష్ట్రపతి ఎన్నిక ప్రస్తావన వచ్చిందని రాజకీయ వర్గాలు తెలిపాయి. మొత్తానికి యూపీ ఫలితాల తర్వాత.. ఢల్లీిలో ప్రతిపక్ష రాష్టాల్ర సీఎంల భేటీ సమయంలో స్పష్టత వస్తుందని అంటున్నాయి. కాంగ్రెస్ సహా బీజేపీయేతర అన్ని పార్టీలు.. ఉమ్మడి అభ్యర్థిని నిలిపితే బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి.
జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ కీలక భూమిక పోషించడానికి సిద్ధమయ్యారు కనుక ఆయన ఢల్లీి,జార్ఖండ్ పర్యటనల్లో రాష్ట్రపతి అభ్యర్థి పైనే చర్చజరిగి ఉంటుందని భావిస్తున్నారు. అర్థమవుతోంది. ప్రతిపక్షాలను ఒక్కటి చేసే శక్తిగా ఎదగటానికి ఆయన బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడా పోటీ పడుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శిబిరంలో ప్రయత్నం జరుగుతోంది. కెసిఆర్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడటం, ఆయన ముంబై పర్యటన, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో గంటసేపు లంచ్ విూటింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో మాటా మంతీ ఇవన్నీ తొలిదశలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపైనే అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించాలనికెసిఆర్ గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. గతంలో ఎన్నడూ ప్రధానిపై మోడీపై ఇప్పుడు చేస్తున్న స్థాయిలో మాటల దాడి చేయలేదు. 2024లో మోడీ ప్రభుత్వాన్ని గ్దదె దింపేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే క్రమంలోనే కెసిఆర్ ప్రయత్నాలు సాగుతున్నాయి.